pizza

Nellore Sudharshan as Jack Daniels in Like, Share & Subscribe
సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, మేర్లపాక గాంధీ, ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్‌ టైన్‌మెంట్స్ “లైక్ షేర్ & సబ్‌ స్క్రైబ్” నుండి జాక్ డేనియల్స్ గా నెల్లూరు సుదర్శన్ ఫస్ట్ లుక్ విడుదల

You are at idlebrain.com > news today >
Follow Us

13 September 2022
Hyderabad

వినోదంతో కూడిన వైవిధ్యమైన చిత్రాలు రూపొందిస్తూ, విలక్షణమైన కథాంశాలని ఎంచుకుంటూ తనకంటూ ఒక మార్క్ ని సంపాదించుకున్నారు దర్శకుడు మేర్లపాక గాంధీ. తన సినిమాలన్నింటిలో వినోదం ప్రధానంగా ఉండేలా చూసుకున్నారు. ప్రస్తుతం మేర్లపాక గాంధీ కొన్ని సూపర్‌హిట్‌ లను సాధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్, ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్‌ తో 'లైక్ షేర్ & సబ్‌ స్క్రైబ్' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సంతోష్ కథానాయకుడిగా నటించిన సూపర్ హిట్' ఏక్ మినీ కథ' కు మేర్లపాక గాంధీ కథ, స్క్రీన్ ప్లే అందించినందున వారి క్రేజీ కలయికలో వస్తున్న రెండో చిత్రమిది.

యూనిక్ కాన్సెప్ట్‌ తో రూపొందుతున్న లవ్ అండ్ ఎంటర్‌ టైనర్‌ లో సంతోష్ శోభన్ జోడిగా జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. బ్లాక్ బస్టర్ హిట్ 'శ్యామ్ సింగరాయ్‌' ని అందించిన వెంకట్ బోయనపల్లికి చెందిన నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఆముక్త క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఇటివలే విదుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, టైటిల్‌ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. హీరో, హీరోయిన్ లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి నెల్లూరు సుదర్శన్ ఫస్ట్ లుక్ విడుదలైయింది. బాలీవుడ్ సినిమాటోగ్రఫర్ జాక్ డేనియల్స్ గా సుదర్శన్ ఫస్ట్ లుక్ హిలేరియస్ గా వుంది. సినిమా నుండి రివిల్ చేస్తున్న మెటీరియల్ సినిమాపై చాలా క్యూరియాసిటీని పెంచుతున్నాయి.

ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తుండగా, వసంత్ సినిమాటోగ్రాఫర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు.

తారాగణం: సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, నెల్లూరు సుదర్శన్

సాంకేతిక సిబ్బంది:
రచయిత, దర్శకత్వం: మేర్లపాక గాంధీ
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
బ్యానర్లు: ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్టైన్మెంట్
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
డీవోపీ: వసంత్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటరత్నం (వెంకట్)

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved