“Little Hearts” Wins Hearts with Full Entertainment – Icon Star Allu Arjun
ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో "లిటిల్ హార్ట్స్" నవ్వించింది - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
The film Little Hearts, starring Mouli Tanuj and Shivani Nagaram, was recently released and has turned into a solid success. Along with audience love, the movie has also been receiving praise from celebrities. Most recently, Icon Star Allu Arjun watched the film and appreciated it as a refreshing love story filled with wholesome entertainment.
Sharing his thoughts on social media, Allu Arjun wrote “I watched Little Hearts. Without any melodrama or heavy messages, it made me laugh a lot. It’s a full-on entertaining, fresh love story that truly connects. Mouli and Shivani impressed with their performances. All the other actors did very well too. I really liked Sai Marthand’s directorial skill, while Sinjith’s music felt refreshing. My congratulations to Bunny Vas for presenting such a special film like Little Hearts to the audience.”
Little Hearts is an ETV Win Original Production directed by Sai Marthand, with Aditya Hassan as the producer. The film was grandly promoted and released worldwide in theatres by producers and distributors Bunny Vas under BV Works and Vamsi Nandipati under Vamsi Nandipati Entertainments.
ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో "లిటిల్ హార్ట్స్" నవ్వించింది - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన "లిటిల్ హార్ట్స్" సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణతో పాటు సెలబ్రిటీల ప్రశంసలు లభిస్తున్నాయి. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ "లిటిల్ హార్ట్స్" సినిమా చూసి ఫ్రెష్ లవ్ స్టోరీ, ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో ఆకట్టుకుందని ప్రశంసించారు.
అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ - లిటిల్ హార్ట్స్ సినిమా చూశాను. ఎలాంటి మెలొడ్రామా, సందేశాలు లేకుండా బాగా నవ్వించింది. ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఉన్న ఫ్రెష్ లవ్ స్టోరీతో ఆకట్టుకుంది. మౌళి, శివానీ తమ పర్ ఫార్మెన్స్ తో మెప్పించారు. ఇతర నటీనటులంతా బాగా నటించారు. సాయి మార్తాండ్ దర్శకత్వ ప్రతిభ నాకెంతో నచ్చింది. సింజిత్ మ్యూజిక్ రిఫ్రెషింగ్ గా అనిపించింది. లిటిల్ హార్ట్స్ లాంటి స్పెషల్ ఫిల్మ్ ను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్ కు నా అభినందనలు. అని ట్వీట్ చేశారు.
"లిటిల్ హార్ట్స్" చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను అద్భుతంగా ప్రమోట్ చేసి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ బన్నీ వాస్ తన బీవీ వర్క్స్, వంశీ నందిపాటి తన వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేట్రికల్ గా రిలీజ్ చేశారు.