pizza

Update on Lenin Release Date
రామ్ చరణ్ ‘పెద్ది’ కోసం ‘లెనిన్’ వాయిదా.. జూన్ 26న రానున్న అఖిల్ అక్కినేని చిత్రం

You are at idlebrain.com > news today >

28 March 2026
Hyderabad

The makers of Lenin have officially announced a change in the film’s release schedule. Initially slated for a worldwide release on May 1st, the film will now arrive in theatres on June 26, 2026.

The decision comes in light of the upcoming release of Mega Power Star Ram Charan’s Peddi, which is set to hit screens on April 30th. Out of mutual respect and to ensure a positive theatrical environment, the team of Lenin has chosen to reschedule their release.

The makers also highlighted the warm equation shared between Ram Charan and Akhil Akkineni, emphasizing that the decision reflects goodwill and a spirit of unity within the industry.

Directed by Murali Kishor Abburu, Lenin is being crafted as a complete cinematic experience, promising a blend of strong emotions and engaging storytelling. The team assures audiences that the film will be presented in its finest form, delivering a memorable big-screen experience.

The film also features music by Thaman S, adding to the overall scale and appeal.

The makers expressed their gratitude for the continued support and patience of the audience, promising that Lenin will be worth the wait.

Cast: Akhil Akkineni & Bhagyashri Borse

Written & Directed by Murali Kishor Abburu

Produced by Akkineni Nagarjuna, Suryadevara Naga Vamsi
Banners : Manam Enterprises LLP, Sithara Entertainments
Presented by Annapurna Studios
A Thaman S Musical
Editor - Navin Nooli
DOP - Leon Britto
Production Designer - Avinash Kolla

రామ్ చరణ్ ‘పెద్ది’ కోసం ‘లెనిన్’ వాయిదా.. జూన్ 26న రానున్న అఖిల్ అక్కినేని చిత్రం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం ఏప్రిల్ 30న రిలీజ్ కానున్న నేపథ్యంలో ‘లెనిన్’ టీం ఓ నిర్ణయాన్ని తీసుకుంది. రామ్ చరణ్‌తో ఉన్న అఖిల్‌ అక్కినేనికి, టీంకు ఉన్న బాండింగ్‌ కారణంగా సహృదయంతో ‘లెనిన్’ సినిమాని వాయిదా వేశారు. మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉన్న ‘లెనిన్’ చిత్రాన్ని జూన్ 26న విడుదల చేయనున్నారు.

ఏప్రిల్ 30న విడుదల కానున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ కోసమే ‘లెనిన్’ మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. పరస్పర గౌరవంతో పాటుగా, ఎక్కువ సంఖ్యలో థియేటర్ల లభ్యత, సానుకూల వాతావరణాన్ని కల్పించేందుకు, ‘లెనిన్’ బృందం విడుదలను వాయిదా వేసింది.

రామ్ చరణ్, అఖిల్ అక్కినేనిల మధ్య ఉన్న ఆత్మీయ బంధం గురించి అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని నిర్మాతలు చెబుతూ ఈ నిర్ణయం పరిశ్రమలో సద్భావనను, ఐక్యతా స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని అన్నారు.

‘లెనిన్’ మూవీని మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్నారు. బలమైన భావోద్వేగాలు, ఆకట్టుకునే కథనంతో ఒక కంప్లీట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ అందించేలా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాని అత్యుత్తమ రూపంలో అందించి, ప్రేక్షకులకు చిరస్మరణీయమైన సిల్వర్ స్క్రీన్ ఎక్స్‌పీరియెన్స్‌ను కలిగిస్తామని చిత్ర బృందం హామీ ఇస్తోంది.

ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ఆయన్ మ్యూజిక్, ఆర్ఆర్ సినిమా స్థాయిని పెంచేలా ఉంటుందని సమాచారం. ‘లెనిన్’ కోసం వెయిట్ చేస్తున్న, సపోర్ట్ చేస్తున్న ప్రతీ ఒక్క ప్రేక్షకుడికి మేకర్స్ కృతజ్ఞతలు తెలిపారు.

నటీనటులు: అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్స్ తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్స్ : మనం ఎంటర్‌ప్రైజెస్ LLP, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాతలు : అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ
సమర్పణ : అన్నపూర్ణ స్టూడియోస్
రచన & దర్శకత్వం : మురళి కిషోర్ అబ్బూరు
మ్యూజిక్ : థమన్ ఎస్
ఎడిటర్ - నవీన్ నూలి
DOP - లియోన్ బ్రిట్టో
ప్రొడక్షన్ డిజైనర్ - అవినాష్ కొల్లా

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved