pizza

Ajay Bhupathi’s rare village action thriller ‘Mangalavaaram’ shoot wrapped up!
అజయ్ భూపతి రేర్ విలేజ్ యాక్షన్ థ్రిల్లర్ 'మంగళవారం' చిత్రీకరణ పూర్తి

You are at idlebrain.com > news today >
Follow Us

13 June 2023
Hyderabad

After his cult blockbuster RX100, director Ajay Bhupathi teams up with actress Payal Rajput for his next ‘Mangalavaaram’.

Earlier, the first look of her as ‘Shailaja’ from this new film garnered immense attention and applause from critics and audiences.

Leaving no stone unturned in the filming, the team has successfully wrapped up the 99 days of shoot on June 12th and are now heading to the post production works.

Producers Swathi Gunupati and Suresh Varma M said "We’re happy for the response to the first look of Payal Rajput from our film. We’re making Mangalavaaram on uncompromised quality and content standards. We finally wrapped up the 99 days of shooting on June 12th. That includes 48 days of day shoot and 51 days of night shoot. Our director Ajay Bhupathi is filming the content of the genre that’s never-seen-before on Indian screen. Stay tuned for the teaser and trailer updates dropping soon."

Speaking on the occasion, the director-producer Ajay Bhupati said “Our Mangalavaaram is a village-based rare action-thriller. It sticks to our nativity while being Raw and Rustic to visuals and emotions. There are 30 characters in the story and every character has got a certain place in the larger scheme of the film. Each and every character is important. Wrapping up the shoot, we’re pacing up our post production works. ‘Kantara’ fame Ajaneesh Loknath is scoring music for this film and thus the background score is going to be a major highlight of the film."

Interestingly, Ajay is debuting as a producer along with Swathi Gunupati and Suresh Varma M. Releasing in Telugu, Tamil, Kannada and Malayalam languages, it’s a joint venture of Mudra Media Works and A Creative Works.

Producers: Swathi Reddy Gunupati, Suresh Varma M
Director: Ajay Bhupathi
Music Director: B. Ajaneesh Loknath
Cinematography: Sivendra Dasaradhi
Production Designer: Raghu Kulakarni
Art Director: Mohan Talluri
Fight Masters: Real satish, Pruthvi
Choreographer: Bhanu
Editor: Madhav Kumar Gullapalli
Dialogue Writer: Tajuddin Syed, Kalyan Raghav
Executive Producer: Saikumar Yadavilli
Costume Designer: Mudasar mohammad
Digital Marketing: Talk Scoop

అజయ్ భూపతి రేర్ విలేజ్ యాక్షన్ థ్రిల్లర్ 'మంగళవారం' చిత్రీకరణ పూర్తి

అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా 'మంగళవారం'. 'ఆర్ఎక్స్ 100' వంటి కల్ట్ హిట్ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో మరోసారి పాయల్ రాజ్‌పుత్ నటిస్తున్న చిత్రమిది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతోంది. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. 

నిర్మాత స్వాతి రెడ్డి గునుపాటి మాట్లాడుతూ ''కంటెంట్, క్వాలిటీ పరంగా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్న సినిమా 'మంగళవారం'. జూన్ 12తో షూటింగ్ కంప్లీట్ చేశాం. సినిమా పూర్తి చేయడానికి మొత్తం 99 రోజులు పట్టింది. అందులో కేవలం 48 రోజులు పగటి పూట షూటింగ్ చేశాం. 51 రోజులు రాత్రి వేళల్లో చిత్రీకరణ చేశాం. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద రానటువంటి జానర్ కథతో అజయ్ భూపతి అద్భుతమైన సినిమా తీస్తున్నారు. సాంకేతికంగా ఉన్నత నిర్మాణ విలువలతో రూపొందిస్తున్న చిత్రమిది. త్వరలో టీజర్, ట్రైలర్ విడుదల తేదీలు, ఇతర వివరాలు వెల్లడిస్తాం. కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన పాయల్ ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ లభించడం సంతోషంగా ఉంది'' అని చెప్పారు 

చిత్ర దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ ''గ్రామీణ నేపథ్యంలో నేటివిటీతో కూడిన కథతో తీస్తున్న చిత్రమిది. డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్. థియేటర్లలో కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. సినిమాలో మొత్తం 30 పాత్రలు ఉన్నాయి. ప్రతి పాత్రకు కథలో ప్రాముఖ్యం ఉంటుంది. నిర్మాణాంతర కార్యక్రమాలు త్వరలో ప్రారంభిస్తాం. 'కాంతార' ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. నేపథ్య సంగీతం సినిమా హైలైట్స్‌లో ఒకటి అవుతుంది'' అని చెప్పారు.

'మంగళవారం' చిత్రానికి అజయ్ భూపతి 'A' క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ భాగస్వామి. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎంతో కలిసి చిత్రాన్ని నిర్మిస్తోంది. 

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : దాశరథి శివేంద్ర, మ్యూజిక్ : 'కాంతార' ఫేమ్ బి. అజనీష్ లోక్‌నాథ్, ఎడిటర్ : మాధవ్ కుమార్ గుళ్ళపల్లి, మాటలు : తాజుద్దీన్ సయ్యద్, రాఘవ్, ఆర్ట్ డైరెక్టర్ : మోహన్ తాళ్లూరి, ప్రొడక్షన్ డిజైనర్ : రఘు కులకర్ణి,  ఫైట్ మాస్టర్స్ : రియల్ సతీష్, పృథ్వీ, సౌండ్ డిజైనర్ & ఆడియోగ్రఫీ : 'నేషనల్ అవార్డ్ విన్నర్' రాజా కృష్ణన్, కొరియోగ్రఫీ : భాను, కాస్ట్యూమ్ డిజైనర్ : ముదాసర్ మొహ్మద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయికుమార్ యాదవిల్లి, పీఆర్వో : పులగం చిన్నారాయణ, డిజిటల్ మార్కెటింగ్ : టాక్ స్కూప్, నిర్మాతలు : స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : అజయ్ భూపతి.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved