pizza

Love Me audio launch - Love Me is a new age cinema - Dil Raju
న్యూ ఏజ్ సినిమా ల‌వ్ మీ.. ఇఫ్ యు డేర్ - దిల్‌రాజు

You are at idlebrain.com > news today >

09 April 2024
Hyderabad

టాలెంటెడ్ యాక్టర్స్ ఆశిష్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన చిత్రం ‘లవ్ మీ’. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వాన్ని వహించారు. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. ఈ హారర్ థ్రిల్లర్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 25న రిలీజ్ చేస్తున్నారు. మంగళవారం ఈ సినిమా ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆస్కార్ గ్ర‌హీత కీర‌వాణి ఆధ్వ‌ర్యంలో సింగ‌ర్స్ పాట‌లు పాడి ఆక‌ట్టుకున్నారు...

నిర్మాత హ‌న్షిత మాట్లాడుతూ `అంద‌రికీ ఉగాది శుభాకాంక్ష‌లు. తెలుగు సినిమాలో ఇలాంటి ఆడియో లాంచ్ మ‌ళ్లీ చేయాలంటే, కీర‌వాణిగారిలాంటి మ్యూజిక్ డైర‌క్ట‌ర్ అక్క‌డ ఉండాల్సిందే. అంద‌రికీ మా సాంగ్స్ న‌చ్చాయ‌ని, గూస్‌బంప్స్ వ‌చ్చాయ‌ని అనుకుంటున్నాను. నేను సినిమా చూసి చెబుతున్నాను. డ‌బుల్‌, ట్రిపుల్ గూస్ బంప్స్ మా మూవీ చూశాక వ‌స్తాయి. మంచి పాట‌లు రాశారు చంద్ర‌బోస్‌గారు. పీసీ శ్రీరామ్‌గారి ప‌నిత‌నం గురించి ఎంత చెప్పినా త‌క్కువే. మా డైర‌క్ట‌ర్‌, హీరో, హీరోయిన్లు, మ‌రో నిర్మాత నాగ గురించి స‌క్సెస్ మీట్‌లో మాట్లాడతాను. ఏప్రిల్ 25న సినిమా విడుద‌ల‌వుతుంది. ఎప్పుడైనా, ఎవ‌రైనా గోస్ట్ ని ల‌వ్ చేశారా? ల‌వ్ చేయండి. మీకు త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది` అని అన్నారు.

డైర‌క్ట‌ర్ అరుణ్ మాట్లాడుతూ `ఈ జ‌ర్నీలో నేను నేర్చుకున్న‌ది... ఓ ద‌ర్శ‌కుడికి ముగ్గురు చాలా ఇంపార్టెంట్ అని. డైర‌క్ట‌ర్ క‌న్నా ఎక్కువ‌గా క‌థ‌ని న‌మ్మే వాడు. డైర‌క్ట‌ర్ క‌న్నా ముందే క‌థ చూసేవాడు. డైర‌క్ట‌ర్ కి తెలియ‌ని యాంగిల్‌లో క‌థ‌ను వినేవాడు... ఈ ముగ్గురూ చాలా కీల‌కం. దిల్‌రాజుగారు నాక‌న్నా ముందే క‌థ విన్నారు. పీసీగారు నా క‌న్నా ముందే క‌థ‌ను చూశారు. కీర‌వాణిగారు న‌న్ను ఆశ్చ‌ర్య‌ప‌రిచేలా క‌థ‌ను వినిపించారు. నాగ‌, నేనూ ఎక్క‌డికి వెళ్లినా క‌లిసే వెళ్లాం. 2020లో మేమిద్దరం జ‌ర్నీ స్టార్ట్ చేశాం. మేం ఏం చేసినా, దిల్‌రాజుగారు, కీర‌వాణిగారు, పీసీగారితో మంచి అనుబంధం ఉండాల‌ని కోరుకున్నాం. ఇవాళే నాకు స‌క్సెస్ మీట్‌లాగా అనిపిస్తోంది. టెక్నీషియ‌న్స్ బెస్ట్ వ‌ర్క్ ఇచ్చారు. దిల్‌రాజుగారి న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకున్నామ‌ని అనిపిస్తోంది` అని అన్నారు.

ఆర్టిస్ట్ ర‌వి మాట్లాడుతూ `ఆర్టిస్ట్ అయిన ప్ర‌తి ఒక్క‌రికీ విష్ లిస్ట్ ఉంటుంది. అందులో పీసీ స‌ర్‌, కీర‌వాణిస‌ర్‌, దిల్‌రాజుగారితో ప‌నిచేయాల‌నే కోరిక నాకు ఈ సినిమాతో తీరింది` అని అన్నారు.

హీరో ఆశిష్ మాట్లాడుతూ `హీరో ఆఫ్ ది డే కీర‌వాణిగారు. మా సినిమాను ఆయ‌న ఒప్పుకున్నందుకు చాలా హ్యాపీ. కీర‌వాణిగారు సినిమా ఒప్పుకున్న‌ప్పుడే డైర‌క్ట‌ర్ 70 శాతం స‌క్సెస్ అయిన‌ట్టు. పీసీగారు, కీర‌వాణిగారిలాంటి లెజెండ్స్ తో ప‌నిచేయ‌డం నా కెరీర్‌కి గుడ్ స్టార్ట్. లైక్‌, షేర్, సబ్‌స్క్రైబ్ సాంగ్ చాలా బావుంది. నా క‌జిన్ కి ఏ సినిమా అంత త్వ‌ర‌గా న‌చ్చ‌దు. అలాంటిది ఈ పాట చాలా బాగా న‌చ్చింద‌ని అన్నాడు. ఏప్రిల్ 25న ఈ సినిమా మెలోడీగా, ల‌వ్ స్టోరీగా, స‌స్పెన్స్ గా, హార‌ర్ గా, థ్రిల్ల‌ర్‌గా రీచ్ అవుతుంద‌ని న‌మ్ముతున్నా` అని చెప్పారు.

నాయిక వైష్ణ‌వి చైత‌న్య మాట్లాడుతూ `ల‌వ్ మీ ఎప్పుడు స్టార్ట్ అయింది.. ఎప్పుడు షూట్ అయింది.. ఎప్పుడు ఆడియో లాంచ్ వ‌ర‌కు వ‌చ్చింద‌న్న‌ది అర్థం కాలేదు. చాలా ఫాస్ట్ గా జ‌రిగింది మొత్తం. ఈ టీమ్ అంతా చాలా ఎన‌ర్జిటిక్‌గా, ఫోక‌స్‌తో ప‌నిచేశారు. వాళ్లంద‌రినీ చూసి మోటివేట్ అయ్యేదాన్ని. నేనెంత అలిసిపోయిన‌ప్ప‌టికీ, అంద‌రి ఎన‌ర్జీ చూసి హుషారు వ‌చ్చేది. చాలా నేర్చుకున్నాను నేను ఈ సినిమాతో. గ‌తంలో ఆడియో లాంచ్ అంటే చాలా ఎన‌ర్జీతో వెయిట్ చేసేవాళ్లం. నేనూ, మా అమ్మ ఓ ఆడియో లాంచ్‌కి వెళ్లి సినిమా వాళ్ల‌ని చూడ్డానికి దూరంగా నిలుచుని వెయిట్ చేశాం. ఇప్పుడు నా సెకండ్ సినిమా ఆడియో వేడుక‌కు ఇలాంటి గొప్ప వేదిక మీద ఉన్నాను. లైఫ్ ఎక్క‌డి నుంచి ఎక్క‌డికి వెళ్లిందో త‌ల‌చుకుంటుంటే అస‌లు నాకేం అర్థం కాలేదు. చాలా ఆనందంగా ఉన్నాను. సెకండ్ సినిమాకి ఇంత మంది పెద్ద వారితో ప‌నిచేయ‌డం మ‌ర్చిపోలేని అనుభూతినిస్తోంది. అస‌లు ఈ లెజెండ్స్ అంద‌రిదీ వేరే లోకం. వాళ్ల స్థాయికి అస‌లు రీచ్ కాలేమేమో అని అనుకునేదాన్ని. కానీ ఇవాళ వాళ్లంద‌రి ప‌క్క‌నా నేనున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కీర‌వాణిగారిని ఫ‌స్ట్ క‌లిసిన‌ప్పుడు చాలా భ‌య‌మేసింది. ప్రొఫెష‌న‌ల్ మ్యూజిక్ డైర‌క్ట‌ర్ ముందు కూర్చుని ఓ అన్ ప్రొఫెష‌న‌ల్ అమ్మాయిగా ఓ పాట పాడాను. `నీ వాయిస్ బావుంది పిల్లా.. బాగా పాడుతున్నావు అని ఆయ‌న అన్న‌ప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. న‌న్ను పుష్ చేసి నాతో పాట పాడించారు కీర‌వాణిగారు. నా చిన్న‌ప్పుడు అయ్య‌ప్ప పూజ‌ల్లో భ‌క్తి పాట‌లు పాడేదాన్ని. పీసీ సార్ ఎవ‌రికైనా ఫ్రేమ్ పెడితే వాళ్లు అదృష్టం చేసుకున్నార‌ని అంటారు. ఇప్పుడు మా టీమ్ మొత్తం చాలా అదృష్టం చేసుకున్న‌ది కాబ‌ట్టే, ఆయ‌న ఈ సినిమాకు ప‌నిచేశారు. డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరీ ఇది. ఏప్రిల్ 25న మా సినిమా థియేట‌ర్లలోకి వ‌స్తోంది. యూనిక్ ల‌వ్ స్టోరీ అని అంద‌రూ మెచ్చుకుంటారు. ఆశిష్ చాలా స్వీట్ ప‌ర్స‌న్‌`` అని తెలిపారు.

ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీర‌వాణి మాట్లాడుతూ `` ఆట‌గ‌ద‌రా శివ అని ఓ టైటిల్ పాట‌ని రాశారు చంద్ర‌బోస్‌గారు. ఆటగ‌ద‌రా శివ అనే ప‌దాలు త‌నికెళ్ల భ‌ర‌ణిగారి జీవితంలో ఎంత ప్ర‌ధాన‌మైన‌వో అంద‌రికీ తెలుసు. అందుకే ఆయ‌న‌కి విష‌యం చెప్పి అనుమ‌తి తీసుకుని ఈ పాట చేశాం. ఈ సినిమాకు ప‌నిచేయ‌డానికి మేం స్టూడియోలో డ్యాన్స్ చేశాం. చంద్రబోస్‌గారితో ఓ ఫైట్ కూడా చేశాం(న‌వ్వుతూ).. సినిమా పెద్ద విజ‌యం సాధించాల‌ని ఆశిస్తున్నా. అంద‌రికీ ఉగాది శుభాకాంక్ష‌లు `` అని చెప్పారు.

స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు మాట్లాడుతూ `ఈ సినిమాకు సంబంధించి ప్ర‌తి క్రెడిట్ నాగ‌, అరుణ్ కి చెందుతుంది. ఈ సినిమా మొత్తం యూత్ బ్యాచ్‌. ఈ సినిమా మొత్తానికి ముగ్గురే సీనియ‌ర్లున్నారు. అందులో ఒక‌రు పీసీగారు, రెండు కీర‌వాణిగారు, మూడు నేను. ఈ సినిమాలో డ్యాన్సులు లేవు. ఫైట్లు లేవు. కీర‌వాణిగారు మ్యూజిక్ డైర‌క్ట‌ర్ అయి 35 ఏళ్ల‌వుతోంది. మ‌న‌సు మ‌మ‌త సినిమాతో మొద‌లైంది ఆయ‌న జ‌ర్నీ. ఆస్కార్ అవార్డు తీసుకున్నా ఆయ‌న‌లో ఇంకా గొప్ప ప్యాష‌న్ ఉంటుంది. ఏదో వండ‌ర్ క్రియేట్ చేయాల‌ని, కొత్త‌వారితో క‌లిసి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు. చ‌రిత్ర‌లో నిలిచిపోయే విధంగా ఏఐ ద్వారా ఓ పాట పాడించారు. ఎక్స్ పెరిమెంట‌ల్‌గా చేశారు. కీర‌వాణిగారు ఈ సినిమా పాట‌ల్లో చేసిన‌ ప్ర‌యోగాల‌న్నీ నాకు తెలుసు. ముందు నాలుగు పాట‌ల‌నే అనుకున్నాం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కి కీర‌వాణిగారి ద‌గ్గ‌రికి సినిమా వెళ్లాక‌, మొత్తం ఏడు పాట‌లు చేశారు. ఆట‌గ‌ద‌రా శివ సాంగ్ ని ముందు అనుకోలేదు.కానీ, పాట విన్నాక చాలా మంచి వైబ్‌ అనిపించింది. ఆ పాట సినిమాను ఇంకో లెవ‌ల్‌కి తీసుకెళ్తుంది. కొత్త‌గా కొత్త కొత్త‌గా అనే పాట కూడా చాలా బావుంది. క్లైమాక్స్ లో వస్తుంది ఈ పాట‌. టోట‌ల్ సినిమాను రౌండ‌ప్ చేయ‌డానికి ఈ పాట‌ను పెట్టారు. ఈ సినిమాను కీర‌వాణిగారు చాలా బాగా ఓన్ చేసుకున్నారు. బేబీ స్టెప్స్ వేస్తున్న న్యూ జ‌న‌రేష‌న్‌కి వెన్నుద‌న్నుగా ఉన్నారు కీర‌వాణిగారు. యంగ్ బ్యాచ్‌కి ఆల్ ది బెస్ట్. న్యూ ఏజ్ ఫిల్మ్ ఇది. స‌రికొత్త‌గా ఉంటుంది. టోట‌ల్ ల‌వ్ స్టోరీ మీదే డ్రైవ్ అయ్యే సినిమా ఇది. ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతి క‌లుగుతుంది. ఇప్ప‌టిదాకా విడుద‌లైన ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌కి మంచి స్పంద‌న వ‌చ్చింది. ఆడియో ఈవెంట్స్ ని మ‌ర్చిపోయి చాలా రోజులైంది. అయినా మ‌ళ్లీ ఆ క‌ల్చ‌ర్‌ని తీసుకొస్తున్నాం. ల‌వ్ మీ టీమ్ అంద‌రికీ అడ్వాన్స్ విషెస్‌` అని అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో పీసీ శ్రీరామ్‌, శిరీష్, కాల‌భైర‌వ, నిర్మాత‌లు హ‌ర్షిత్ రెడ్డి, నాగ మ‌ల్లిడి త‌దిత‌రులు పాల్గొన్నారు.

నటీనటులు : ఆశిష్, వైష్ణవి చైతన్య తదితరులు

సాంకేతిక బృందం:
బ్యానర్ : దిల్ రాజు ప్రొడక్షన్స్
నిర్మాతలు : హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి
దర్శకుడు : అరుణ్ భీమవరపు
కెమెరామెన్ : పీసీ శ్రీరామ్
సంగీతం : కీరవాణి
ఎడిటర్ : సంతోష్ కామిరెడ్డి

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved