pizza

Star Heroine Samantha’s Action-Comedy Family Drama Maa Inti Bangaram Set for Release on June 19
జూన్ 19న రాబోతోన్న సమంత యాక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’

You are at idlebrain.com > news today >

13 May 2026
Hyderabad

Maa Inti Bangaram, produced jointly by Samantha Ruth Prabhu, Raj Nidimoru, and Himank Duvurru under the banner of Tralala Moving Pictures, has already generated huge expectations among audiences. Directed by Nandini Reddy with Samantha playing the lead role, the film has created strong buzz ever since the release of its teaser. The song “Thassadiyya” is also making waves on YouTube and gaining tremendous response from viewers.

The makers have now officially announced that the film will hit theatres on June 19th, 2026. Along with the release date announcement, they unveiled a striking new poster featuring Samantha in a traditional saree while holding a gun. Her intense expression and fierce look resemble a huntress heading into action, adding even more excitement around the film.

Since Maa Inti Bangaram marks the reunion of Samantha and Nandini Reddy after the success of Oh! Baby, the project has naturally created strong anticipation among audiences. The hype has grown further as Raj Nidimoru is providing the story and screenplay for the film.

The movie also stars Diganth and Gulshan Devaiah in prominent roles. Sreemukhi, Gautami, Anand, Lakshmi, Srinivas Gavireddy, Manjusha, and several others will also be seen in key roles.

Maa Inti Bangaram is being promoted as a wholesome entertainer that can be enjoyed by the entire family, irrespective of age. The film is set for a grand theatrical release on June 19.

Cast:
Samantha Ruth Prabhu, Diganth, Gulshan Devaiah, Sreemukhi, Gautami, Anand, Lakshmi, Srinivas Gavireddy, Manjusha and others.

Technical Crew:
Banner: Tralala Moving Pictures
Producers: Samantha Ruth Prabhu, Raj Nidimoru, Himank Duvurru
Story & Screenplay: Raj Nidimoru, Vasanth Maringanti, Sita Menon
Director: Nandini Reddy
Cinematography: Om Prakash
Music: Santhosh Narayanan
Action: Lee Whittaker, Aejaz Gulab
Editing: Dharmendra Kakarala
Production Design: Ullas Hydur

జూన్ 19న రాబోతోన్న సమంత యాక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. సమంత హీరోయిన్‌గా నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘మా ఇంటి బంగారం’ టీజర్ ఇప్పటికే అందరిలోనూ బజ్‌ను క్రియేట్ చేసింది. ‘తస్సాదియ్యా’ అనే పాట కూడా యూట్యూబ్‌ని షేక్ చేసేస్తోంది. మంచి బజ్‌ను క్రియేట్ చేసిన ఈ సినిమాని జూన్ 19న రిలీజ్ చేయబోతోన్నారు.

ఈ మేరకు రిలీజ్ డేట్‌ను రివీల్ చేస్తూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో సమంత చీరకట్టులో ఆ గన్ను పట్టుకున్న తీరు, ఆ చూస్తున్న చూపులు అదిరిపోయాయి. వేటకు వెళ్తున్న సివంగిలా సమంత లుక్ కనిపిస్తోంది. ఇక సినిమాని జూన్ 19న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు.

‘ఓ బేబీ’ తరువాత నందినీ రెడ్డి, సమంత కలిసి చేస్తున్న చిత్రం కావడంతో సహజంగానే ఆడియెన్స్‌లో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక రాజ్ నిడిమోరు స్టోరీ, స్క్రీన్ ప్లేని అందిస్తుండటంతో మరింతగా హైప్ ఏర్పడింది. ఈ సినిమాలో దిగ్నాథ్, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్ని పోషించారు. శ్రీ ముఖి, గౌతమి, ఆనంద్, లక్ష్మీ, శ్రీనివాస్ గవిరెడ్డి, మంజూష తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు.

చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసే చిత్రంగా ‘మా ఇంటి బంగారం’ రాబోతోంది. ఈ సినిమాని జూన్ 19న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.

నటీనటులు : సమంత, దిగ్నాథ్, గుల్షన్ దేవయ్య, శ్రీ ముఖి, గౌతమి, ఆనంద్, లక్ష్మీ, శ్రీనివాస్ గవిరెడ్డి, మంజూష తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్ : ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్
నిర్మాతలు : సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు
స్టోరీ, స్క్రీన్ ప్లే : రాజ్ నిడిమోరు, వసంత్ మరిన్‌గంటి, సీతా మీనన్
దర్శకత్వం : నందినీ రెడ్డి
కెమెరామెన్ : ఓం ప్రకాష్
సంగీతం : సంతోష్ నారాయణన్
యాక్షన్ : లీ విట్టేకర్, ఏజాజ్ గులాబ్
ఎడిటింగ్ : ధర్మేంద్ర కాకరాల
ప్రొడక్షన్ డిజైన్ : ఉల్లాస్ హైదుర్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved