pizza

Actor Vishnu Reddy about Liger film
'లైగర్' తో నా కల నిజమైయింది: విష్

You are at idlebrain.com > news today >
Follow Us

11 August 2022
Hyderabad

పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ''లైగర్''(సాలా క్రాస్‌బ్రీడ్) ఆగస్ట్ 25న విడుదలౌతుంది. ది గ్రేట్ మైక్ టైసన్ లైగర్ సినిమాతో ఇండియన్ సినిమాలో అరంగేట్రం చేస్తున్నారు. పూరి కనెక్ట్స్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన లైగర్ ట్రైలర్, పాటలు ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా అంచనాలను పెంచాయి. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో ఆగస్ట్ 25న లైగర్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా.. చిత్రంలో విలన్ పాత్ర పోషించిన నటుడు విష్ విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఆయన పంచుకున్న లైగర్ చిత్ర విశేషాలివి.

దర్శకుడు పూరీ జగన్నాథ్ తో మీ ప్రయాణం గురించి ?
పూరి గారిని కలవక ముందే ఆయన సినిమాలకు అడిక్ట్ అయ్యాను. కాలేజ్ ఎగ్గొట్టి ఆయన సినిమాలు చూస్తుండేవాడిని. నేను ఆయనకి పెద్ద ఫ్యాన్ ని. నా మార్షల్ ఆర్ట్స్ వీడియోస్ చూసి నన్ను పిలిపించారు. 2015లో ఆయన్ని కలిసా. మార్షల్ ఆర్ట్స్ నేపధ్యంలో సినిమా చేస్ద్తానని అప్పుడే లైగర్ ఐడియా చెప్పి టచ్ లో వుందామని చెప్పారు. ఆయన మెహబూబా, ఇస్మార్ట్ శంకర్, రొమాంటిక్ చిత్రాలు చేశాను. ఎట్టకేలకు లైగర్ తో నా కల తీరింది. పూరి గారు, విజయ్ దేవరకొండ, రమ్యకృష్ణ, మైక్ టైసన్ .. ఒక డ్రీం కాంబినేషన్. చాలా అదృష్టంగా భావిస్తున్నా.

పూరి కనెక్ట్స్ సిఈవో ఎలా అయ్యారు ?
పూరి గారి దగ్గరికి రాకముందు కొన్ని సినిమాలు చేశాను. జోష్ తన తొలి చిత్రం. అందులో ఒక చిన్న నెగిటివ్ పాత్ర చేశా. తర్వాత ప్రొడక్షన్, సహాయ దర్శకుడిగా కూడా పని చేసి ఇండస్ట్రీని అర్ధం చేసుకున్నాను. మెహబూబా ప్రొడక్షన్ నేనే చేశా. పూరి గారు నాపై నమ్మకం వుంచి సిఈవో గా చేశారు.

మొదటి పాన్ ఇండియా మూవీ చేయడం ఎలా అనిపించింది ?
చాలా కాలంగా మార్షల్ ఆర్ట్స్ లో వున్నా. నిరంతర శ్రమ వుంటుంది. అలాగే నటనపై కూడా చాలా హోం వర్క్ చేశా. ఇప్పుడు లైగర్ లాంటి పాన్ ఇండియా మూవీలో చేయడం గొప్ప సంతోషాన్ని ఇచ్చింది.

విజయ్, మైక్ టైషన్ లాంటి బలమైన పాత్రల మధ్య మీ రోల్ ఎలా ఉండబోతుంది ?
లైగర్ చాలా అహంకారి గల ఫైటర్ రోల్ చేస్తున్నా. విజయ్, నా పాత్రల మధ్య శత్రుత్వం ఏమిటనేది సినిమా చూస్తే అర్ధమౌతుంది. లైగర్ లో ఒక లెజెండ్ ఫైటర్ పాత్ర అవసరం ఏర్పడింది. లెజెండ్ అంటే మనకి మైక్ టైషన్ గుర్తుకువస్తారు. ఆయన కంటే బెస్ట్ ఆప్షన్ కనిపించలేదు. ఆయనకి కథ అద్భుతంగా నచ్చి ప్రాజెక్ట్ లోకి రావడం ఆనందంగా అనిపించింది.

మైక్ టైషన్ నుండి ఏం నేర్చుకున్నారు ?
చిన్నప్పటినుండి మైక్ టైసన్ కి ఫ్యాన్ బాయ్ నేను. ఆయన ఫైట్స్ చూస్తూ పెరిగాను. అయితే పర్శనల్ గా ఆయన ఎలా వుంటారో అనే ఒక ఆసక్తి వుండేది. కానీ ఆయన్ని పర్శనల్ గా చూసిన తర్వాత నా ఊహ తలకిందులైయింది. పదేళ్ళ చిన్న పిల్లాడు ఎలా ఉంటారో ఆయన అంత స్వీట్ గా వున్నారు. నేను కలసి గొప్ప వ్యక్తులు జీవితం గురించి క్లాసులు పీకలేదు. ఆయన కూడా 'నీకు సంతోషాన్ని ఇచ్చేదే చెయ్' చెప్పారు.

మైక్ టైసన్ ని తీసుకోవాలనే ఆలోచన ఎవరిది ?
పూరి గారిదే. అయన రెబల్. ఆయనకి సరహద్దులు వుండవు. పరిమితులు ఎప్పుడూ పెట్టుకోరు. నేను కూడా ఆయన లానే లిమిట్స్ పెట్టుకోను. అయితే మైక్ ని ప్రాజెక్ట్ లోకి తీసుకురావడానికి చార్మీగారు ఎక్కువ కష్టపడ్డారు. ఈ క్రెడిట్ ఆమెకే దక్కుతుంది.

మైక్ టైసన్ పాత్ర ఎలా ఉండబోతుంది ?
ఆయన లెజండ్ పాత్రలో కనిపిస్తారు. ఫైట్లు వుంటాయి. ఆయన పాత్ర ఎలా ఉండబోతుందో తెరపై చూడాల్సిందే.

మిగతా స్పోర్ట్స్ డ్రామాలకు లైగర్ కు వున్న ప్రత్యేకత ఏమిటి ?
లైగర్ స్పోర్ట్స్ డ్రామా కాదు. లైగర్ పక్కా మాస్ మసాలా యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్. ఎంఎంఏ అనేది ఒక నేపధ్యంలో వుంటుంది. అంతేకానీ ఇది స్పోర్ట్స్, బయోపిక్ కాదు. చిన్నపిల్లల దగ్గర నుండి యూత్, ఫ్యామిలీస్ , అందరూ చూసి ఎంజాయ్ చేసేలా వుంటుంది.

ట్రైలర్ టీజర్ లో ఎక్కువ బాక్సింగ్ చూపిస్తున్నారు కదా ?
బాక్సింగ్ రింగ్ తో పాటు బయటకూడా మాస్ ఫైట్లు, పాటలు కనిపించాయి కదా. అలాగే మైక్ టైసన్ కూడా మీరు గమనిస్తే బాక్సింగ్ రింగ్ లో కనిపించరు. కౌబాయ్ గెటప్ లో వున్నారు. ఆయన కమర్షియల్ పాత్రలో కనిపిస్తారు.

లైగర్ మీ కలని నెరవేరుస్తుందా ?
ఖచ్చితంగా. అద్భుతమైన బజ్ వుంది. నెంబర్ అద్భుతంగా వుంది. సిఈవోగా ఆనందంగా వుంది. పూరిగాఋ చాలా స్పీడ్ గా వుంటారు, ఆయన స్పీడ్ అందుకోవాలంటే నేను ఇంకా స్పీడ్ గా పని చేయాలి.

సిఈవో, నటుడిగా ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ?
సినిమా అంటే ఇష్టంతో ఈ పరిశ్రమలోకి వచ్చా. ఇరవై నాలుగు గంటలు పాటు షూటింగ్ చేసిన రోజులు కూడా వున్నాయి. అయితే దిన్ని కష్టంగా చూడను. ప్రేమిస్తాను.

కరణ్ జోహార్ సినిమా చేస్తున్నారా ?
లైగర్ ట్రైలర్ రిలీజైన తర్వాత రోజే కరణ్ జోహార్ ఆఫీస్ నుండి కాల్ వచ్చింది. నరేషన్ గురించి రమ్మన్నారు. అలాగే తమిళ్ నుండి కూడా అవకాశాలు వస్తున్నాయి. పూరి గారితో చెప్పాను. ట్రైలర్ లో ఒక్క గ్లింప్స్ కే ఇలా వుంటే సినిమా విడుదలైన తర్వాత ఎలా వుంటుందో చూడు అన్నారు. పూరి గారు నా గురువు. ఆయనతో అన్ని పంచుకుంటా.

ఇండస్ట్రీలో మీ ప్రయాణం ఎలా జరిగింది ?
ఇంటర్ తర్వాత ఇండస్ట్రీకి వచ్చేశాను. ఈ ప్రయాణం అంత తేలికగా జరగలేదు. చాలా ఎత్తుపల్లాలు చూశాను. కానీ నా ఈ జర్నీని ఎంజాయ్ చేశాను. నేను సింపతీని కోరుకోను. అయితే కష్టపడి వచ్చాను కాబట్టి ఎవరైన ప్రతిభ వుండి, హార్డ్ వర్క్ చేస్తున్న వారిని ప్రోత్సహించాలనుకుంటాను.

మీ కుటుంబ నేపధ్యం ఏమిటి ?
మాది చేవెళ్ళ దగ్గర కడుమూరు. అయితే పుట్టిపెరిగింది హైదరాబాద్ లోనే. నాన్న వ్యవసాయం చేస్తున్నారు. అమ్మ హోం మేకర్. ఇద్దరు సిస్టర్స్ విదేశాల్లో వున్నారు. నేను పెళ్లి చేసుకోలేదు. ఈ సినిమాని మా ఫ్యామిలీకి అంకితం చేస్తున్నా.

నెగిటివ్ పాత్రలు చేయడానికే ఇష్టపడతారా ?
నటుడిగా అన్ని పాత్రలు చేస్తాను. నేను ఒక తెల్లకాగితం. దర్శకుడు దానిపై ఏది రాస్తే అది అవుతా.

వెబ్ సిరిస్ ఆలోచనలు ఉన్నాయా ?
పూరి గారి దగ్గర చాలా కథలు వున్నాయి. నేను కూడా రాస్తాను. మంచి ఉత్సాహం వున్న టీమ్ తో కలసి పని చేయాలనీ వుంది. కంటెంట్ టీం ఏర్పడటానికి సమయం పడుతుంది. ప్రస్తుతం రెండు పాన్ ఇండియా సినిమాలు జనగణమన, లైగర్ చేస్తున్నాము. చాలా ఆలోచనలు వున్నాయి. రిజినల్, వెబ్ సిరిస్ లు పాన్ ఇండియా సినిమాలు చేయాలి. అలాగే పూరి గారితో ఒక హాలీవుడ్ సినిమాకి డైరెక్షన్ చేయించాలి.

జనగణమన షూటింగ్ ఎక్కడి వరకూ వచ్చింది ?
మొన్న ముంబై జయపూర్ షెడ్యుల్ చేశాం. లైగర్ రిలీజ్ తర్వాత కొత్త షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నాం.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved