pizza

Chilaka Productions next Mareechika first single Andhee Andhani Andham is out now; Hitting Big Screens in May 29th
చిల‌కా ప్రొడ‌క్ష‌న్స్ రూపొందిస్తోన్న చిత్రం ‘మరీచిక’ నుంచి ‘అందీ అంద‌ని అందం..’ సాంగ్ విడుద‌ల‌.. మే 29న మూవీ గ్రాండ్ రిలీజ్‌

You are at idlebrain.com > news today >

20 May 2026
Hyderabad

National Award-winning filmmaker Satish Kasetty is all set to captivate Telugu audiences once again with his upcoming thriller Mareechika. Known for presenting unique and thought-provoking concepts on screen, the director appears to have crafted another intriguing cinematic experience. Featuring Regina Cassandra, Anupama Parameswaran and Viraj Ashwin in lead roles, the film is gearing up for a grand theatrical release on May 29.

Backed by passionate producers Rajiv Chilaka and Meghhaa Chilakka under the Chilaka Productions banner, the film has already started creating strong curiosity with its intense theatrical trailer. The makers have unveiled a beautiful new song today that beautifully captures the bond between Viraj Ashwin, Regina Cassandra, and Anupama.

Titled Andhee Andhani Andham, the melodious track has been crooned by Karthik and Shweta Mohan, adding soulful depth to the emotions portrayed on screen. Renowned lyricist Lakshmi Bhupala has penned meaningful and touching lyrics for the song.

Legendary composer Ilaiyaraaja once again proves his musical brilliance with a refreshing and heartwarming composition. The tune feels fresh, soothing, and instantly addictive, carrying emotions that are sure to connect with listeners of all ages. His timeless magic continues to create melodies that stay with the audience long after listening.

The song beautifully showcases the friendship, love, and emotional moments shared between the three lead characters. With its soulful vibe and emotional richness, Andhee Andhani Andham is all set to become a favorite on everyone’s playlist.

With visually engaging storytelling, emotionally layered performances and a suspense-filled narrative, Mareechika promises to offer Telugu audiences a fresh and thrilling cinematic experience on the big screen.

Cast: Viraj Ashwin, Regina Cassandra, Anupama Parameswaran

Technical Team:

Banner: Chilaka Productions
Director: Satish Kasetty
Story, Lyrics & Dialogues: Lakshmi Bhupala
Producer: Rajiv Chilaka, Meghhaa Chilakka
Co Producer: Bharat Laxmipathi
Executive Producer: Vijay Donkada
Dop: Arvind Kannabiran
Music: Ilaiyaraaja
Editor: Junaid Siddiqui
Art Director: Vithal Kosanam
Creative Producer - Akshita Akki
Audio On: Aditya Music

చిల‌కా ప్రొడ‌క్ష‌న్స్ రూపొందిస్తోన్న చిత్రం ‘మరీచిక’ నుంచి ‘అందీ అంద‌ని అందం..’ సాంగ్ విడుద‌ల‌.. మే 29న మూవీ గ్రాండ్ రిలీజ్‌

నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్‌ సతీష్ కాసెట్టి తన కొత్త థ్రిల్లర్ మూవీ ‘మరీచిక’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. వైవిధ్యమైన , ఆలోచింపజేసే కథలను చూపడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన డైరెక్టర్ మరోసారి తనదైన శైలిలో ఈసారి కూడా ఆసక్తికరమైన సినీ అనుభూతిని అందించినట్టు ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తోంది.ఈ చిత్రంలో రెజీనా కసాండ్రా, అనుపమ పరమేశ్వరన్, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా మే 29న భారీ స్థాయిలో థియేటర్లలో భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది.

చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక, మేఘా చిలక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌లై సూప‌ర్బ్ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంది. మూవీపై అంచ‌నాలు పెరిగాయి. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ ఈ సినిమా నుంచి బుధ‌వారం రోజున ‘అందీ అంద‌ని అందం’ అనే పాట‌ను విడుద‌ల చేశారు. విరాజ్ అశ్విన్‌, రెజీనా క‌సాండ్రా, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ మ‌ధ్య ఉండే అనుబంధాన్ని ఈ పాట తెలియజేస్తోంది.

‘అందీ అంద‌ని అందం’ అంటూ సాగే ఈ మధురమైన పాటను కార్తీక్‌, శ్వేతా మోహ‌న్ ఆలపించారు. వీరి గాత్రం తెరపై కనిపించే భావోద్వేగాలకు మరింత గాఢ‌తను తీసుకొచ్చింది. ప్రముఖ గేయ రచయిత ల‌క్ష్మీ భూపాల‌ ఈ పాటకు అర్థవంతమైన, హృదయాన్ని తాకేలా చ‌క్క‌టి సాహిత్యాన్ని అందించారు.

లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా మరోసారి తన అద్భుతమైన సంగీత ప్రతిభను చూపించారు. ఆయన స్వరపరిచిన ఈ పాట ఎంతో కొత్తగా, మనసుకు హాయిగా అనిపిస్తూ మొదటిసారి విన్న‌ప్పుడే ఆక‌ట్టుకుంటోంది. అన్ని వయసుల వారినీ తాకే భావోద్వేగాలతో ఈ సాంగ్‌ను రూపొందించారు. పాట విన్న‌ తర్వాత కూడా చాలా సేపు మనసులో మిగిలిపోయేలా ఉండే మాయ ఆయన సంగీతంలోనే సాధ్య‌మ‌వుతుంద‌ని మరోసారి అనిపించింది.

ఈ పాటలో ముగ్గురు ప్రధాన పాత్రల మధ్య ఉన్న స్నేహం, ప్రేమ, భావోద్వేగ క్షణాలను ఎంతో అందంగా చూపించారు. హృదయాన్ని హత్తుకునే సంగీతం, భావపూరితమైన అనుభూతులతో ఈ పాట ప్రతి ఒక్కరి ప్లేలిస్ట్‌లో ప్రత్యేక స్థానం సంపాదించుకునేలా కనిపిస్తోంది.

మ‌రీచిక‌ సినిమాలో ఆకట్టుకునే విజువల్స్‌, కథనం, భావోద్వేగాలతో నిండిన నటన, ఉత్కంఠభరితమైన కథా ప్రయాణం ప్రేక్షకులను కట్టిపడేయనున్నాయి. కొత్తదనంతో కూడిన థ్రిల్‌ను తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు ఈ సినిమా సిద్ధంగా ఉంది.

న‌టీన‌టులు: విరాజ్ అశ్విన్‌, రెజీనా క‌సండ్రా, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, అజ‌య్ ఘోష్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్‌: చిల‌కా ప్రొడ‌క్ష‌న్స్‌
డైరెక్ట‌ర్‌: స‌తీశ్ కాసెట్టి
క‌థ‌, సాహిత్యం, మాట‌లు: ల‌క్ష్మి భూపాల‌
నిర్మాత‌: రాజీవ్ చిల‌క‌, మేఘా చిల‌క‌
స‌హ నిర్మాత‌: భ‌ర‌త్ లక్ష్మీప‌తి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: విజ‌య్ దోన‌కొండ‌
సినిమాటోగ్ర‌ఫీ: అర‌వింద్ క‌న్న‌బిర‌న్‌
మ్యూజిక్‌: ఇళ‌య‌రాజా
ఎడిట‌ర్‌: జునైద్ సిద్ధికీ
ఆర్ట్ డైరెక్ట‌ర్‌: విఠ‌ల్ కోసనం
క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్‌: అక్షిత అక్కి
ఆడియో: ఆదిత్య మ్యూజిక్‌


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved