pizza

Chilaka Productions next Mareechika Trailer Promises A Haunting Tale Of Love, Betrayal And Revenge; Hitting Big Screens in May 29th
చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ ట్రైలర్ విడుదల.. ప్రేమ, ద్రోహం, ప్రతీకారంతో నిండిన కథ.. మే 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్

You are at idlebrain.com > news today >

16 May 2026
Hyderabad

National Award-winning filmmaker Satish Kasetty is all set to captivate Telugu audiences once again with his upcoming thriller Mareechika. Known for presenting unique and thought-provoking concepts on screen, the director appears to have crafted another intriguing cinematic experience. Featuring Regina Cassandra, Anupama Parameswaran and Viraj Ashwin in lead roles, the film is gearing up for a grand theatrical release on May 29. Backed by passionate producers Rajiv Chilaka and Meghhaa Chilakka under the Chilaka Productions banner, the film has already started creating strong curiosity with its intense theatrical trailer.

The trailer opens on an emotional and mysterious note with Anupama Parameswaran ( Venkata Laxmi ) playing a village girl who claims that someone has killed Sanju ( Viraj Ashwin ). The initial portions beautifully showcase the innocent romance and cheerful moments shared between Viraj Ashwin and Anupama. Their chemistry brings warmth and emotional depth before the story suddenly shifts gears. Regina Cassandra then makes a striking entry as Mareechika, a US-returned woman introduced into Viraj’s life by Anupama herself, setting the stage for a dramatic emotional conflict.

As the narrative progresses, relationships begin to change and emotions spiral into heartbreak and suspicion. Anupama’s character undergoes a drastic transformation after witnessing the growing closeness between Viraj and Regina. What begins as a tender love story soon evolves into a gripping thriller packed with tension, emotional trauma and unexpected twists. The trailer cleverly avoids revealing major plot points while maintaining a sense of mystery around every character.

The second half of the trailer intensifies with suspenseful visuals and a murder investigation that raises several intriguing questions. Who exactly killed Sanju? Who is Mareechika? Is betrayal driving the events unfolding around them? The police investigation, layered with emotional confrontations and dark undertones, hints at a story filled with psychological depth and revenge-driven drama. The makers seem determined to deliver a thriller that keeps audiences guessing till the very end.

Adding immense weight to the film’s atmosphere is the music composed by legendary maestro Ilaiyaraaja. His powerful background score significantly elevates the tension and emotional impact throughout the trailer. With visually engaging storytelling, emotionally layered performances and a suspense-filled narrative, Mareechika promises to offer Telugu audiences a fresh and thrilling cinematic experience on the big screen.

Cast: Viraj Ashwin, Regina Cassandra, Anupama Parameswaran

Technical Team:
Banner: Chilaka Productions
Director: Satish Kasetty
Story, Lyrics & Dialogues: Lakshmi Bhupala
Producer: Rajiv Chilaka, Meghhaa Chilakka
Co Producer: Bharat Laxmipathi
Executive Producer: Vijay Donkada
Dop: Arvind Kannabiran
Music: Ilaiyaraaja
Editor: Junaid Siddiqui
Art Director: Vithal Kosanam
Creative Producer - Akshita Akki
Audio On: Aditya Music

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ ట్రైలర్ విడుదల.. ప్రేమ, ద్రోహం, ప్రతీకారంతో నిండిన కథ.. మే 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌

నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్‌ సతీష్ కాసెట్టి తన కొత్త థ్రిల్లర్ మూవీ ‘మరీచిక’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. వైవిధ్యమైన , ఆలోచింపజేసే కథలను చూపడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన డైరెక్టర్ మరోసారి తనదైన శైలిలో ఈసారి కూడా ఆసక్తికరమైన సినీ అనుభూతిని అందించినట్టు ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తోంది.ఈ చిత్రంలో రెజీనా కసాండ్రా, అనుపమ పరమేశ్వరన్, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా మే 29న భారీ స్థాయిలో థియేటర్లలో భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక, మేఘా చిలక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా శనివారం విడుదలైన ఈ మూవీ ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల్లో సినిమాపై మ‌రింత క్యూరియాసిటీని పెంచింది.

‘మ‌రీచిక‌’ ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే ఎమోష‌న్స్‌తో పాటు మిస్ట‌రీ అంశాల‌తో ప్రారంభ‌మైంది. ఇందులో వెంక‌ట ల‌క్ష్మి అనే ప‌ల్లెటూరి అమ్మాయి పాత్ర‌లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కనిపించారు. సంజు పాత్ర‌లో విరాజ్ అశ్విన్ క‌నిపించ‌గా.. మ‌రీచిక పాత్ర‌లో రెజీనా కసాండ్రా క‌నిపించారు. సంజుని మ‌రీచిక చంపేసిందంటూ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయ‌టం.. ఆ త‌ర్వాత కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్‌.. త‌ర్వాత సంజు పాత్ర‌ను ప‌రిచ‌యం చేయ‌టం.. త‌ర్వాత మ‌రీచిక పాత్ర‌ను ప‌రిచ‌యం చేయ‌టం.. ఏ పాత్ర‌కు ఆ పాత్ర మ‌రో పాత్ర‌తో సంబంధం ఉన్న‌ట్లు, లేనట్లు చూపించి సినిమాపై ఆస‌క్తిని క్రియేట్ చేశారు. ఎన్నారై అమ్మాయి మ‌రీచిక పాత్ర‌లో రెజీనా క‌నిపించింది. ఈ మూడు పాత్ర‌ల మ‌ధ్య జ‌రిగిన ఎమోష‌న‌ల్, థ్రిల్లింగ్ ట్విస్టులు, ట‌ర్నుల‌తో సినిమా ఉండ‌నుంద‌ని ట్రైల‌ర్‌తో తెలుస్తోంది.

కథ ముందుకు సాగేకొద్దీ పాత్రల మధ్య ఉన్న సంబంధాలు మారిపోతూ క‌నిపించాయి. అలాగే భావోద్వేగాలను చూపిస్తూనే స‌న్నివేశాలు అనుమానాల వైపు దారితీస్తూ క‌నిపించాయి. అనుపమ పరమేశ్వరన్ పోషించిన పాత్ర, విరాజ్ అశ్విన్చ రెజీనా కసాండ్రా మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యాన్ని చూసిన తర్వాత‌ పూర్తిగా మారిపోతుంది. మొదట మృదువైన ప్రేమకథలా ప్రారంభమైన ఈ కథ, క్రమంగా ఉత్కంఠ, భావోద్వేగ వేదన, అనూహ్య మలుపులతో నిండిన థ్రిల్లర్‌గా మారుతుంది. ట్రైలర్‌లో కీలకమైన కథాంశాలను బయటపెట్టకుండా, ప్రతి పాత్ర చుట్టూ ఒక మిస్ట‌రీ ఉన్న‌ట్టు క‌నిపించ‌టం ప్రత్యేక ఆకర్షణగా అనిపిస్తోంది.

ట్రైలర్ రెండో భాగంలో మరింత ఉత్కంఠభరితమైన దృశ్యాలు, హత్య దర్యాప్తు ఆసక్తిని పెంచుతున్నాయి. అసలు సంజూను ఎవరు హత్య చేశారు? మరీచిక ఎవరు? వారి జీవితాల్లో జరుగుతున్న పరిణామాలకు ద్రోహమే కారణమా? అనే ప్రశ్నలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పోలీస్ దర్యాప్తు, భావోద్వేగ ఘర్షణలు, మిస్ట‌రీ సన్నివేశాలు ఈ కథలో సైక‌లాజిక‌ల్, రివేంజ్ డ్రామా ఉండ‌బోతుంద‌నే సంకేతాలు ఇస్తున్నాయి. ప్రేక్షకులను ఉత్కంఠలో ఉంచే థ్రిల్లర్‌ను మ‌న ముందుకు రానున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఇళయరాజా అందించిన సంగీతం.. నేపథ్య సంగీతం ట్రైలర్ మొత్తం ఉత్కంఠను, భావోద్వేగ తీవ్రతను మరింత పెంచాయి. ఆక‌ట్టుకునే క‌థ‌, క‌థ‌నం, ఎమోష‌న‌ల్ యాక్టంగ్‌, స‌స్పెన్స్‌తో కూడిన నెరేష‌న్‌ను చూస్తుంటే మరీచిక తెలుగు ప్రేక్షకులకు థియేటర్లలో ఒక కొత్త, ఉత్కంఠభరితమైన సినీ అనుభూతిని అందించబోతుందనిపిస్తోంది.

న‌టీన‌టులు: విరాజ్ అశ్విన్‌, రెజీనా క‌సండ్రా, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, అజ‌య్ ఘోష్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
బ్యాన‌ర్‌: చిల‌కా ప్రొడ‌క్ష‌న్స్‌
డైరెక్ట‌ర్‌: స‌తీశ్ కాసెట్టి
క‌థ‌, సాహిత్యం, మాట‌లు: ల‌క్ష్మి భూపాల‌
నిర్మాత‌: రాజీవ్ చిల‌క‌, మేఘా చిల‌క‌
స‌హ నిర్మాత‌: భ‌ర‌త్ లక్ష్మీప‌తి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: విజ‌య్ దోన‌కొండ‌
సినిమాటోగ్ర‌ఫీ: అర‌వింద్ క‌న్న‌బిర‌న్‌
మ్యూజిక్‌: ఇళ‌య‌రాజా
ఎడిట‌ర్‌: జునైద్ సిద్ధికీ
ఆర్ట్ డైరెక్ట‌ర్‌: విఠ‌ల్ కోసనం
క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్‌: అక్షిత అక్కి
ఆడియో: ఆదిత్య మ్యూజిక్‌


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved