pizza

Mangalavaaram producers Swathi Reddy Gunupati and Suresh Varma interview
Our confidence in 'Mangalavaaram' doubled after Allu Arjun liked the story: Producers Swathi Gunupati, Suresh Varma
అల్లు అర్జున్ కథ విని ఓకే చెప్పాక 'మంగళవారం'పై మాకు మరింత కాన్ఫిడెన్స్ వచ్చింది : నిర్మాతలు స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ ఇంటర్వ్యూ

You are at idlebrain.com > news today >
Follow Us

14 November 2023
Hyderabad

'Mangalavaaram' marks the debut of Swathi Reddy Gunupati as a producer. Swathi is the daughter of prominent industrialist Nimmagadda Prasad. She has produced the film in collaboration with Suresh Varma M on Mudhra Media Works. The duo is joined by Ajay Bhupathi on A Creative Works. Payal Rajput, 'Rangam' fame Ajmal Amir, Nandita Swetha, Sritej, and Shravan Reddy play major roles in this thriller set to be released in theatres on November 17 in Telugu, Tamil, Hindi, Kannada and Malayalam.

The producers today interacted with the media about the film:

Swathi garu, your family has been in the entertainment industry for 30 years. Why did you enter the field of cinema this late?

Swathi Reddy Gunupati: I don't think that way. We waited for the perfect time. I have been interested in movies since childhood. I have always been curious about the way so many people join hands to bring out a product. Many people struggle and go through a lot because they are wedded to one idea. I have known my fellow producer, Suresh Varma, for many years. When he was with us at Maa TV, I told him I wanted to produce a film. He also said that he wants to produce a film. He is senior to me in the industry. We was willing to join forces. This movie turned out better than we expected it to.

Why did you become a producer only with 'Mangalavaaram'? Have you heard any stories before this?

Suresh Varma: I listened to two or three stories before 'Mangalavaaram' happened. Ajay Bhupathi told me the story of 'Mangalavaaram' during the making of 'RX 100' itself. I found it very exciting. Ajay wanted to do something on his own banner. Meanwhile, I told some producers that Ajay had a good story. When Swathi was given a narration, she got interested.

Swathi Reddy: Although I listened to some stories, 'Mangalavaaram' is the one that really made me want to produce. Everything is destiny!

Did you get more confidence after Allu Arjun listened to the story and gave positive feedback?

Swathi Reddy: I always had the confidence. But Allu Arjun's feedback gave me the courage to do the film. He told me it would be good if I partnered with some other producer. Suresh Varma also had the same dream, so we started film production together.

When did your bonding with Bunny start?

Swathi: It started many years ago. We have been friends since before the Maa TV days. There has been a bonding between our families. We also became friends during my college days. Something funny happened when I was in college. Our HoD put forth a condition that Allu Arjun should be the chief guest for a cultural event. I requested my father to convey the same to Aravind uncle. At that time, Bunny came to the fest at our college in Bangalore. Since then we have become very close. I am close to Bunny's wife Sneha as well. My husband and Sneha were schoolmates.

Given your background, you could have chosen to work with big stars. Why then did you make a film like 'Mangalavaaram'

Swathi: While taking early steps as a producer, I thought it would be better to do a small film than to invite a lot of pressure. I want to make a film giving importance to the story. The response to 'Mangalavaram' has been fab.

*With dark thrillers, you don't know the output. On the other hand, a commercial film or a love story is easy. Isn't it?

Swathi: I love watching comedy films and entertainers more than thrillers. However, after listening to Ajay Bhupathi's narration, I was blown away. I liked the way the message was conveyed. It has music, emotions, message and other elements.

Suresh Varma: Despite being a dark thriller, this movie has all the emotions. We didn't want to make a regular film. That is one of the reasons for making this film! Every character is important.

Whose idea was it to come up with the face mask on the poster?

Suresh Varma: It was Ajay Bhupathi's idea. He conceived the story before 'Kantara'. After making many sketches, we finally zeroed in on the best mask. Not only direction, he handled a number of other responsibilities as well. So, there was no pressure on us. We started shooting after the bound script was ready. We later did a few minor improvisations.

Swathi: We gave freedom to Ajay Bhupathi. We took more time for pre-production.

Did you get any advice from Allu Arjun?

Swathi: I spoke with him over the phone. He liked 'RX 100'. It was a cult film. He liked the directorial sense in 'Maha Samudram' as well. He is very positive about 'Maha Samudram'.

When are you showing him the movie?

Swathi: Allu Arjun is busy shooting for 'Pushpa 2'. He graced the pre-release event.

Things you learned while making 'Mangalavaaram'?

Swathi: I am lucky that we got to work with a nice team. I learned a lot from Ajay Bhupathi's way of looking at anything in life. We loved the working style of music director Ajaneesh Loknath. I saw him working on the film with mad love.

Would you make films regardless of success?

Swathi: I will, definitely. Apart from cinema, many other businesses have been handled by me. We established a pizza brand. We started one kids center and one semi-conductor company.

Suresh Varma: Our boss (Swati's father Nimmagadda Prasad) has always taught us to enjoy the journey instead of being occupied with success and failure. We enjoyed the process of making this film. Irrespective of success and failure, we will make films.

The budget of 'Mangalavaaram' is higher than usual. What made you spend so much?

It seemed that Ajay Bhupathi's vision would come alive only if that much budget was spent. This is not a routine film. Audiences are watching these types of stories and genre movies. That's why I am so happy! There is no compromise in terms of music and casting.

How is the table profit before the release?

Swathi, Suresh Varma: Isn't that happy news for anyone? Our first attempt has received so much support from all. We are enjoying this moment.

What kind of response are you getting from other languages given this is a pan-Indian release?

Suresh Varma: There is a strong response. Trident Ravi is releasing the movie in Tamil. He is very happy.

Did you think of anyone before Payal for the character?

Swathi: Ajay Bhupathi did 40 to 50 auditions. During the process, Payal's name came up for discussion. But we had our doubts about her suitability. We did the look test and she fit the bill. She has worked extremely hard.

What is your next movie going to be like?

Swathi: Nothing has been finalized. We will definitely do something that excites us.

Big heroes like Allu Arjun and Ram Charan are your friends! Are there any plans to make a film with them?

Suresh Varma: We might, in the future.

Swathi: There are no such plans as of now. They are busy with their current commitments. I don't like to mix friendship and business. They are good friends. They will support me. I have to prove myself first. I will prove myself and ask them when I feel confident.

Chiranjeevi garu tweeted the trailer and said nice things about you. How did it feel?

Swathi: It was a very emotional moment. Chiranjeevi garu used to tell me I am like my father. Everyone was surprised after seeing the teaser and trailer of 'Mangalavaaram'. I didn't get a single message after the poster was released because nobody knew it was me who was the producer. They couldn't make it from my surname Gunupati on the poster. My father was happy that I did the film in collaboration with Suresh Varma.

Suresh Varma: I have always been a huge fan of Chiranjeevi garu. As a youngster, I used to pine for a meeting with me. I not only got to work with him but he also supported my first movie.

 

'మంగళవారం' సినిమాతో ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కుమార్తె స్వాతి రెడ్డి గునుపాటి నిర్మాతగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు అజయ్ భూపతికి చెందిన 'ఏ' క్రియేటివ్ వర్క్స్ సంస్థతో కలిసి ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై ఎం. సురేష్ వర్మతో కలిసి చిత్రాన్ని నిర్మించారు. పాయల్ రాజ్‌ పుత్, 'రంగం' ఫేమ్ అజ్మల్ అమీర్ జంటగా... నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్, శ్రవణ్ రెడ్డి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమా నవంబర్ 17న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు స్వాతి, సురేష్ వర్మ మీడియాతో మాట్లాడారు.

స్వాతి గారు... మీ కుటుంబం ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో 30 ఏళ్ల నుంచి ఉంది. ఈ సినిమా రంగంలో మీరు రావడం కొంచెం ఆలస్యమైందా?
స్వాతి రెడ్డి గునుపాటి : ఆలస్యం అయ్యిందని అనుకోను. ఇంతకు మించి పర్ఫెక్ట్ టైమింగ్ మాకు కుదిరేది కాదేమో!? నాకు చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి. ఎందుకంటే... ఇంత మంది ఓ సినిమా ఎలా చేస్తారని నాలో క్యూరియాసిటీ ఉంది. ఓ ఐడియాను ఎంతో మంది నమ్మి కష్టపడతారు. మాటీవీలో చేరినప్పుడు సురేష్ వర్మ గారిని ఎన్నో సందేహాలకు సమాధానాలు తెలుసుకున్నా. మాటీవీలో ఉండగా సినిమా ప్రొడ్యూస్ చేయాలని ఉందని ఆయనతో చెప్పాను. ఆయనకూ సినిమా ప్రొడ్యూస్ చేయాలని ఉందని చెప్పారు. ఇండస్ట్రీలో ఆయన నా కంటే సీనియర్. చేస్తే కలిసే చేయాలనుకున్నాం. నేను లేకుండా ఆయన చేయలేదు. ఆయన లేకుండా నేను సినిమా చేయలేదు. మేం అనుకున్న దానికంటే సినిమా బాగా వచ్చింది. 

'మంగళవారం'తోనే ఎందుకు నిర్మాతగా మారారు? దీని కంటే ముందు ఏవైనా కథలు విన్నారా?
సురేష్ వర్మ : 'మంగళవారం' కంటే ముందు రెండు మూడు కథలు విన్నామంతే! 'ఆర్ఎక్స్ 100' టైంలో అజయ్ భూపతి 'మంగళవారం' కథ నాకు చెప్పారు. ఎగ్జైట్ చేసిన కథ ఇది. అజయ్ ఏమో తన సొంత సంస్థలో చేయాలని అనుకున్నాడు. ఆ మధ్యలో నేను కూడా కొందరు నిర్మాతలకు అజయ్ దగ్గర మంచి కథ ఉందని చెప్పా. స్వాతి గారికి అజయ్ దగ్గర కథ గురించి చెబితే... 'విందాం! రమ్మనండి' అని అడిగా.స్వాతి రెడ్డి : మధ్యలో కథలు విన్నప్పటికీ... నేను ప్రొడ్యూస్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు ఈ కథ వచ్చింది. అంతా డెస్టినీ! అలా కుదిరింది. 

అల్లు అర్జున్ కథ విని ఓకే అన్నాక ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చిందా?
స్వాతి : నేను అప్పటికి 80 పర్సెంట్ అనుకున్నా. నాలో కాన్ఫిడెన్స్ ఉంది. అయితే అల్లు అర్జున్ వల్ల సినిమా చేయాలనే ధైర్యం వచ్చింది. 'ఎందుకు కలగా వదిలేయాలి. నువ్వు ట్రై చెయ్. చేసినప్పుడు నీతో ఎవవరైనా పార్ట్నర్ ఉంటే బావుంటుంది' అని చెప్పాడు. సురేష్ వర్మ గారికి కూడా సేమ్ డ్రీమ్ ఉండటంతో ఇద్దరం కలిసి ఫిల్మ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశాం. 

బన్నీతో మీ బాండింగ్ ఎప్పుడు మొదలైంది?
స్వాతి : చాలా ఏళ్ళ క్రితమే. 'మా టీవీ' కంటే ముందు నుంచి మేం ఫ్రెండ్స్. మా ఫ్యామిలీస్ మధ్య బాండింగ్ ఉంది. మేం కూడా ఫ్రెండ్స్ అయ్యాం. ఒక ఫన్నీ స్టోరీ ఏంటంటే... నేను కాలేజీలో ఉన్నప్పుడు 'అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రావాలి' అని మా హెచ్ఓడి కండిషన్ పెట్టారు. నాన్నను రిక్వెస్ట్ చేశా. అరవింద్ అంకుల్ గారికి చెప్పమని అడిగా. ఆ టైంలో బెంగళూరు మా కాలేజీలో ఫెస్ట్ కి బన్నీ వచ్చారు. అప్పటి నుంచి మేం చాలా క్లోజ్ అయ్యాం. బన్నీ వైఫ్ స్నేహకి నేను క్లోజ్. మా ఆయన ప్రణవ్, స్నేహ స్కూల్ మేట్స్. అలా మరింత దగ్గర అయ్యాం. 

మీకున్న నేపథ్యానికి పెద్ద హీరోలను కూడా ఎంపిక చేసుకోవచ్చు. స్టార్ హీరోలతో సినిమాలు చేయవచ్చు. 'మంగళవారం' చేయడానికి కారణం?
స్వాతి : నిర్మాతగా అడుగులు వేస్తున్నప్పుడు పెద్ద ప్రెజర్ పెట్టుకోవడం కంటే చిన్న సినిమా చేయడం మంచిదని అనుకున్నా. కథకు ప్రాముఖ్యం ఇస్తూ టీమ్ వర్క్ ఉండేలా సినిమా చేయాలనుకున్నా. ఇప్పుడు 'మంగళవారం' సినిమాకు వస్తున్న స్పందనను కలలో కూడా ఊహించలేదు.  

కమర్షియల్ సినిమా, లవ్ స్టోరీ చేయడం కంటే డార్క్ థ్రిల్లర్ ఎలా వస్తుందో ఊహించడం కష్టం కదా!
స్వాతి : ఈ జానర్ ఫిల్మ్ చేయాలని అనుకోలేదు. కామెడీ ఫిలిమ్స్ ఎక్కువ చూస్తా. థ్రిల్లర్స్ తక్కువ. అజయ్ భూపతి గారి నేరేషన్ విని 'ఈ మూవీ చేస్తే బావుంటుంది' అనిపించింది. సినిమాలో ఓ సందేశాన్ని చెప్పిన విధానం బాగా నచ్చింది. ఇందులో మ్యూజిక్, ఎమోషన్స్, మెసేజ్... అన్నీ ఉన్నాయి.
సురేష్ వర్మ : డార్క్ థ్రిల్లర్ అయినప్పటికీ... ఈ సినిమాలో ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. ముందు నుంచి రెగ్యులర్ సినిమా చేయాలని మేం అనుకోలేదు. అదీ ఈ సినిమా చేయడానికి ఓ కారణం! ప్రతి పాత్రకు ప్రాముఖ్యం ఉంది. 

ఫేస్ మాస్క్ డిజైన్ ఐడియా ఎవరిది?
సురేష్ వర్మ : అజయ్ భూపతి ఐడియా అది. 'కాంతార'కు ముందు కథ చెప్పాడు. ఆ టైంలో మాస్క్ గురించి చెప్పాడు. ఎన్నో స్కెచ్లు వేయించి చివరికి ఈ మాస్క్ ఓకే చేశాం. దర్శకత్వం మాత్రమే కాకుండా చాలా బాధ్యతలు చూసుకున్నారు. బాగా హ్యాండిల్ చేశాడు. అందువల్ల, మా మీద ఒత్తిడి లేదు. బౌండ్ స్క్రిప్ట్ రెడీ అయ్యాక షూటింగ్ స్టార్ట్ చేశాం. కొన్ని ఇంప్రవైజేషన్స్ చేశాడంతే!స్వాతి : అజయ్ భూపతికి మేం ఫ్రీడమ్ ఇచ్చాం. అయితే... ప్రతిదీ మాకు చెప్పి, మా సలహాలు తీసుకుని నిర్ణయం తీసుకున్నారు. మేం ప్రీ ప్రొడక్షన్ కోసం ఎక్కువ టైం తీసుకున్నాం. 

అల్లు అర్జున్ నుంచి సలహాలు ఏమైనా వచ్చాయా?
స్వాతి : బన్నీని అజయ్ భూపతి కలిసినప్పుడు నేను లేను. తర్వాత ఫోనులో నేను మాట్లాడా. 'ఆర్ఎక్స్ 100' కల్ట్ ఫిల్మ్. 'మహాసముద్రం' కూడా బన్నీకి ఇష్టం. అజయ్ భూపతి డైరెక్షన్ సెన్స్ ఇష్టం. 

ఆయనకు సినిమా ఎప్పుడు చూపిస్తున్నారు?
స్వాతి : (నవ్వుతూ...) అల్లు అర్జున్ షూటింగులో బిజీగా ఉన్నారు. ప్రీ రిలీజ్ రోజు కూడా షూటింగ్ నుంచి డైరెక్టుగా వచ్చారు.సురేష్ వర్మ : ఫస్ట్ డే నుంచి అల్లు అర్జున్ మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. పోస్టర్ రిలీజ్ నుంచి ప్రతి విషయంలో ఎగ్జైట్ అయ్యారు.  

'మంగళవారం' నిర్మాణంలో మీరు నేర్చుకున్న విషయాలు?
స్వాతి : మంచి దర్శకుడు, టీమ్ లభించింది. అందుకు నేను లక్కీ. జీవితంలో ఏ విషయాన్నైనా అజయ్ భూపతి చూసే విధానం నుంచి నేను చాలా నేర్చుకున్నా. ఇలా కూడా ఆలోచిస్తారా? అనిపించింది. సంగీత దర్శకుడు అజనీష్ వర్కింగ్ స్టైల్ నచ్చింది. పిచ్చి ప్రేమతో సినిమాకు వర్క్ చేయడం చూశా. 

జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తారా?
స్వాతి : తప్పకుండా చేస్తా. ఈ ఏడాది సినిమా కాకుండా ఇంకా చాలా వ్యాపారాలు స్టార్ట్ చేశా. పిజ్జా బ్రాండ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశా. కిడ్స్ సెంటర్ ఒకటి, సెమి కండక్టర్ కంపెనీ ఒకటి స్టార్ట్ చేశాం.సురేష్ వర్మ : సక్సెస్ ఫెయిల్యూర్ అని కాకుండా ప్రాసెస్ ఎంజాయ్ చేయడం మా బాస్, స్వాతి ఫాదర్ నిమ్మగ్గడ్డ ప్రసాద్ గారు నేర్పించారు. మేం ఈ సినిమా ప్రాసెస్ ఎంజాయ్ చేశాం. మాటీవీలో కూడా ఎంజాయ్ చేస్తూ పని చేశాం. జయాపజయాలతో సంబంధం లేకుండా, మా ప్రయత్నలోపం లేకుండా సినిమాలు చేస్తాం. 

నార్మల్ సినిమా కంటే ఎక్కువ బడ్జెట్ అయ్యిందన్నారు. అప్పుడు మీకు రిస్క్ అనిపించిందా?
స్వాతి : మేం ముందు అనుకున్న బడ్జెట్ కంటే కొంచెం స్కేల్ పెరిగింది. ఆ బడ్జెట్ పెడితే అజయ్ భూపతి గారి విజన్ స్క్రీన్ మీదకు వస్తుందని అనిపించింది. రొటీన్ కాకుండా డిఫరెంట్ గాచేశాం. ఈ తరహా కథలు, జానర్ సినిమాలను ప్రేక్షకులు చూస్తున్నారు. అందుకని, హ్యాపీ! మ్యూజిక్, నటీనటుల విషయంలో కాంప్రమైజ్ కాలేదు. 

విడుదలకు ముందు టేబుల్ ప్రాఫిట్ రావడం ఎలా ఉంది?
స్వాతి, సురేష్ వర్మ : (నవ్వుతూ...)  అది ఎవరికైనా సంతోషం కలిగించే వార్తే కదా! మా మొదటి ప్రయత్నానికి అందరి నుంచి మంచి మద్దతు లభించింది. ఈ మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నాం. 

మిగతా భాషల నుంచి ఎటువంటి స్పందన లభిస్తోంది?
సురేష్ వర్మ : మంచి స్పందన ఉంది. తమిళంలో ట్రైడెంట్ రవి గారు విడుదల చేస్తున్నారు. ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు.

పాయల్ కంటే ముందు ఎవరినైనా అనుకున్నారా?
స్వాతి : అజయ్ భూపతి గారు 40, 50 ఆడిషన్స్ చేశారు. మధ్యలో పాయల్ పేరు చర్చకు వచ్చింది. కానీ, ఆమె ఇంతకు ముందు చేసిన పాత్రల కారణంగా ఈ సినిమాలో పాత్రకు సూట్ అవుతుందా? లేదా? అని సందేహం కలిగింది. మేం లుక్ టెస్ట్ చేసిన తర్వాత ఓకే చేశాం. పాయల్ కు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఎంతో కష్టపడి చేసింది.

నెక్స్ట్ సినిమా?
స్వాతి : ఆలోచిస్తున్నాం. మళ్ళీ మేం ఎగ్జైట్ అయినప్పుడు తప్పకుండా చేస్తాం.

అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి పెద్ద హీరోలు మీకు ఫ్రెండ్స్! వాళ్ళతో సినిమా చేసే ప్లాన్స్ ఉన్నాయా?
సురేష్ వర్మ : భవిష్యత్తులో చేయవచ్చు. స్వాతి : ప్రస్తుతానికి అటువంటి ప్లాన్స్ లేవు. వాళ్ళ వాళ్ళ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. నాకు స్నేహాన్ని, వ్యాపారాన్ని ముడిపెట్టడం నాకు అంతగా ఇష్టం లేదు. వాళ్ళు మంచి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేస్తారు. అలాగని, వెంటనే అడగలేను. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. నన్ను నేను ప్రూవ్ చేసుకుని, కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు వాళ్ళను అడుగుతా. ఇప్పుడు అడిగితే నా కోసం వాళ్ళు చేస్తారు. అలాగని, నేను అడగలేను.

చిరంజీవి గారు ట్రైలర్ ట్వీట్ చేసి మీ గురించి బాగా చెప్పారు. ఎలా అనిపించింది?
స్వాతి : చాలా ఎమోషనల్ మూమెంట్ అది. పిల్లలంతా కలిసి ఉంటాం. 'నువ్వు కూడా మీ నాన్నలానే' అని కలిసినప్పుడు అంటూ ఉంటారు. 'మంగళవారం' టీజర్, ట్రైలర్ చూసి అందరూ సర్‌ప్రైజ్ అయ్యారు. పోస్టర్ విడుదలైన తర్వాత నాకు ఒక్క మెసేజ్ కూడా రాలేదు. పెళ్లి తర్వాత ఇంటి పేరు మార్చుకున్నా. (నిమ్మగడ్డ నుంచి గునుపాటి). నాన్నకు టీజర్ చూపించినప్పుడు పేరు చూసి 'సురేష్ తో కలిసి నువ్వు చేస్తున్నావా?' అని అడిగారు. అప్పుడు హ్యాపీ ఫీలయ్యారు. సురేష్ వర్మ : నేను చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్. చిన్నప్పుడు చూస్తే చాలు అని ఫీలయ్యా. ఈ రోజు మా సినిమాకు ఆయన ట్వీట్ చేయడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved