"Little Hearts" – A hilarious rom-com for all age groups, says hero Mouli Tanuj
"లిటిల్ హార్ట్స్" హిలేరియస్ రోమ్ కామ్ మూవీ, అన్ని ఏజ్ గ్రూప్ ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేస్తుంది - హీరో మౌళి తనుజ్
Actor Mouli Tanuj, who shot to fame with “90s Middle Class Biopic”, is teaming up with young actress Shivani Nagaram, known for “Ambajipeta Marriage Band”, for the film “Little Hearts”. Directed by Sai Martand under the ETV Win Originals production banner, the film is produced by 90s Middle Class Biopic director Aditya Hasan. Bunny Vas and Vamsi Nandipati are releasing the film theatrically. “Little Hearts” is all set for a grand release on September 5. In a recent interview, Mouli shared key highlights about the movie.
Mouli revealed that he initially entered the industry with the dream of becoming a writer and director. During his student days, he learned editing, made short films during his B.Tech, and later promoted them through social media content. This journey helped him gain an understanding of scripts, and eventually, he got the opportunity to act, gaining recognition with “90s Middle Class Biopic”.
Talking about “Little Hearts”, Mouli said the story felt perfect for a theatrical release right from the start. With the support of ETV Win and the backing of producers Bunny Vas and Vamsi Nandipati, the movie secured a grand release. He expressed confidence that the promotional content has already set the right expectations among audiences.
Mouli personally worked on the promotional activities and scripting ideas to ensure freshness. He believes that whether in films or on social media, building credibility with content is key to winning audience trust.
“Little Hearts” is designed to appeal to audiences across all age groups, from 6 to 60. Mouli emphasized that it’s not just a youth-centric film but one that connects with all sections of the audience, a key for sustaining in theatres.
On his future goals, Mouli said he wants to act in as many good films as possible, but more importantly, he hopes to be remembered for quality movies. He also intends to fulfill his original dream of becoming a writer and director someday, as he continues to work on scripts alongside acting.
Coming from a non-film background, his family initially doubted his prospects in cinema, but after the success of “90s Middle Class Biopic”, they started believing in him.
Mouli said he takes criticism positively, as it helps improve. He admitted that while he wasn’t deeply involved in scripting “Little Hearts”, his contribution was minimal, likening it to “sprinkling coriander on biryani” made by director Sai Marthand.
He added that he wants to do films that can be comfortably watched with parents and family, something he also keeps in mind while writing scripts and creating content.
Mouli described “Little Hearts” as a fun-filled rom-com with relatable characters, one that leaves audiences with a good emotional feeling by the end. He stressed that the theatrical experience will heighten the comedy, which may not connect the same way on OTT.
Praising his co-star Shivani Nagaram for being a wonderful collaborator and music director Sinjith Yerramalli for creating magical music, he said the songs are one of the highlights of the movie. With positive buzz from the premieres, Mouli expressed strong confidence about the film’s success.
He concluded by saying “Little Hearts” is a hilarious rom-com best enjoyed in theatres and hinted that his next project will be announced soon, as he is already listening to new scripts.
"లిటిల్ హార్ట్స్" హిలేరియస్ రోమ్ కామ్ మూవీ, అన్ని ఏజ్ గ్రూప్ ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేస్తుంది - హీరో మౌళి తనుజ్
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ శివానీ నాగరం లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ "లిటిల్ హార్ట్స్". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ "లిటిల్ హార్ట్స్" మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్ గా రిలీజ్ చేస్తున్నారు. "లిటిల్ హార్ట్స్" సినిమా ఈ నెల 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు హీరో మౌళి తనుజ్.
- నేను రైటర్, డైరెక్టర్ అవుదామనే ఇండస్ట్రీకి వచ్చాను. చదువుకునే రోజుల్లో ఎడిటింగ్ నేర్చుకున్నా. బీటెక్ చదువుతూనే షార్ట్ ఫిలింస్ చేసేవాళ్లం. ఆ తర్వాత సోషల్ మీడియా కంటెంట్ చేస్తూ మా షార్ట్ ఫిలింస్ ను ప్రమోట్ చేసుకున్నాం. ఈ ప్రాసెస్ లో స్క్రిప్ట్స్ మీద అవగాహన తెచ్చుకున్నాను. ఇండస్ట్రీకి వచ్చాక నటుడిగా అవకాశం వచ్చింది. అలా "90s మిడిల్ క్లాస్ బయోపిక్"తో మీ అందరిలో గుర్తింపు తెచ్చుకున్నా.
- "లిటిల్ హార్ట్స్" కథ విన్నప్పుడే ఇది థియేట్రికల్ గా బాగుంటుందని నిర్ణయించుకున్నాం. ఈటీవీ విన్ వాళ్లు కూడా మా నిర్ణయాన్ని సపోర్ట్ చేశారు. వంశీ నందిపాటి, బన్నీ వాస్ గారు జాయిన్ కావడంతో మా మూవీకి గ్రాండ్ రిలీజ్ దొరికింది. ఇప్పుడు మా ప్రయత్నమంతా థియేటర్స్ కు ప్రేక్షకుల్ని రప్పించాలి. మా ప్రమోషనల్ కంటెంట్ తో "లిటిల్ హార్ట్స్" బాగుంటుందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కలిగింది. ఈ బ్యాచ్ మనల్ని థియేటర్స్ లో నవ్విస్తారు అనే నమ్మకం ప్రేక్షకుల్లో కలుగుతోంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం.
- ప్రమోషనల్ యాక్టివిటీస్ కోసం స్క్రిప్ట్ సైడ్ నేనే వర్క్ చేశా. కొత్తగా ఉండేలా ప్లాన్ చేశా. మనం సినిమాలో అయినా, సోషల్ మీడియాలో అయినా కంటెంట్ తో క్రెడిబిలిటీ సంపాదించుకుంటే ప్రేక్షకుల్లో మనపై నమ్మకం ఏర్పడుతుంది. ఆ ప్రయత్నం చేస్తున్నాం.
ఆరేళ్ల నుంచి అరవై ఏళ్ల వరకు అన్ని ఏజ్ గ్రూప్ ఆడియెన్స్ ను ఆకట్టుకునేలా "లిటిల్ హార్ట్స్" ఉంటుంది. ఒక్క యూత్ కోసమే చేసిన సినిమా కాదు. థియేటర్స్ లో సినిమా సస్టెయిన్ అవ్వాలంటే యూత్ తో పాటు మిగతా అందరు ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యేలా ఉండాలి. "లిటిల్ హార్ట్స్"లో అలాంటి కంటెంట్ ఉంది.
వీలైనన్ని మంచి చిత్రాల్లో నటించాలని ఉంది. ఓ పదేళ్ల తర్వాత నేను ఎన్ని సినిమాలు చేశాననేది ఎవరికీ గుర్తుండదు కానీ నేను చేసిన మంచి చిత్రాలు మాత్రం గుర్తుపెట్టుకుంటారు. అలాగే నేను రైటర్, డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చిన డ్రీమ్ కూడా ఫ్యూచర్ లో నెరవేర్చుకుంటా. స్క్రిప్ట్ వర్క్ కూడా చేస్తున్నా. ఇప్పుడు నటుడిగా అవకాశాలు వస్తున్నాయి కాబట్టి నటిస్తుంటా. మా కుటుంబంలో ఎవరికీ సినిమా ఇండస్ట్రీతో పరిచయాలు లేవు. నేను కూడా ఇక్కడ స్థిరపడగలనని మా ఫ్యామిలీ వారికి నమ్మకం లేకుండేది. "90s మిడిల్ క్లాస్ బయోపిక్" తర్వాత వారికి కొంత నమ్మకం ఏర్పడింది.
సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ చేసేప్పటి నుంచే విమర్శలు అలవాటు అయ్యాయి. రేపు మా మూవీ టికెట్ కొని థియేటర్ లోకి వెళ్లిన ఆడియెన్స్ లో కొందరికి మా సినిమా నచ్చకపోవచ్చు. వారు ఏదైనా విమర్శిస్తే పాజిటివ్ గా తీసుకుంటా. ఏదైనా లోపం ఉంటేనే విమర్శిస్తారు. ఆ లోపాన్ని సరిచేసుకుంటే ఎదుగుతామని నమ్ముతా.
"లిటిల్ హార్ట్స్" సినిమా స్క్రిప్ట్ వరకు నా ఇన్వాల్వ్ మెంట్ లేదు. మా డైరెక్టర్ సాయి మార్తాండ్ బిర్యానీ చేస్తే నేను కొత్తిమీర చల్లాను అంతే. ఆదిత్య హాసన్ గారు ప్రొడ్యూసర్ గా ఉన్నారు. ఆయన తన సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల "లిటిల్ హార్ట్స్" ప్రమోషన్స్ కు రాలేకపోతున్నారు.
అమ్మానాన్నలతో కలిసి చూసే సినిమాలే చేయాలనుకుంటున్నా. మా పేరెంట్స్ తో నేను కలిసి కంఫర్ట్ గా మూవీ చూడాలి. సినిమా చూశాక వాళ్లు మంచి సినిమా చేశావని చెప్పాలి. నేను రాసే స్క్రిప్ట్స్ కూడా అలాగే ఉంటాయి. సోషల్ మీడియా కంటెంట్ కూడా అందరికీ నచ్చేలా చేశాను. "లిటిల్ హార్ట్స్" సినిమాను మా పేరెంట్స్ ఇంకా చూడలేదు. రేపు చూపిస్తాను.
"లిటిల్ హార్ట్స్" చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. అన్ని క్యారెక్టర్స్ మీకు బాగా కనెక్ట్ అవుతాయి. రోమ్ కామ్ మూవీస్ లో చివరలో ఒక మంచి అనుభూతి కలగాలి. అలా ప్రేక్షకులు ఫీల్ అయితే సినిమా వారి మనసుకు హత్తుకున్నట్లు. "లిటిల్ హార్ట్స్" చూశాక ప్రేక్షకులు మంచి సినిమా చూశామనే అనుభూతికి లోనవుతారు.
"లిటిల్ హార్ట్స్" ప్రమోషన్స్ లో మేము జెన్యూన్ గా మాట్లాడుతున్నాం. ప్రేక్షకులకు కనెక్ట్ అవుతున్నాం. ఇలాంటి సినిమాను థియేటర్స్ లో చూస్తేనే కామెడీ ఫీల్ అవుతారు. ఓటీటీలో చూస్తే అంతగా కనెక్ట్ కారు. అందుకే థియేటర్స్ లో చూడమని కోరుతున్నాం.
శివానీ నాగరంతో వర్క్ చేయడం మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. సింజిత్ యెర్రమల్లి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. తన మ్యూజిక్ సినిమాకు వన్ ఆఫ్ ది హైలైట్ అవుతుంది. "లిటిల్ హార్ట్స్" హిలేరియస్ రోమ్ కామ్ మూవీ. థియేటర్స్ లో చూడండి. నిన్న వేసిన ప్రీమియర్స్ నుంచి మంచి టాక్ వచ్చింది. ఆ టాక్ తో మా కాన్ఫిడెంట్ మరింత పెరిగింది. నా నెక్ట్స్ మూవీ స్క్రిప్ట్స్ వింటున్నా. త్వరలో అనౌన్స్ చేస్తాను.