‘Maa Inti Bangaaram’ will Become a Big Hit for sure: Producer D. Suresh Babu Pre-Release celebrations"
‘మా ఇంటి బంగారం’ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ సెలెబ్రేషన్స్‌లో నిర్మాత డి.సురేష్ బాబు
‘Maa Inti Bangaaram’, produced jointly by Samantha, Raj Nidimoru, and Himank Duvurru under the Tralala Pictures banner, is all set for release on June 19. Directed by Nandini Reddy, the film features Samantha in the lead role. The teaser and trailer have already generated significant buzz among audiences. As part of the promotional campaign, the makers organized a grand pre-release celebration on Monday. Prominent guests including producer D. Suresh Babu, producer Swapna Dutt, producer Janhvi Narang, and director Deva Katta attended the event.
Speaking at the event, producer D. Suresh Babu said, “I hope Samantha achieves another major success with ‘Maa Inti Bangaaram.’ Samantha and Nandini previously delivered a memorable success with ‘Oh! Baby,’ and I wish this film becomes an even bigger hit. Raj and Himank have worked extremely hard on this project. The film releases on June 19, and I request everyone to watch and support it.”
Samantha said, “I want to ensure that my fans get to see at least two films from me every year. We have made a wonderful film, and I thoroughly enjoyed being a part of it as an actor. Now, as a producer, I understand the challenges and responsibilities involved. Our team hasn’t slept properly over the last week because everyone has been working tirelessly. Every department has poured their heart and soul into this film. Raj & DK and Nandini Reddy have been tremendous pillars of support. Raj & DK are among the most hardworking people I know. I thank all the guests who came to support us. I will always remain grateful to my fans for continuing to shower me with love. ‘Maa Inti Bangaaram,’ releasing on June 19, is a film that will entertain and connect with everyone.”
Producer Raj Nidimoru said, “I thank Suresh garu, Swapna, and Janhvi for being here. The Telugu film industry is filled with immense passion and love. Vasanth and Dharmendra have been the pillars behind ‘Maa Inti Bangaaram.’ Through this journey, we have had the opportunity to work with several talented artists and technicians. Working with Nandini garu was a wonderful experience. While writing the film was one challenge, Samantha’s performance elevated it to another level. She is an exceptional actress. We have worked on many Hindi projects, but the kind of excitement and response this film is receiving is something I have rarely witnessed. I hope everyone watches it on the very first day.”
Director Nandini Reddy said, “Many of us have been working around the clock for the last few days to bring this film to audiences. This has been possible only because of an incredible team that never stopped giving their best. One of the greatest strengths I have in this industry is the friendships I’ve built over the years. Working with Raj was extremely easy and enjoyable. Collaborating as a team helped us learn a lot from one another. I believe I have delivered the best possible version of the film, just as I promised. Himank carried this project on his shoulders. I also hope I have lived up to the trust Samantha placed in me. Audiences will get to see a version of Samantha unlike ever before, ten times more powerful than what they have seen so far.”
Producer Janhvi Narang said, “I’m delighted to be part of this event. I have always admired Nandini Reddy’s filmmaking style. This film feels like it was tailor-made for Samantha. Congratulations to the entire team.”
Producer Swapna Dutt said, “The trailer of ‘Maa Inti Bangaaram’ looks fantastic. Nandini Reddy is my first best friend, and Raj is also one of my earliest friends in the industry. I strongly believe this film is going to be a blockbuster. We are also re-entering film distribution through this project.”
Mythri Movie Makers producer Y. Ravi Shankar said, “There is a special positive vibration in the title ‘Maa Inti Bangaaram’ itself. Samantha is truly like gold to all of us. Every film she has done with our banner has been a blockbuster, which is why she has become our own ‘Maa Inti Bangaram.’ The action sequences featuring Samantha in a saree are stunning. I was genuinely surprised after watching the teaser and trailer. The film is expected to open big, and I hope it becomes a massive success.”
Producer Himank Duvurru said, “The moment Raj narrated the story and revealed the title, I could already visualize the outcome. Raj, Samantha, and I initially worked on the project together, and later Vasanth, Nandini, and many others joined the journey. I’m confident audiences will thoroughly enjoy the film when it releases on June 19.”
Director DK said, “We have previously worked with Samantha on two series projects, and every single time she has given her absolute best. She has done the same for this film as well. After watching the trailer, even I became excited to see the final product. I am eagerly waiting to watch the film with audiences. This is the first project Raj has done without me being directly involved, and I sincerely wish the film tremendous success.”
Director Deva Katta said, “Raj, DK, and I have been friends since our short-film days. Samantha truly is a gem. From the very first glimpse and teaser, it was clear that something special was coming. I have always admired Nandini Reddy’s filmmaking, and I believe ‘Maa Inti Bangaaram’ is destined to become a blockbuster.”
Technical Crew:
Banner: Tralala Moving Pictures
Producers: Samantha, Raj Nidimoru, Himank Duvurru
Story & Screenplay: Raj Nidimoru, Vasanth Maringanti, Sita Menon
Director: Nandini Reddy
Cinematography: Om Prakash
Music: Santhosh Narayanan
Action Directors: Lee Whittaker, Ejaz Gulab
Editor: Dharmendra Kakarala
Production Designer: Ullas Hydur
‘మా ఇంటి బంగారం’ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ సెలెబ్రేషన్స్‌లో నిర్మాత డి.సురేష్ బాబు
ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘మా ఇంటి బంగారం’. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూన్ 19న విడుదల కాబోతోంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌లతో సినిమా టీం ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది. ప్రమోషన్స్‌లో భాగంగా సోమవారం నాడు ప్రీ రిలీజ్ సెలెబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మాతలు డి.సురేష్ బాబు, స్వప్నా దత్, జాన్వీ నారంగ్, డైరెక్టర్ దేవా కట్టా తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో..
*నిర్మాత డి.సురేష్ బాబు మాట్లాడుతూ* .. ‘‘మా ఇంటి బంగారం’తో సమంతకి మంచి విజయం దక్కాలి. ‘ఓ.. బేబీ’తో సమంత, నందినీ కలిసి నాకు మంచి సక్సెస్ ఇచ్చారు. ఈ చిత్రం కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. రాజ్, హిమాంక్ చాలా కష్టపడ్డారు. జూన్ 19న ఈ సినిమా రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
*సమంత మాట్లాడుతూ* .. ‘నేను ఇకపై ఏడాదికి రెండు సినిమాలు అభిమానులకు అందించాలని అనుకుంటున్నాను. ఇప్పుడు అయితే ఓ మంచి చిత్రాన్ని చేశాం. ఇప్పటి వరకు నేను నటిగా ఎంతో ఎంజాయ్ చేశారు. నిర్మాతకు ఉండే కష్టాలు ఇప్పుడు తెలుస్తున్నాయి. గత వారం రోజులుగా మా టీం నిద్రపోవడం లేదు. ప్రతీ ఒక్క డిపార్ట్మెంట్ ప్రాణం పెట్టి పని చేసింది. రాజ్ అండ్ డీకే, నందినీ రెడ్డి నాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. రాజ్ అండ్ డీకే ఎప్పుడూ కష్టపడుతూ పని చేస్తూనే ఉంటారు. మా కోసం వచ్చిన ప్రతీ ఒక్క అతిథికి ధన్యవాదాలు. నా మీద ఇప్పటికీ అదే ప్రేమను చూపిస్తున్న అభిమానులకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. జూన్ 19న రాబోతోన్న ‘మా ఇంటి బంగారం’ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.
*నిర్మాత రాజ్ నిడిమోరు మాట్లాడుతూ* .. ‘మా కోసం వచ్చిన సురేష్ గారు, స్వప్నా, జాన్వీలకు థాంక్స్. ప్రేమ, పిచ్చి అనేది తెలుగు పరిశ్రమలోనే ఎక్కువగా ఉంటుంది. ‘మా ఇంటి బంగారం’ చిత్రానికి వసంత్, ధర్మేంద్ర పిల్లర్స్‌లా నిల్చున్నారు. ఈ జర్నీలో ఎంతో మంది గొప్ప టెక్నీషియన్లను, ఆర్టిస్టులను కలుసుకున్నాం. నందినీ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. మేం రాయడం ఒకెత్తు అయితే.. సమంత నటించడం ఇంకో ఎత్తు. సమంత ఓ అద్భుతమైన నటి. మేం హిందీలో ఎన్నో సినిమాలు చేశాం. కానీ దీనికి వస్తున్న రెస్పాన్స్, ఎగ్జైట్మెంట్ నాకు ఎక్కడా కనిపించలేదు. అందరూ ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
*డైరెక్టర్ నందినీ రెడ్డి మాట్లాడుతూ* .. ‘‘మా ఇంటి బంగారం’ కోసం గత కొన్ని రోజులుగా ఎంతో మంది నిద్ర లేకుండా పని చేస్తున్నాం. అద్భుతమైన టీం నిరంతరం శ్రమించడం వల్లే ఇదంతా సాధ్యమైంది. ఈ ఇండస్ట్రీలో నేను ఎంతో మంది స్నేహితుల్ని సంపాదించుకున్నాను. అదే నా బలం. రాజ్‌తో పని చేయడం ఎంతో సులభంగా అనిపించింది. టీంగా మేం పని చేయడం వల్ల ఎంతో నేర్చుకున్నాం. నేను ఇచ్చిన మాట ప్రకారం సినిమాని ది బెస్ట్‌గా తీశానని అనుకుంటున్నాను. హిమాంక్ ఈ మూవీని భుజానికి ఎత్తుకున్నారు. నా మీద సమంత పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని అనుకుంటున్నాను. జూన్ 19న మా చిత్రం రాబోతోంది. ఇంత వరకు చూసిన సమంత కంటే.. పది రెట్ల సమంతను చూస్తారు’ అని అన్నారు.
*నిర్మాత జాన్వీ నారంగ్ మాట్లాడుతూ* .. ‘‘మా ఇంటి బంగారం’ ఈవెంట్‌కు రావడం ఆనందంగా ఉంది. నందినీ గారి మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం. సమంత కోసమే ఈ సినిమా వచ్చినట్టుగా ఉంది. టీం అందరికీ కంగ్రాట్స్’ అని అన్నారు.
*నిర్మాత స్వప్నా దత్ మాట్లాడుతూ* .. ‘‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ బాగుంది. నందినీ రెడ్డి నాకు ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్. రాజ్‌కి నేను ఫస్ట్ ఫ్రెండ్. ఈ మూవీ బ్లాక్ బస్టర్ కానుంది. మేం మళ్లీ ఈ చిత్రంతోనే డిస్ట్రిబ్యూషన్‌లోకి వస్తున్నాం’ అని అన్నారు.
*మైత్రి వై.రవి శంకర్ మాట్లాడుతూ* .. ‘‘మా ఇంటి బంగారం’ అనే టైటిల్‌లోనే ఓ వైబ్రేషన్ ఉంది. సమంత గారు మాకు కూడా ఓ బంగారం లాంటివారే. మా బ్యానర్‌లో సమంత చేసిన ప్రతీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలా సమంత గారు మా ఇంటి బంగారం అయ్యారు. శారీలో ఆ యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి. టీజర్, ట్రైలర్ చూసి షాక్ అయ్యాను. పెద్ద ఓపెనింగ్స్ వస్తాయి. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*హిమాంక్ మాట్లాడుతూ* .. ‘రాజ్ గారు ఈ లైన్ చెప్పినప్పుడు, టైటిల్ చెప్పినప్పుడు రిజల్ట్ ముందుగానే ఊహించాను. రాజ్, సమంత, నేను ముందుగా కూర్చుని రెడీ చేశాం. ఆ తరువాత వసంత్, నందినీ ఇలా అందరూ జాయిన్ అయ్యారు. జూన్ 19న మా సినిమాని చూసి అందరూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
*డైరెక్టర్ డీకే మాట్లాడుతూ* .. ‘సమంతతో ఇది వరకు రెండు సిరీస్‌లకు పని చేశాం. ప్రతీ సారి ఆమె ప్రాణం పెట్టి నటిస్తారు. ఇందులోనూ వంద శాతం ఇచ్చారు. ట్రైలర్ చూశాక నేను ఎగ్జైట్ అయ్యాను. అందరితో కలిసి సినిమా చూడాలని నేను కూడా ఎదురు చూస్తున్నాను. నేను లేకుండా రాజ్ మొదటి సారి ఈ ప్రాజెక్ట్ చేశారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*డైరెక్టర్ దేవాకట్టా మాట్లాడుతూ* .. ‘రాజ్, డీకే, నేను కలిసి షార్ట్ ఫిల్మ్స్ తీసే టైం నుంచీ స్నేహితులం. సమంత నిజంగానే బంగారం. గ్లింప్స్, టీజర్ వచ్చినప్పటి నుంచే బంగారం రాబోతోన్నట్టుగా అర్థమైంది. నందినీ రెడ్డి గారి మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ‘మా ఇంటి బంగారం’ బ్లాక్ బస్టర్ హిట్ కాబోతోంది’ అని అన్నారు.