‘Chaduvu Ledu’ Lyrical Song Released from Little Hearts, Movie Gears Up for Grand Theatrical Release on September 5
"లిటిల్ హార్ట్స్" మూవీ నుంచి 'చదువూ లేదు' లిరికల్ సాంగ్ విడుదల, సెప్టెంబర్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ
Actor Mouli Tanuj, known for 90s Middle Class Biopic, and young heroine Shivani Nagaram, who impressed with Ambajipeta Marriage Band, are playing the lead roles in Little Hearts. The film is directed by Sai Marthand under the ETV Win Originals production banner. 90s Middle Class Biopic director Aditya Hasan has turned producer for this project, while Bunny Vaas and Vamsi Nandipati are releasing the movie theatrically. Little Hearts is set for a grand release on September 5.
Today, the lyrical song ‘Chaduvu Ledu’ from the movie was unveiled. The catchy tune has been composed by Sinjith Yerramalli, with lyrics penned by Swaroop Goli, and sung by Jessie Gift of ‘Malleshwari Ve…’ fame. The song humorously portrays an average “Made in Telugu” student with lines like “No studies, no evening classes, yet no sense of shame… You’ve already seen higher levels, no fear at all… says he can’t do MPC, fears BiPC, claims talent isn’t his thing…” The quirky lyrics and playful music capture the essence of a typical carefree student.
Recently released teaser of the film received a huge response, and the team is confident of the same love translating into theaters as well.
Story & Direction: Sai Marthand
Producer: Aditya Hasan
PRO: GSK Media (Suresh – Srinivas)
Music: Sinjith Yerramalli
Cinematography: Surya Balaji
Editing: Sridhar Sompalli
Art Direction: Divya Pawan
Executive Producers: Vinod Nagul, Murali Punna
"లిటిల్ హార్ట్స్" మూవీ నుంచి 'చదువూ లేదు' లిరికల్ సాంగ్ విడుదల, సెప్టెంబర్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ శివానీ నాగరం లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ "లిటిల్ హార్ట్స్". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ "లిటిల్ హార్ట్స్" మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్ గా రిలీజ్ చేస్తున్నారు. "లిటిల్ హార్ట్స్" సినిమా సెప్టెంబర్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.
ఈ రోజు ఈ సినిమా నుంచి 'చదువూ లేదు' లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాటను క్యాచీ ట్యూన్ తో సింజిత్ యెర్రమల్లి కంపోజ్ చేశారు. స్వరూప్ గోలి లిరిక్స్ అందించగా, 'మళ్లీశ్వరివే..' సాంగ్ ఫేమ్ జెస్సీ గిఫ్ట్ పాడారు. 'చదువూ లేదు' పాట ఎలా ఉందో చూస్తే - ' చదువూ లేదు సంధ్యా లేదు, అయినా సూడు సిగ్గే రాదు, పైకే లెవెలూ చూశావ బ్రదరూ, లేదే ఫియరూ, ఏంటీ తీరు, ఎంపీసీ రాదంటా, బైపీసీ భయమంటా, చాతేమీ కాదంటా అయ్యో శుంఠా..' అంటూ సాగుతుందీ పాట. సగటు మేడిన్ తెలుగు స్టూడెంట్ ఎలా ఉంటాడో ఈ పాటలో చూపించారు. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. థియేటర్స్ లోనూ ఇదే ఆదరణ దక్కుతుందని "లిటిల్ హార్ట్స్" టీమ్ నమ్మకంతో ఉంది.