pizza

Maremma Song Launch
'మారెమ్మ' తెలంగాణ రూటెడ్ విలేజ్ స్టోరీ. అందరికీ కనెక్ట్ అవుతుంది: సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరో మాధవ్

You are at idlebrain.com > news today >

07 July 2026
Hyderabad

మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్-డ్రామా 'మారెమ్మ'తో హీరోగా బిగ్ స్క్రీన్ పై అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంతో మంచాల నాగరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మయూర్ రెడ్డి బండారు మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'మారెమ్మ' ఫస్ట్ లుక్ పోస్టర్‌, టీజర్‌, ఫస్ట్ సింగిల్ 'బావ బావ' సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి మ్యూజిక్ అందిస్తున్నారు. తాజాగా మేకర్స్ మారి సాంగ్ ని లాంచ్ చేశారు.ఈ పాటకు మిట్టపల్లి సురేందర్ అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. మంగ్లీ వోకల్స్ మరో ఆకర్షణగా నిలిచింది.

సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరో మాధవ్ మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ చాలా థాంక్స్. సినిమా మొత్తం రెడీ అయిపోయింది. ఈ నెలాఖరులో విడుదల చేయాలని అనుకుంటున్నాం. త్వరలోనే ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తాం. సినిమా చాలా బాగా వచ్చింది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను.

నిర్మాత మయూర్ రెడ్డి బండారు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ పాట మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా తెలంగాణ నేటివిటీ, తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో తెరకెక్కింది. నాగరాజు ఈ కథ చెప్పగానే మా ఊరి నేపథ్యం మొత్తం నాకు గుర్తొచ్చింది. ఈ సినిమాలోని ప్రతి పాత్ర కూడా మా ఊరిలో ఎవరో ఒకరిని గుర్తు చేసింది. మొన్న జాతరకు వెళ్లినప్పుడు మా సినిమాలో ఉన్న చాలా సన్నివేశాలు అక్కడ కళ్లకు కట్టినట్టు కనిపించాయి. ఈ సినిమాలో ఒక నిజమైన తెలంగాణ పల్లెటూరిని, అక్కడి మనుషులను, వారి జీవన విధానాన్ని చూస్తారు. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇందులో వచ్చే పాటలన్నీ కథలో భాగంగానే ఉంటాయి. 'మారి' పాటను మిట్టపల్లి సురేందర్ అన్న చాలా మంచి సాహిత్యంతో రాశారు. ప్రశాంత్ ఆర్ విహారి అద్భుతమైన ట్యూన్ ఇచ్చారు. దర్శకుడు నాగరాజు ఈ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించారు. మాధవ్ బయట ఎలా ఉంటాడో, సినిమాలో పూర్తిగా భిన్నంగా కనిపిస్తాడు. ఆయన నటన మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అలాగే దీపా బాలు పెర్ఫార్మెన్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.

హీరోయిన్ దీపా బాలు మాట్లాడుతూ.. మా సినిమా టీజర్‌కు, అలాగే 'బావ బావ' పాటకు మీరు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. నాకు ఇంత మంచి పాత్ర ఇచ్చిన మా దర్శకుడికి, నిర్మాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు. మా టీమ్‌లోని ప్రతి ఒక్కరికీ పేరుపేరునా థాంక్స్. ఇది నాకు తెలుగు భాషలో తొలి సినిమా. అందుకే చాలా ప్రత్యేకం. మీరందరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను.

దర్శకుడు మంచాల నాగరాజు మాట్లాడుతూ.. ఈ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. విడుదలకు సిద్ధంగా ఉన్నాం. తెలుగులో ఇది చాలా కొత్త స్క్రీన్‌ప్లేతో ఉండే సినిమా. 'మారి' పాటలో తమోగ్న, సర్కార్ ఇద్దరూ చాలా బ్యూటిఫుల్‌గా చేశారు. మంగ్లీ కూడా అద్భుతంగా పాడారు. అలాగే మిట్టపల్లి సురేందర్ గారు ఎంతో మంచి సాహిత్యం అందించారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నాను."

ఎడిటర్ సాయిబాబు మాట్లాడుతూ.. ఇలాంటి కథను నిర్మించాలంటే నిర్మాతకు చాలా ధైర్యం ఉండాలి. ఇది చాలా రూటెడ్ స్టోరీ. చాలా మంచి కథ. దర్శకుడు తన విజన్‌తో సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తుంది

సినిమాటోగ్రాఫర్ ప్రశాంత్ అంకిరెడ్డి మాట్లాడుతూ.. 'మారెమ్మ' ఒక రూటెడ్ విలేజ్ స్టోరీ. ఈ సినిమాను పూర్తిగా సహజంగా తెరకెక్కించడానికి మేమంతా ప్రయత్నించాం. ఇది చాలా నిజాయితీతో తీసిన సినిమా. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. మాధవ్ గారు చాలా అద్భుతంగా నటించారు. సినిమా మొత్తం చాలా సహజంగా ఉంటుంది. చాలా బాగా వచ్చింది. మీరందరూ తప్పకుండా థియేటర్లలో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను.

చైల్డ్ ఆర్టిస్ట్ తమోజ్ఞ మాట్లాడుతూ.. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడికి, నిర్మాతకు థాంక్యూ. ఈ సినిమా చేస్తూ చాలా ఎంజాయ్ చేశాను. తప్పకుండా మీరందరూ సినిమా చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను

చైల్డ్ ఆర్టిస్ట్ సర్కార్ మాట్లాడుతూ..ఈ సినిమాలో నేను హీరో చిన్ననాటి పాత్రలో నటించాను. ఈ సినిమా షూటింగ్ మొత్తం చాలా ఎంజాయ్ చేస్తూ పూర్తి చేశాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా దర్శక నిర్మాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు.

తారాగణం: మాధవ్, దీపా బాలు, వినోద్ కుమార్, వికాస్ వశిష్ట, దయానంద్ రెడ్డి, V.S.రూపా లక్ష్మి

సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: మోక్ష ఆర్ట్స్
రచన & దర్శకత్వం: మంచాల నాగరాజ్
నిర్మాత: మయూర్ రెడ్డి బండారు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఉమేష్ విలాసాగరం
డీవోపీ: ప్రశాంత్ అంకిరెడ్డి
సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి
ఎడిటర్: సాయిబాబు
ఆర్ట్ డైరెక్టర్: రాజ్ కుమార్ మురుగేషన్
యాక్షన్ డైరెక్టర్: మాడిగొండ నటరాజ్
కొరియోగ్రాఫర్: సాగ్గీ సాగర్
Vfx ప్రొడ్యూసర్: చంద్ర కాయల
డిజైనర్: సునందిని విజ్జగిరి
సాహిత్యం: మిట్టపల్లి సురేందర్, కమల్ ఎస్లావత్
స్టిల్స్ & మేకింగ్: శేఖర్ కథుల
పబ్లిసిటీ డిజైన్స్: అనంత్ కంచెర్ల

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved