Mathu Vadalara was a sensational hit, directed by Ritesh Rana, with Sri Simha Koduri and Satya in lead roles. Now, the same creative team is ready to entertain with the sequel Mathu Vadalara 2. The film is produced by Chiranjeevi (Cherry) and Hemalatha Pedamallu under Clap Entertainment, in association with Mythri Movie Makers. The recently released first-look posters of the film received a tremendous response.
In Mathu Vadalara 2, actress Faria Abdullah will be seen in the role of Nidhi. Today, the makers released her first look, which features Faria holding a gun with an intense expression, making for an impressive action poster.
The film also stars Sunil, Vennela Kishore, Ajay, Rohini, Raja Chembolu, Jhansi, Srinivas Reddy, and Gundu Sudarshan in significant roles. Every character is set to play a crucial part, and with the addition of prominent actors, the entertainment is expected to be on the next level.
The music for the film is composed by Kaala Bhairava, with Suresh Sarangam handling the cinematography and Karthik Srinivas R as the editor.
Mathu Vadalara 2 is set to be released grandly on September 13.
క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్, శ్రీ సింహ కోడూరి, సత్య, రితేష్ రానా క్రేజీ ఎంటర్‌టైనర్ 'మత్తు వదలారా 2' నుంచి ఫరియా అబ్దుల్లా ఫస్ట్ లుక్ రిలీజ్
శ్రీ సింహ కోడూరి, సత్య లీడ్ రోల్స్ లో రితేష్ రానా దర్శకత్వంలో వచ్చిన సెన్సేషనల్ హిట్ మూవీ 'మత్తు వదలరా'. ఇప్పుడు అదే క్రియేటివ్ టీమ్ సీక్వెల్ 'మత్తు వదలారా 2' తో ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అయ్యారు. ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్ గా రిలీజైన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
'మత్తు వదలారా2' లో హీరోయిన్ ఫారియా అబ్దుల్లా నిధి పాత్రలో కనిపించనున్నారు. ఈ రోజు మేకర్స్ ఫరియా అబ్దుల్లా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. గన్ పట్టుకొని ఇంటెన్స్ లుక్ లో చూస్తున్న ఫారియా యాక్షన్ పోస్టర్ అదిరిపోయింది.
ఈ చిత్రంలో సునీల్, వెన్నెల కిషోర్, అజయ్, రోహిణి, రాజా చెంబోలు, ఝాన్సీ, శ్రీనివాస్ రెడ్డి, గుండు సుదర్శన్ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రతి పాత్ర కీలకంగా ఉండబోతోంది. ప్రముఖ నటులు చేరడంతో ఎంటర్ టైన్మెంట్ నెక్స్ట్ లెవల్ లో వుండబోతోంది.
ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందిస్తుండగా, సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్.
మత్తు వదలారా 2 సెప్టెంబర్ 13న గ్రాండ్ గా విడుదల కానుంది.
తారాగణం: శ్రీ సింహ కోడూరి, సత్య, ఫరియా అబ్దుల్లా, సునీల్, వెన్నెల కిషోర్, అజయ్, రోహిణి, రాజా చెంబోలు, ఝాన్సీ, శ్రీనివాస్ రెడ్డి, గుండు సుదర్శన్.
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: రితేష్ రానా
బ్యానర్లు: క్లాప్ ఎంటర్టైన్మెంట్ & మైత్రి మూవీ మేకర్స్
నిర్మాతలు: చిరంజీవి (చెర్రీ) & హేమలత
సంగీతం: కాల భైరవ
డిఓపి: సురేష్ సారంగం
సహ రచయిత: తేజ ఆర్
Asst. రైటర్: సాయి సోమయాజులు
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
ప్రొడక్షన్ డిజైనర్: నార్ని శ్రీనివాస్
యాక్షన్ కొరియోగ్రఫీ: వింగ్‌చున్ అంజి
లిరిసిస్ట్: ఫరియా అబ్దుల్లా
Vfx సూపర్‌వైజర్: జూలూరి అనిల్ కుమార్
మోషన్ గ్రాఫిక్స్/విజువల్ ఎఫెక్ట్స్: ARK WRX