pizza

Mass Jathara Glimpse: A Full Meals Feast for the Mass Maharaaj Ravi Teja Fans
మాస్ మహారాజా రవితేజ 'మాస్ జాతర' చిత్రం నుంచి ఫుల్ మీల్స్ లాంటి గ్లింప్స్ విడుదల

You are at idlebrain.com > news today >

26 January 2025
Hyderabad

On the occasion of Mass Maharaaj Ravi Teja’s birthday, Mass Jathara Glimpse has been unveiled leaving fans on cloud nine. The glimpse brings back the vintage Ravi Teja magic that audiences have cherished over the years. From his unmatched energy to his iconic swag and electrifying vibe this is a complete package of MASS ENTERTAINMENT.

Adding to the nostalgia glimpse features the iconic dialogue, “MANADHE IDHANTHA” doubling the impact and taking fans back in time while delivering a fresh punch for today’s audience.

Director Bhanu Bogavarapu perfectly captures the mass pulse with an engaging and power packed glimpse while Bheems Ceciroleo’s high voltage background score amplifies the energy throughout. With Ravi Teja at the helm reminding us why he continues to rule the mass entertainer space.

The team behind the magic includes a powerhouse of talented technicians. With Vidhu Ayyanna’s cinematography, Navin Nooli’s editing and Nandu Savirigana’s dialogues everything is perfectly on track for a massive entertainer.

And of course, the dynamic Producers Suryadevara Naga Vamsi and Sai Soujanya under Sithara Entertainments, Fortune Four Cinemas and in collaboration with Srikara Studios continue to deliver premium cinema experiences. With their brand Mass Jathara is another blockbuster in their crown.

Mass Jathara has already raised expectations with its spectacular glimpse. More updates will be shared in the coming days.

Cast & Crew:

Movie: Mass Jathara

Stars: Maas Maharaaj Ravi Teja , Sreeleela
Director : Bhanu Bogavarapu
Producer: Naga Vamsi S - Sai Soujanya
Writers: Bhanu Bogavarapu, Nandu Savirgama
Music: Bheems Ceciroleo
Editor: Navin Nooli
Cinematography: Vidhu Ayyanna
Production Designer: Sri Nagendra Tangala
Executive Producer: Phani K Varma
Presenter: Srikara Studios
Banners: Sithara Entertainments & Fortune Four Cinemas

మాస్ మహారాజా రవితేజ 'మాస్ జాతర' చిత్రం నుంచి ఫుల్ మీల్స్ లాంటి గ్లింప్స్ విడుదల

మాస్ మహారాజా రవితేజ కథనాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి గ్లింప్స్ విడుదలైంది.

జనవరి 26వ తేదీన రవితేజ పుట్టినరోజు సందర్భంగా, 'మాస్ జాతర' గ్లింప్స్ ను చిత్ర బృందం ఆవిష్కరించింది. ఈ గ్లింప్స్, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మునుపటి అసలు సిసలైన మాస్ మహారాజా రవితేజను గుర్తు చేసేలా ఉంది. తనదైన కామెడీ టైమింగ్, విలక్షణ డైలాగ్ డెలివరీ మరియు ఎనర్జీకి పెట్టింది పేరు రవితేజ. అందుకే ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుంటాయి. రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విందు భోజనం లాంటి మాస్ ఎంటర్టైనర్ గా మాస్ జాతర రూపొందుతోందని గ్లింప్స్ ను చూస్తే అర్థమవుతోంది.

రవితేజ సినీ ప్రస్థానంలో "మనదే ఇదంతా" అనే డైలాగ్ ఎంతటి ప్రాముఖ్యత పొందినదో తెలిసిందే. గ్లింప్స్‌ కు ఈ డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది అభిమానులను మళ్ళీ ఆ రోజులకు తీసుకొని వెళ్తుంది. అలాగే నేటి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది.

దర్శకుడు భాను బోగవరపు మాస్ ప్రేక్షకులు మెచ్చే విధంగా ఆకర్షణీయంగా 'మాస్ జాతర' గ్లింప్స్‌ ను మలిచారు. మాస్ మహారాజాగా రవితేజ మాస్ ప్రేక్షకులకు ఎందుకు అంతలా చేరువయ్యారో ఈ గ్లింప్స్‌ మరోసారి రుజువు చేస్తోంది. సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో అందించిన నేపథ్య సంగీతం, రవితేజ ఎనర్జీకి ఏమాత్రం తగ్గకుండా ఉండటమే కాకుండా, గ్లింప్స్‌ కు ప్రధాన బలంగా ఉంది.

'మాస్ జాతర' చిత్రాన్ని మాసివ్ ఎంటర్టైనర్ గా మలచడానికి ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. ప్రముఖ ఛాయగ్రాహకుడు విధు అయ్యన్న కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. నందు సవిరిగాన సంభాషణలు సమకూర్చారు.

ఈ చిత్రంలో యువ సంచలనం శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు. రవితేజ-శ్రీలీల జోడి గతంలో 'ధమాకా'తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. వీరి కలయికలో 'మాస్ జాతర' రూపంలో మరో బ్లాక్ బస్టర్ అందుకోవడం ఖాయమని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.

తాజాగా విడుదలైన గ్లింప్స్ 'మాస్ జాతర' చిత్రంపై అంచనాలను రెట్టింపు చేసింది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

తారాగణం & సాంకేతిక బృందం:

చిత్రం: మాస్ జాతర
తారాగణం: మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల
దర్శకత్వం: భాను బోగవరపు
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
రచన: భాను బోగవరపు, నందు సవిరిగాన
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
కూర్పు: నవీన్ నూలి
ఛాయాగ్రహణం: విధు అయ్యన్న
కళా దర్శకత్వం: శ్రీ నాగేంద్ర తంగాల
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఫణి కె. వర్మ
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌,

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved