pizza

Varun Tej about Matka
మట్కా పెర్‌ఫెక్ట్ కమర్షియల్ మాస్ ఫిల్మ్. వాసు లాంటి క్యారెక్టర్ దొరకడం యాక్టర్ గా నా అదృష్టం. వాసు క్యారెక్టర్ తో ఆడియన్స్ డెఫినెట్ గా కనెక్ట్ అవుతారు: హీరో వరుణ్ తేజ్

You are at idlebrain.com > news today >

09 November 2024
Hyderabad

మట్కా పెర్‌ఫెక్ట్ కమర్షియల్ మాస్ ఫిల్మ్. వాసు లాంటి క్యారెక్టర్ దొరకడం యాక్టర్ గా నా అదృష్టం. వాసు క్యారెక్టర్ తో ఆడియన్స్ డెఫినెట్ గా కనెక్ట్ అవుతారు: హీరో వరుణ్ తేజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'మట్కా'. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్ తో నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్, ట్రైలర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన మట్కా ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'మట్కా' నవంబర్ 14న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

'మట్కా' కథ ఎలా ఉండబోతోంది ?
-వాసు అనే అబ్బాయి కథే మట్కా. తను బర్మా నుంచి శరణార్థి గా వైజాగ్ వస్తాడు. 1958 నుంచి 82 వరకు తను అంచెలంచెలుగా ఎలా ఎదిగాడు అనేది చూపిస్తాం. వాసు అనే అబ్బాయి లైఫ్ స్టోరీ ఇది.

మట్కా కింగ్ రతన్ ఖత్రి క్యారెక్టర్ తో వాసుకి పోలిక ఉందా?
-డైరెక్టర్ గారు ఈ కథని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చేద్దామని భావించారు. రతన్ ఖత్రి ది ముంబై నేపథ్యం. తను పాకిస్తాన్ నుంచి ముంబై వచ్చారు. పైగా ఆయన చేసిన పనులను జనాలు రూమర్స్ లా మాట్లాడుకోవడమే తప్పితే కొన్నిటికి ఆధారాలు లేవు. సెల్ ఫోన్స్ లేని రోజుల్లో దేశం మొత్తం ఒకే నెంబర్ ని ఒకే రోజు పంపించడాని చెప్తుంటారు. తను ఎలా పంపించాడో ఎవరికీ తెలియదు. మా డైరెక్టర్ గారు ఒకవేళ తనే మట్కా కింగ్ అయి ఉంటే తను ఎలా చేసేవారో అని ఆలోచించి ఆయనకు వచ్చిన ఐడియాస్ తో వాసు క్యారెక్టర్ ని డిజైన్ చేశారు.

వాసు క్యారెక్టర్ కోసం ఎలాంటి హోం వర్క్ చేశారు?
-మేజర్ హోంవర్క్ అంటే డైరెక్టర్ గారితో చాలా టైం స్పెండ్ చేశాను. చాలాసార్లు స్క్రిప్ట్ చదివాను. క్యారెక్టర్ లోకి తీసుకురావడానికి అది చాలా హెల్ప్ చేస్తుంది. చదువుతున్నప్పుడే వాసు క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఒక అంచనాకొస్తాం. దానితో ఒక స్ట్రక్చర్ బిల్డ్ అవుతుంది. తను ఎలా కూర్చుంటాడు? ఎలా నడుస్తాడు? ఎలా సిగరెట్ కాలుస్తాడు? ఇవన్నీ ఒక చదువుతున్నప్పుడే ఐడియా వచ్చేస్తుంది.

-ఇక ఉత్తరాంధ్ర యాస విషయానికి వస్తే వాసు బర్మా నుంచి వస్తాడు కాబట్టి తను ఆ యాస మాట్లాడాల్సిన అవసరం బిగినింగ్ లోనే ఉండదు. ఆ క్యారెక్టర్ జర్నీ జరుగుతున్న కొద్దీ అక్కడ యాస పడుతుంది. తన ఏజ్ పెరిగిన కొద్దీ తన క్యారెక్టర్ తో పాటు బ్యాడీ లాంగ్వేజ్, యాస పాలిష్ అవుతుంది.

-మట్కా ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. షూటింగ్ లొకేషన్లో అవతలి యాక్టర్ తో కూర్చుని మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇచ్చిన రెస్పాన్స్ కూడా హెల్ప్ అయ్యింది. సినిమా కోసం స్క్రిప్ట్ రీడింగ్ సెషన్స్ కూడా చేశాం.

కరుణ కుమార్ గారి గత సినిమాల్లో కుల వివక్ష అనేది ఎక్కడో అండర్ లైన్ గా ఉంటుంది. ఇందులో ఎలాంటి పాయింట్ ని టచ్ చేశారు?
-మట్కా సందేశాత్మక చిత్రం కాదు. ఇది ప్రాపర్ కమర్షియల్ మాస్ ఫిలిం. వాసు క్యారెక్టర్ లో తనకి ఎవడూ హెల్ప్ చేయడనే ఒక బాధ, కోపం కనిపిస్తుంది. వాసు క్యారెక్టర్ తో ట్రావెల్ చేస్తున్న కొద్దీ తను చెప్పేది కొన్నిసార్లు నిజం అనిపిస్తుంది. కొన్నిసార్లు పాపమనిపిస్తుం. కొన్నిసార్లు ఆ క్యారెక్టర్ మీద కోపం కూడా వస్తుంది. ప్రతి ఈ మనిషిలో ఐదేళ్ల కు ఒకసారి తన వ్యక్తిత్వం ఎక్కడో చోట మారుతూ ఉంటుంది. వాసు క్యారెక్టర్ లో ఇవన్నీ కనిపిస్తాయి.

-ఈ దేశంలో చెలామణి అయ్యే ప్రతీ రూపాయిలో 90 పైసలు ఒక్కడే సంపాదిస్తాడు. మిగతా 10 పైసల గురించి 99 మంది కొట్టుకుంటారు. వాసు ఆ ఒక్క పెర్సెంట్ లో వుండాలనుకుంటాడు. ఇది కాన్సెప్ట్ అఫ్ ది ఫిల్మ్.

ఈ సినిమా ని ఒప్పుకోవడానికి ప్రధాన కారణం?
-మట్కా సినిమాని ఒప్పుకోవడానికి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ క్యారెక్టరైజేషన్. చాలా స్ట్రాంగ్ గా రాసిన క్యారెక్టర్ ఇది. మంచి, చెడు అని కాదు.. ఆడియన్స్ థియేటర్స్ లో కూర్చున్నప్పుడు ఒక క్యారెక్టర్ తో కనెక్ట్ అవ్వాలి, ఆ క్యారెక్టర్ తో ట్రావెల్ అవ్వాలి, వాడు గెలవాలనుకోవాలి, వాడిని ప్రేమించాలి.. అదే కమర్షియల్ సినిమా ఫార్ములా. అలా చూసుకుంటే వాసు క్యారెక్టర్ తో ఆడియన్స్ అందరూ కనెక్ట్ అవుతారు. 60, 70 టైమ్స్ లోకి ఆడియన్స్ వెళ్తారు. రెండున్నర గంటలు వాసు తో పాటు ట్రావెల్ అవుతారు. మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసి చేసిన సినిమా ఇది. అభిమానులందరికీ నచ్చేలా వుంటుంది.

జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ గురించి?
-ఇది ఒక గ్యాంగ్ స్టర్ తరహ సినిమా. మ్యూజిక్ డైరెక్టర్ గా ఎవరిని తీసుకోవాలి అన్న ఆలోచిస్తున్నప్పుడు.. గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ సినిమాకి చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసింది జీవి ప్రకాష్ అని చాలామందికి తెలియదు. ఇలాంటి జోనర్ సినిమాలు కి ఆయన పర్ఫెక్ట్ గా ఇవ్వగలుగుతారని నమ్మకంతో జీవి గారితో ట్రావెల్ అయ్యాం. ఇందులో నాలుగు సాంగ్స్ ఉన్నాయి. ఆ పాటలు కథలు చాలా ఇంపార్టెంట్. బిజిఎం స్టన్నింగ్ గా ఇచ్చారు. నిన్న నైట్ చూశాను అదిరిపోయింది. అమేజింగ్ స్కోర్. సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది.

ఇందులో ఓల్డ్ క్యారెక్టర్ చేయడం కోసం ఎలాంటి వర్క్ చేశారు ?
-డైరెక్టర్ గారు, నేను మాట్లాడుకుని ఆ లుక్ ని డిజైన్ చేశాం. ఏజ్ కి తగ్గట్టు ఒక ఏఐ రిఫరెన్స్ తీసుకున్నాం. ఒక బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేస్తూ ఆ క్యారెక్టర్ చేశాను. కమర్షియల్ గా ఉంటూ అందరికీ అప్పీల్ అవుతూ రియలిజం క్లోజ్ వుండే ప్రయత్నం చేశాం.

ఒక క్రిమినల్ స్టోరీ ని చెప్తున్నప్పుడు వాళ్ళ ఎమోషనల్ పెయిన్ కూడా కనెక్ట్ అయ్యేలా చూపించాలి కదా.. మరి ఇందులో వాసు క్యారెక్టర్ లో ఎమోషన్ ఎలా ఉంటుంది?
-ఇందులో సెకండ్ హాఫ్ లో చాలా బ్యూటిఫుల్ సీన్ ఉంది. వాసు క్యారెక్టర్ తన పెయిన్ చెప్తున్నప్పుడు, అసలు తను ఎందుకు అలా అయ్యాడో కూతురుతో ఒక పిట్ట కథలా చెబుతున్నప్పుడు.. ఆ స్టోరీ విన్న ఎవరికైనా కళ్ళ నుంచి నీరు వస్తాయి. ఆ సీన్ చాలా బాగా వచ్చింది. దాదాపు ఒక వారం రోజులు పాటు ఆ సీన్, డైలాగ్స్ ని చదువుతూనే ఉన్నాను. ఆ సీన్ ని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఎక్సైట్ మెంట్ ఉంది.

డైరెక్టర్ కరుణ కుమార్ గురించి?
-కరుణ కుమార్ గారి సెన్సిబిలిటీస్ నాకు చాలా నచ్చాయి. ఆయన గ్రౌండ్ రియాలిటీ ని షుగర్ కోటింగ్ లేకుండా చెబుతుంటారు. అది నాకు చాలా నచ్చింది. ఆయన చాలా మంచి రైటర్. సెట్లో అప్పటికప్పుడే ఇంప్రవైజ్ చేసి చాలా అద్భుతమైన మాటల్ని రాయగలరు. ఇందులో ధర్మం అనే టాపిక్ పై వచ్చే డైలాగ్ అప్పటికప్పుడు రాసిందే. 'నీకు ఏది అవసరమో అదే ధర్మం' అనే డైలాగ్ ని ఆయన సెకండ్స్ లో చెప్పారు. ఆయనకి చాలా నాలెడ్జ్ ఉంది. అలాంటి డైలాగులు ఇందులో చాలా ఉన్నాయి.

-కరుణ కుమార్ మంచి విజన్ వున్న డైరెక్టర్. ఆయనకి మ్యూజిక్ మీద కూడా మంచి కమాండ్ వుంది. ఆయనకు మంచి టీం దొరికితే అద్భుతాలు చేయగలరు. ఆయన డైరెక్షన్ టీం, డీవోపీ కిషోర్ ఇలా అందరూ కలసికట్టుగా చాలా అద్భుతంగా వర్క్ చేశారు. ఆయన విజన్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళే టీం దొరికింది. ఈ సినిమాతో ఆయనకి ఇంకా మంచి పేరువస్తుంది.

పీరియడ్ సినిమా కదా.. సెట్ వర్క్ గురించి చెప్పండి?
-మెజారిటీ ఆఫ్ ది లొకేషన్స్ రీ క్రియేట్ చేసాం. పూర్ణ మార్కెట్ మొత్తం రిక్రేట్ చేసాం. యారాడ బీచ్, కాకినాడ పోర్టు తప్పితే మిగతా సీన్స్ అన్ని ఆర్ఎఫ్సీ పెద్దపెద్ద సెట్లు వేసి రీ క్రియేట్ చేసాం.

ఇందులో వైలెన్స్ డోసు ఎక్కువగా ఉంటుందా?
-సినిమాకి యు/ఏ ఇచ్చారు. మేము 'ఏ' ఇస్తారనుకున్నాం(నవ్వుతూ). సినిమాలో వైలెన్స్ ఉంది. యాక్షన్ సీక్వెన్స్ లు ఒక 9 వరకు ఉన్నాయి. సెకండాఫ్ హాఫ్ ఒక రివెంజ్ డ్రామా జోన్ లోకి వెళుతుంది. లాస్ట్ లో సినిమా యాక్షన్ ప్యాక్డ్ గా ఉంటుంది.

దాదాపు నాలుగు గెటప్స్ లో కనిపిస్తున్నారు కదా ఒక్కొక్క గేటప్ కి ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు?
-యాక్టర్ కి ఇలాంటి క్యారెక్టర్స్ దొరకడం అదృష్టం. ఈ క్యారెక్టర్ విన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యాను. లాస్ట్ మూడు సినిమాల్లో పెర్ఫార్మెన్స్ పరంగా కొంచెం లిమిటేషన్స్ ఉండే సినిమాలే చేశాను. గద్దల కొండ గణేష్ తర్వాత మళ్లీ అలాంటి పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉండే సినిమా కోసం చూస్తున్నప్పుడు ఈ కథ వచ్చింది. డెఫినెట్ గా వాసు లాంటి క్యారెక్టర్ చేయడం ఛాలెంజింగ్ గా ఉంటుంది. స్క్రీన్ పై వరుణ్ అని కాకుండా వాసులనే చూడాలి. దాని కోసం కష్టపడాల్సిందే. గద్దల కొండ గణేష్ తర్వాత నేను బయటకి వెళ్ళినప్పుడు వరుణ్ అని కాకుండా గణేష్ అని పిలిచారు. అది నాకు బిగ్గెస్ట్ కాంప్లిమెంటు. యాక్టర్ గా నన్ను క్యారెక్టర్ పేరుతో పిలిస్తే అంతకంటే ఆనందం మరొకటి ఉండదు. నా ప్రయారిటీ కూడా అదే.

మీనాక్షి చౌదరి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
తనది వాసు తో పాటు ట్రావెల్ అయ్యే క్యారెక్టర్. ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకుని క్యారెక్టర్. ఒక ఎమోషనల్ ట్విస్ట్ వుంటుంది. ఆమె లక్కు మాకు ఫేవర్ అవుతుందని అనుకుంటున్నాను. నోరా ది కూడా మంచి క్యారెక్టర్. అద్భుతంగా చేసింది

- ఈ సినిమా కోసం పర్ఫెక్ట్ గా క్యారెక్టర్ కి సెట్ అయ్యే యాక్టర్స్ నే తీసుకున్నాను. కన్నడ కిషోర్, జాన్ విజయ్, రాజేష్, నవీన్ చంద్ర వీళ్లంతా ప్రాపర్ యాక్టర్స్.

వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తో వర్క్ ఎక్స్ పీరియన్స్ ?
-ఫస్ట్ డే నుంచి మంచి సినిమా తీయాలనే ఉద్దేశంతో చాలా పాషనేట్ గా వర్క్ చేశారు. వారితో వర్క్ చేయడం వెరీ నైస్ ఎక్స్పీరియన్స్.

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved