28 January 2016
Hyderabad
Starring Stylish Star Allu Arjun in the lead role, Sarrainodu is helmed by successful director 'Boyapati Sreenu' and bankrolled by ace producer Allu Aravind on "Geetha Arts" Banner. The movie is progressing at a brisk pace aiming for a summer release. First look of 'SARRAINODU' which was released on January 26th garnered huge response. Allu Arjun's stylish look with chiseled and well toned physique looked debonair. Enthralling response from the mega family has not yet subdued. Great applause from the audience for the movie's first look across Telugu states and neighboring states like Kerala and Karnataka proves Bunny's stamina.
A rare combination of Stylish star Allu Arjun and successful action director Boyapati Sreenu has raised the expectations. Sarrainodu is an action entertainer with a dose of family emotions. Rakul Preet Singh and Catherine Tresa play the female leads. Heroine Anjali is sharing screen space with Bunny for the first time in a special song. Movie's release as anticipated will be in April as a pre summer treat to all the mega fans.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా... సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో... సూపర్ డూపర్ హిట్స్ ని అందించిన ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్లో... విజయవంతమైన చిత్రాలకు కేరాఆఫ్ అడ్రస్ గా నిలిచిన అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం సరైనోడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన మెదటిలుక్ ని జనవరి 26 న విడుదల చేశారు. అల్లు అర్జున్ అభిమానుల్లో ప్రత్యేకమైన క్రేజ్ నెలకొంది. కండలు తిరిగిన చేతితో... హ్యాండిల్ తో కూడిన ఇనుప గుండును పట్టుకున్న ఈ పోస్టర్ తో అభిమానులు పండగ చేసుకున్నారు. ఇదే క్రేజ్ ను కంటిన్యూ చేస్తూ అటు అభిమానులే కాకుండా సామాన్య సిని ప్రేక్షకుల్లో సైతం ఈ మెదటి లుక్ కి హ్యూజ్ రెస్పాన్స్ రావటం విశేషం. బోయపాటి శ్రీను లాంటి మాస్ డైరెక్టర్ టేకింగ్ ప్రతిబింబించేలా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ వుండటం తో సినిమా రేంజ్ భారీగా పెరిగిందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్, కేథరీన్ అందచందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అంజలి ఓ ప్రత్యేకగీతంలో అల్లు అర్జున్ తో కలిసి స్టెప్పులేసింది.
ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదల చేస్తారు. స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ గత చిత్రాలకంటే ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రల్లోనే కాకుండా కర్ణాటక, కేరళ లో కూడా మెదటి లుక్ కి అభిమానులు నీరాజనాలు పలికారు.. టీస్టాల్ అడ్డాల వద్ద.. పాన్ బడ్డీ వద్ద.. సినిమా ధియోటర్స్ వద్ద ఇలా ప్రతి ఏరియా సెంటర్స్ లో ప్లెక్స్ లు పెట్టటం. ఎప్పడు లేని విధంగా ఈ సారి సరైనోడు చిత్రానికి హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఈ మెదటి లుక్ తో అర్దమయ్యింది.