Greatest Reward Is the Audience's Love for Lenin: King Nagarjuna
నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది.. ఇల్లంతా కళకళలాడుతూ ఉంది - బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌లో అక్కినేని నాగార్జున
Every blockbuster has a story beyond the box office. For Lenin, that story was celebrated during the Blockbuster Vaibhavam event where emotions took center stage as Nagarjuna Akkineni looked back on the remarkable journey that transformed the film into a sensational success. Standing before a packed gathering, Nagarjuna admitted that the response to Lenin filled him with immense happiness.
He thanked distributors and exhibitors for standing behind the film from the beginning and said the extraordinary demand across territories reminded him of some of the biggest successes of his own career. Seeing packed theatres and enthusiastic crowds, he said, gave him confidence that meaningful cinema continues to receive wholehearted support from audiences.
Nagarjuna then spoke warmly about the people who helped shape Lenin into the blockbuster it became. The actor concluded by saying that the overwhelming response from audiences remains the biggest achievement for everyone associated with the film.
The celebrations became even more special when Naga Chaitanya spoke with pride about Akhil Akkineni. He said Akhil deserved appreciation for selecting such a rooted and emotionally powerful story and for delivering a performance that connected with audiences everywhere.
With massive collections, packed theatres and exceptional word-of-mouth, Lenin continues its victorious run while earning a special place among recent Telugu blockbusters.
నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది.. ఇల్లంతా కళకళలాడుతూ ఉంది - బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌లో అక్కినేని నాగార్జున
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన చిత్రం 'లెనిన్'. ఈ సినిమాకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 10న గ్రాండ్‌గా విడుదలై సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ క్రమంలో అక్కినేని అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లందరితో కలిసి సోమవారం నాడు బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌ను జరుపుకున్నారు. ఈ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో డిస్ట్రిబ్యూటర్లకు, సినిమా టీంకి షీల్డ్స్‌ను అందించారు. ఈ కార్యక్రమంలో..
అక్కినేని నాగార్జున మాట్లాడుతూ .. ‘డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను పిలిచి షీల్డ్స్ ఇవ్వడం అనేది అప్పుడెప్పుడో సెలెబ్రేట్ చేసుకునేవాళ్లం. ఇప్పుడు మళ్లీ ‘లెనిన్’ కోసం ఇలా నిర్వహిస్తుండటం ఆనందంగా ఉంది. ప్రతీ చోటా ఇంకా హౌస్ ఫుల్స్ పడుతున్నాయని చెబుతుంటే ఆనందంగా ఉంది. రైటర్ సత్యానంద్ గారు ఈ కథకు ఇచ్చిన ఇన్ పుట్స్ ఎంతో సహాయపడ్డాయి. రామజోగయ్య శాస్త్రి గారితోనూ పాటల గురించి ఎంతో మాట్లాడాం. మా అన్నపూర్ణ పోస్ట్ ప్రొడక్షన్ టీం అద్భుతం అని చెప్పాలి. మా సివికి రెండు రోజుల గ్యాప్‌తో సినిమాని ఇస్తే కూడా అవుట్ స్టాండింగ్ అవుట్ పుట్ ఇచ్చారు. రెండు వారాల ముందే పోస్ట్ ప్రొడక్షన్ టీంకి ఇస్తే అద్భుతంగా బయటకు తీసుకు వస్తారు. అందరూ రెండు వారాల ముందే సినిమాని పోస్ట్ ప్రొడక్షన్ టీంకి ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకప్పుడు మేం రిలీజ్ కంటే ఒక నెల ముందే పూర్తి కాపీని చూసేవాళ్లం. ఇప్పుడు అలా జరగడం లేదు. ప్రతీ ఒక్కరూ అద్భుతంగా నటించారు. అందరూ ప్రేమించి ఈ మూవీని చేశారు. ఆ ప్రేమను ఆడియెన్స్, అభిమానులంతా తిరిగి చూపించారు. ఈ ప్రేమ కోసం, అరుపుల కోసమే అఖిల్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు. మీకు (అభిమానులు) ఎలా ఉందో తెలీదు కానీ.. నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది. ఇల్లంతా కళకళలాడుతూ ఉంది. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేసి సినిమా బాగుందని చెప్తేనే హాయిగా, ఆనందంగా ఉంటుంది. షోలు పెంచుతున్నాం అని వాళ్లు చెప్తే సంతోషంగా అనిపిస్తుంది. ‘లెనిన్’ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు, అభిమానులకు థాంక్స్’ అని అన్నారు.
నాగ చైతన్య మాట్లాడుతూ .. ‘మాకు సపోర్ట్ చేస్తున్న అక్కినేని అభిమానులందరికీ థాంక్స్ తమ్ముడు కాస్త లేట్‌గా వచ్చినా.. అభిమానులు మాత్రం లేటెస్ట్‌గా సపోర్ట్ చేశారు. ఈ కథకి ఓకే చెప్పిన వెంటనే అఖిల్ సక్సెస్ కొట్టాడని ఫిక్స్ అయ్యాను. లెనిన్ కారెక్టర్‌కి, అఖిల్‌కి ఎలాంటి సంబంధం ఉండదు. కానీ లెనిన్ పాత్ర కోసం అఖిల్ పూర్తిగా మారిపోయాడు. ఓ అన్నయ్యగా, అభిమానిగా అఖిల్‌ను చూస్తే ఎంతో గర్వంగా ఉంది. నాన్న గారి ఫైర్ ఏ రేంజ్‌లో ఉంటుందో నాకు, అఖిల్‌కి మాత్రమే తెలుసు. నాన్న చేసిన డేరింగ్ స్టెప్స్‌తో ‘శివ’, ‘అన్నమయ్య’, ‘నిన్నే పెళ్లాడుతా’ వంటి చిత్రాలు వచ్చాయి. అలానే ఈ ‘లెనిన్’ను అంతే డేరింగ్‌గా తీసి చూపించారు. ఓ హీరోని ఎలా ప్రొజెక్ట్ చేయాలో నాగవంశీకి బాగా తెలుసు. ‘సవ్యసాచి’కి డైరెక్టర్ మురళీ ఏడీగా పని చేశారు. ‘లెనిన్’లోని క్లైమాక్స్, వసంత్ పర్ఫామ్ చేసిన ఓ సీన్ నాకు చాలా ఇష్టం. తమన్ అద్భుతమైన పాటలు, ఆర్ఆర్‌తో సినిమాని నెక్ట్స్ లెవెల్‌కి తీసుకు వెళ్లారు. భాగ్యశ్రీ మంచి ఆర్టిస్ట్. ఆమెకు ఓ మంచి కమర్షియల్ హిట్ పడాలని అనుకున్నాను. ప్రమోద్ అద్భుతమైన నటుడు. ఈ చిత్రంలో అందరూ అద్భుతంగా నటించారు. ఇలా షీల్డ్ ఫంక్షన్ చేసి చాలా రోజులైంది. మళ్లీ ఇలా ‘లెనిన్’ మూవీకి చేస్తుండటం ఆనందంగా ఉంది. డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు బాగుంటే.. ఇండస్ట్రీ అంతా బాగుంటుంది. ఇలాంటి ఫంక్షన్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ‘లెనిన్’ టీంకి బిగ్ కంగ్రాట్స్. నా బేబీ సిసింద్రీకి ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్’ అని అన్నారు.
అఖిల్ అక్కినేని మాట్లాడుతూ .. ‘‘లెనిన్’ గురించి చాలా మాట్లాడేశాం. రెండో రోజు నుంచే మాకు థియేటర్లు పెంచి సపోర్ట్ చేసిన డిస్ట్రిబ్యూటర్లకు థాంక్స్. మూడు రోజుల్లోనే ‘లెనిన్’ బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. సీవీ రావ్, పోస్ట్ ప్రడక్షన్ టీంకి, రజినీ గారికి, రాంబాబు, ఆనంద్ ఇలా సినిమాకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా కోసం వచ్చిన అక్కినేని అభిమానులకు థాంక్స్. అన్నయ్యకి థాంక్స్’ అని అన్నారు.
సూర్య దేవర నాగవంశీ మాట్లాడుతూ ..‘‘అక్కినేని అభిమానుల్ని కలవడం ఆనందంగా ఉంది. ఇప్పటికే మా మూవీ గురించి ఎక్కువ మాట్లాడాం. డిస్ట్రిబ్యూటర్లంతా ఇక్కడకు వచ్చారు. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అవ్వడం ఆనందంగా ఉంది. మా కోసం షోలు పెంచి సపోర్ట్ చేసిన డిస్ట్రిబ్యూటర్లందరికీ థాంక్స్’ అని అన్నారు.
దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు మాట్లాడుతూ .. ‘‘మా ‘లెనిన్’ను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్ కంటే ఏం చెప్పగలను. నాకు ఈ అవకాశం ఇచ్చిన నాగార్జున గారు, నాగవంశీ గారు, అఖిల్ గారికి థాంక్స్. థాంక్స్ అండి.. ఇంత కంటే ఏం చేప్పగలను’ అని అన్నారు.