pizza

Little Hearts release date advanced to September 5
అనుకున్న దాని కంటే ముందే రాబోతున్న 'లిటిల్ హార్ట్స్'

You are at idlebrain.com > news today >

23 August 2025
Hyderabad

Generally, film releases tend to get delayed for various reasons. Some movies even take months or years to finally come out. But in contrast, here’s one film that is arriving earlier than planned. That film is “Little Hearts.”

The movie is directed by Sai Marthand. Producer Aditya Hasan, who earned a good reputation with the ETV Win web series #90’s, is backing this project. Mouli, who gained craze on social media with his ‘Instagram’ memes, plays the lead, while Ambajipeta Marriage Band fame Shivani Nagaram stars as the heroine. The recently released teaser has also received a positive response from the audience.

Little Hearts revolves around the story of three carefree youngsters. Actor Rajeev Kanakala will be seen playing the hero’s father in this film.

Originally, the plan was for “Mirai” to release on September 5 and “Little Hearts” on September 12. But due to certain unavoidable reasons, Mirai has been pushed by a week. As a result, Little Hearts, which was initially set for September 12, will now hit theaters a week earlier, on September 5.

Producers Bunny Vasu and Vamsi Nandipati have officially announced that the film will be released in theaters worldwide on September 5.

అనుకున్న దాని కంటే ముందే రాబోతున్న 'లిటిల్ హార్ట్స్'

సాధారణంగా సినిమాల రిలీజులు వివిధ కారణాల వలన ఆలస్యం అవ్వడాలు జరుగుతూ ఉంటాయి. కొన్నికొన్ని సినిమాలు అయితే నెలలు సంవత్సరాలు కూడా దాటిపోతుంటాయి. దానికి భిన్నంగా ఓ సినిమా అనుకున్నదానికంటే ముందే రాబోతుంది. ఆ సినిమా పేరే 'లిటిల్ హార్ట్స్'. ఈ సినిమాకు సాయి మార్తాండ్ దర్శకుడు. ఈటీవీ విన్ లో ప్రసారం అయిన '#90's' వెబ్ సిరీస్ తో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు ఆదిత్య హాసనే ఈ సినిమాకు నిర్మాత. 'ఇంస్టాగ్రామ్' మీమ్స్ తో సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకున్న మౌళీ హీరోగా, 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్' ఫేమ్ శివానీ నగరం హీరోయిన్లుగా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఇటీవలే విడుదల అయిన ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల్లో మంచి స్పందనే వచ్చింది. ముగ్గురు ఆవారాగా తిరిగే కుర్రాళ్ల కథే ఈ 'లిటిల్ హార్ట్స్'. నటుడు రాజీవ్ కనకాల హీరో తండ్రి పాత్రలో ఈ సినిమాలో కనిపించబోతున్నారు.

వాస్తవానికి నిర్మాతలు అనుకున్న తేదీల ప్రకారం 'మిరాయ్' సెప్టెంబరు 5 న, 'లిటిల్ హార్ట్స్' సెప్టెంబరు 12 న రావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన 'మిరాయ్' సినిమా ఓ వారం రోజుల తరువాత ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం కావడంతో, ఆరోజు రావడానికి సిద్ధమైన 'లిటిల్ హార్ట్స్' ఓ వారం ముందే అనగా సెప్టెంబరు 5 నే థియేటర్లలోకి రావడానికి సిద్ధమైపోయింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బన్నీ వాసు మరియు వంశీ నందిపాటి లు సంయుక్తంగా సెప్టెంబరు 5 న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించడం జరిగింది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved