pizza
Young Hero Naga Shaurya Is Creating Sensation With 'LAKSHYA' Teaser Which Is Out On The Occasion Of His Birthday
బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజైన `లక్ష్య` టీజ‌ర్‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్నయంగ్ హీరో నాగ‌శౌర్య‌.
You are at idlebrain.com > news today >
 
Follow Us

21 January -2021
Hyderabad

Young Hero Naga Shaurya‘s 'Lakshya' is Directed by Sathossh Jarlapudi, Presented by Sonali Narang, Produced by NarayanaDas K. Narang, Puskur Ram Mohan Rao, Sharrath Marar in Sri Venkateswara Cinemas LLP, And Northstar Entertainment Pvt Ltd banners. Ketika Sharma is playing as heroine in this film while versatile actor Jagapathi Babu is playing a crucial role. Naga Shaurya's 20th film, 'Lakshya' is an ancient sports-based film which is being made for the first time in India with a backdrop of ancient archery with all commercial aspects. Naga Shaurya has put in lot of efforts for a perfect toned body. His six packed super fit physique in impressive first look created a lot of buzz. Team has released the teaser of 'Lakshya' wishing Naga Shaurya on the occasion of his birthday bringing more happiness to fans. Teaser is trending in YouTube and Twitter with superb response.

'Lakshya' Teaser begins with the voice-over of Versatile Actor Jagapathi Babu saying, " Chala mandiki aatatho gurtimpu vastundi.. kaani evadi okay pudatadu aatake gurtimpu techevadu.." Teaser is quite interesting throughout projecting Naga Shaurya as a gifted archer and his journey to become a champion. Naga Shaurya is seen in two getups in the teaser hinting various shades in his character. Final dialogues by Jagapathi Babu, "PADI lechina Vaaditho pandem.. Chala pramadakaram.." is very impressive. Kala Bhairava's background score elevated and brings in more strength to this teaser. Explosive teaser of 'Lakshya' has doubled the expectations on the film. Currently the film is undergoing it's final schedule.

The film has Naga Shaurya, Ketika Sharma, Jagapathi Babu as the lead cast.

Cinematographer: Raam Reddy, Music: Kaalabhairava, Editor: Junaid,
Producers: Narang Das K Narang, Puskur Ram Mohan Rao, Sharrath Marar,
Story, Screenplay, Direction: Santhosh Jagarlapudi

 

యంగ్ హీరో నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ల‌క్ష్య’. సోనాలి నారంగ్ స‌మ‌ర్పణ‌లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప‌తాకాల‌పై నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగ‌‌శౌర్య స‌ర‌స‌న కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో ఒక కీల‌క పాత్రలో విలక్షణ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు న‌టిస్తున్నారు. నాగ‌శౌర్య 20వ చిత్రంగా ప్రాచీన విలువిద్య నేప‌థ్యంలో స్పోర్ట్స్ బేస్డ్ ఫిలింగా అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. అందుకోసం తన శరీరాన్ని మరింత దృఢంగా మార్చుకున్నారు నాగ‌శౌర్య‌. సూపర్ ఫిట్ బాడీతో, సిక్స్ ప్యాక్‌తో ఉన్న నాగశౌర్య ఫస్ట్‌లుక్ ఆకట్టుకుంది. తాజాగా నాగశౌర్య బర్త్‌డే సందర్భంగా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ `ల‌క్ష్య` టీజ‌ర్‌ని విడుద‌ల చేసి ఫ్యాన్స్‌లో ఆనందాన్ని పెంచింది చిత్ర యూనిట్‌. ట్విట్ట‌ర్‌లో యూట్యూబ్‌లో ఈ టీజ‌ర్ ట్రెండింగ్‌లో ఉంది.

”చాలామందికి ఆట‌తో గుర్తింపు వ‌స్తుంది. కానీ ఎవ‌డో ఒక‌డు పుడ‌తాడు,.. ఆట‌కే గుర్తింపు తెచ్చేవాడు” అంటూ విల‌క్ష‌ణ న‌టుడు జగపతిబాబు వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన ఈ టీజర్ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగింది. ఈ సినిమాలో ఆర్చ‌రీలో అత్యున్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించిన వ్య‌క్తిగా నాగశౌర్య క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. రెండు విభిన్నమైన గెటప్‌లలో దర్శనమివ్వ‌డంతో నాగ‌శౌర్య‌ పాత్ర‌లో ర‌క‌ర‌కాల షేడ్స్ ఉన్నాయ‌న్న విష‌యం అర్థం అవుతోంది. చివ‌ర‌లో `ప‌డిలేచిన వాడితో పందెం చాలా ప్ర‌మాద‌క‌రం..అంటూ జ‌గ‌ప‌తి బాబు చెప్పిన డైలాగ్ ఆక‌ట్టుకుంటుంది. కాల‌బైర‌వ బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ టీజ‌ర్‌కు మరింత బలాన్నిఇచ్చింది. ఈ టీజర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ప్ర‌స్తుతం ఈ సినిమా ఫైన‌ల్ షెడ్యూల్ షూటింగ్ జ‌రుపుకుంటోంది.

యంగ్ హీరో నాగశౌర్య, కేతిక‌శ‌ర్మ, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో న‌టిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌: రామ్‌రెడ్డి, సంగీతం: కాల‌బైర‌వ‌, ఎడిట‌ర్‌: జునైద్‌, నిర్మాత‌లు: నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్, కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: సంతోష్‌ జాగర్లపూడి.

 

 

 

 

 

 



   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved