pizza

"Loving someone blindly is a form of slavery - ‘Mayasabha’ attempts to free us from that slavery" – Deva Katta
ఎవరినైనా పిచ్చిగా ప్రేమించడం 'బానిసత్వమే'.. ఆ బానిసత్వం నుండి 'మయసభ' బయటకు తీసుకొస్తుంది - దేవా కట్టా

You are at idlebrain.com > news today >

5 August 2025
Hyderabad

‘Mayasabha’, the upcoming web series that stirred quite a sensation with its teaser, is directed by Deva Katta. In a promotional interview with Jeevi from Idlebrain.com, the director walks us through the highs and lows of his cinematic journey — from his debut film Vennela to the soon-to-stream Mayasabha.

He reveals that Vennela was essentially a crowdfunded film and gained attention for the wrong reasons. Though it received visibility, it didn’t satisfy him as a storyteller. He expressed his love for making emotionally resonant comedies like Sathi Leelavathi.

Speaking about Prasthanam, Deva Katta said he originally wrote it for stars. Producers suggested blending Vennela-style comedy with a bit of action, but Prasthanam turned into a second debut for him. He didn’t care about remuneration and completed the film despite a six-month delay due to budget issues. Interestingly, the producer of Mayasabha, Krishna Vijay, was the one who helped Prasthanam see the light of day. The film didn’t even have a production or art designer, but he was determined to deliver.

On the Hindi version of Prasthanam, he said he lacked creative freedom, especially hiring the right person for dialogue writing, and knew early on that it wouldn't match the Telugu version.

About Autonagar Surya, he admitted the first half was edited discreetly, but he was blocked during the second half. Even producer Allu Aravind felt that forced comedy scenes ruined the flow. That experience influenced his decision not to forcibly inject humor into Republic. Over time, he transitioned from comedy films to more serious subjects. He recalled aspiring to be a director who could sit with dignity beside a producer, and while he got that during Autonagar, it made him miss the earlier creative days. For any creator, he emphasized, control and command are essential.

He called Republic a story that came from his heart, and some audiences even liked it more than Prasthanam. However, several unfortunate events hurt the film — lead actor Sai Dharam Tej’s accident, the film’s serious ending, and media focus on external controversies. He also believed the premature branding of the film as an “agenda movie” harmed its reception. Released during COVID, Republic didn’t receive its due, but both he and the actor found deep creative satisfaction. It didn’t do well in theaters but received wide appreciation post its OTT release.

Talking about the scrapped Baahubali web series, he said it was initially planned as a multi-season epic like Game of Thrones, but pressure from the production house to rush after Baahubali 2 release led to him exiting the project. OTT platforms, he noted, follow strict commercial protocols with on-site oversight, making cost misuse impossible. Mayasabha too was made within the set budget and wrapped up in just 89 working days.

Deva Katta stated clearly that he doesn't support any political party or leader personally. He views every political issue from a policy perspective and believes true politics is about building a system that gives equal opportunities without caste or religious divisions. He doesn’t believe in glorifying anyone through cinema. If one wants to offer tributes, they can do it to photos — not through films. He maintains good relations across parties, but insists those associations don’t influence his work.

He described Mayasabha as a story of two friends who are shaped by the political climate around them and eventually become rivals. It explores the shift in political culture in the Telugu states from the 1950s to the 1980s. It is not just a story of Andhra Pradesh and Telangana, but of every politically aware Indian — and in a way, his own story too. He likens Mayasabha to poor man's RRR.

In conclusion, he reemphasized that blind devotion to any individual is a kind of slavery, and Mayasabha is an effort to liberate people from that. He fondly recalled that during his time in the US, Idlebrain.com was his go-to site for movie news, just as Cricinfo was for cricket.

ఎవరినైనా పిచ్చిగా ప్రేమించడం 'బానిసత్వమే'.. ఆ బానిసత్వం నుండి 'మయసభ' బయటకు తీసుకొస్తుంది - దేవా కట్టా

'మయసభ', ఇటీవల రిలీజ్ అయిన టీజర్ తో సంచలనం సృష్టించిన ఓ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ కు ప్రముఖ దర్శకుడు దేవా కట్టా దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా దేవా కట్టా ఐడిల్ బ్రెయిన్ జీవికి ఇంటర్వ్యూ ఇచ్చారు. నాటి 'వెన్నెల' సినిమా నుండి నేటి 'మయసభ' ఆయన సినీ ప్రయాణంలో ఎత్తు పల్లాలన్నిటినీ చెప్పుకుంటూ వచ్చారు. తన మొదటి సినిమా వెన్నెల ఒక రకంగా క్రౌడ్ ఫండింగ్ సినిమా అంటూ, ఆ సినిమా కూడా రాంగ్ రీజన్స్ కు బాగా హైలైట్ అయిందని, కానీ ఒక స్టోరీ నెరేటర్ గా తన మనసుకి సంతృప్తి దొరకలేదన్నారు. మానవ భావోద్వేగాలను స్పృశించే 'సతీ లీలావతి' లాంటి కామెడీ సినిమాలు చేయడం తనకిష్టం అన్నారు.

'ప్రస్థానం' కథ స్టార్స్ కోసం రాసుకున్నానని, ఏ హీరో దగ్గరకు వెళ్లినా వెన్నెలలో మాదిరి కామెడీకి కాస్త యాక్షన్ కలిపి తీస్తే సరిపోతుందనేవారన్నారు. అలా ఆ క్రమంలో 'ప్రస్థానం' కూడా తనకు మళ్ళీ మరో డెబ్యూ సినిమాలాగే అయిందన్నారు. రెమ్యునరేషన్ కూడా చూసుకోకుండా 'ప్రస్థానం' చేశానన్నారు. బడ్జెట్ సమస్యల వలన పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో అయిదారు నెలలు ఆ సినిమా ఆగిపోయిందన్నారు. ఇప్పుడు చేస్తున్న 'మయసభ ' నిర్మాత కృష్ణ విజయ్ వల్లనే 'ప్రస్థానం' సినిమా బయటకు రాగలిగిందన్నారు. ఆ సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్, ఆర్ట్ డైరెక్టర్ కూడా లేరన్నారు. ఈ బిడ్డ కోసం బాధలన్నీ భరించాలనే భావం 'ప్రస్థానం' సినిమాకు కలిగిందన్నారు. హిందీ 'ప్రస్థానం' విషయానికొచ్చేసరికి డైలాగ్ రైటర్ విషయంలో తనకు స్వేచ్ఛ లభించలేదన్నారు. ఆ సినిమా టేకాఫ్ లోనే తెలుగు 'ప్రస్థానం' చూసిన వాళ్లు తనను తిడతారన్న విషయం తనకు అర్ధమైపోయిందన్నారు.

'ఆటోనగర్ సూర్య' సినిమా ఫస్టాఫ్ అంతా దొంగచాటుగా ఎడిట్ చేసుకున్నా, సెకండాఫ్ విషయంలో తనను కనిపెట్టేసి బ్లాక్ చేసేశారన్నారు. ఆ సినిమా ఫస్టాఫ్ బాగా వచ్చినా, సెకండాఫ్ లో బలవంతంగా పెట్టిన కామెడీ సీన్స్ వల్లనే ఆ కథ గాడి తప్పిందని నిర్మాత అల్లు అరవింద్ కూడా అన్నారని చెప్పుకొచ్చారు. ఆ కారణంతోనే 'రిపబ్లిక్' సినిమాలో కామెడీని బలవంతంగా చొప్పించే ప్రయత్నాలు చేయలేదన్నారు. అలా తన ప్రయాణం కామెడీ సినిమా నుండి సీరియస్ సినిమాల వైపుకు జరిగిందన్నారు. 'ప్రస్థానం' మరియు 'వెన్నెల' సినిమాలు చేస్తున్నప్పుడు ఒక నిర్మాత సమక్షంలో, గౌరవంగా ఒక దర్శకుడిలా కుర్చీ వేసే రోజులు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూశానని, అలాంటి రోజులు 'ఆటో నగర్' కు వచ్చినా కూడా అప్పటి పాత రోజులే బాగుండేవని మళ్ళీ అనిపించిందన్నారు. ఒక క్రియేటర్ కు 'కంట్రోల్' మరియు 'కమాండ్' చాలా ముఖ్యమన్నారు.

'రిపబ్లిక్' సినిమా తన హృదఃయం నుండి వచ్చిన కథ అని, చాలామందికి 'ప్రస్థానం' కంటే 'రిపబ్లిక్' బాగా నచ్చిందన్నారు. ఆ సినిమా రిలీజ్ సమయంలో హీరో సాయి ధరమ్ తేజ్ కు ప్రమాదం అవ్వడం, ఆ సినిమా చుట్టూ జరిగిన సంఘటనల వైపు ఎక్కువ దృష్టి మరలడం, సినిమా ఎండింగ్ కూడా విషాదంగా ఉండటం లాంటి చాలా కారణాల వలన 'రిపబ్లిక్' సినిమాకు చాలా గాయాలయ్యాయన్నారు. ఆ సినిమాను రిలీజ్ కు ముందే ఒక అజెండా సినిమా అనుకొని అనుమానించడం కూడా ఆ సినిమాకు నష్టం జరగడంలో ప్రధాన కారణం అన్నారు. కోవిడ్ సమయం అవ్వడం వలన ఓ మంచి కథకు జరగాల్సిన న్యాయం జరగలేదన్నారు. 'రిపబ్లిక్' సినిమా తనతో పాటూ సాయి ధరమ్ తేజ్ కు ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. ఆ సినిమా థియేటర్లలో సరిగ్గా ఆడకపోయినా, రిలీజ్ అయిన తరువాత OTT లో విపరీతంగా ప్రజాదరణ పొందిందన్నారు.

'బాహుబలి వెబ్ సిరీస్' ను 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' లా మూడు నాలుగు సీజన్ల రూపంలో తీయాలన్న ఆలోచన తనకుండేదని, 'బాహుబలి 2' అయిపోయిన వెంటనే జనం మర్చిపోకుండా ఉండాలన్న తొందరలో వేగంగా చేయాలన్న నిర్మాణ సంస్థ ఒత్తిడి కారణంగా ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాల్సి వచ్చిందన్నారు. సినిమాతో పోల్చుకుంటే OTT ది విభిన్న శైలి అని, అందులోని కమర్షియల్ విభాగం చాలా కఠినమైన పద్ధతులను అనుసరిస్తారన్నారు. నిర్మాణ సంస్థ సిబ్బంది షూటింగ్ లొకేషన్లలోనే ఉంటారని, ఎక్కడా ఒక్క రూపాయి కూడా తప్పు జరిగే అవకాశం ఉండదన్నారు. 'మయసభ' నిర్మాణం కూడా అనుకున్న బడ్జెట్ లోబడే పూర్తయిందన్నారు. వర్కింగ్ డేస్ సినిమా కంటే తక్కువ ఉంటాయన్నారు. 'మయసభ' ను 89 రోజుల్లో పూర్తిచేశామన్నారు.

రాజకీయాల్లో పార్టీలకో , నాయకులకో ఒక వైపు వత్తాసు పలికే నైజం తనది కాదన్నారు. విధానాల పరంగా మాత్రమే ప్రతీ అంశాన్నీ చూడటం తనకు మొదటినుండీ అలవాటన్నారు. "కులమత విద్వేషాలు లేని, అందరికీ సమానంగా అవకాశాలిచ్చే వ్యవస్థ నిర్మాణమే రాజకీయం" అన్నదే తన ఉద్దేశ్యమన్నారు. ఎవరికో హారతులు పడుతూ సినిమాలు చేయలేనని, అలా చేయాలనుకుంటే వాళ్ళ ఫోటోలకు హారతి పడితే సరిపోతుందని, సినిమాలు తీయాల్సిన అవసరం లేదన్నారు. వ్యక్తిగతంగా తనకు అన్ని పార్టీల వ్యక్తులతోనూ మంచి సంబంధాలే ఉన్నాయన్నారు. ఆ ప్రభావం తన వృత్తిపై ఉండదన్నారు.

ఓ ఇద్దరు స్నేహితులను తమ చుట్టూ ఉన్న రాజకీయ పరిస్థితులు ఎలా ప్రభావం చేశాయో, ఆ క్రమంలో వాళ్లిద్దరూ ఎలా ప్రత్యర్థులుగా మారారో అన్న కథే 'మయసభ' అన్నారు. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం 1950 నుండి ఎనభయ్యో దశకం వరకూ ఎలా ఉండేదో, ఆ తరువాత కాలంలో ఎలాంటి సమూల మార్పులు రాజకీయాల్లో సంభవించాయో అన్న విషయాలను చూపించానన్నారు. 'మయసభ' అనేది రెండు తెలుగు రాష్ట్రాల కథ, ప్రతీ తెలుగు వాడి కథ, రాజకీయంగా ప్రతీ భారతీయుడి కథ మరియు తన కథని చెప్పుకుంటూ వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే 'మయసభ' ఒక 'మినీ RRR' అన్నారు. ఎవరినైనా పిచ్చిగా ప్రేమించడమనేది తన దృష్టిలో ఒక రకమైన బానిసత్వమని, ఈ 'మయసభ' అలాంటి బానిసత్వం నుండి బయటకు తీసుకొస్తుందన్నారు. చివర్లో 'ఐడిల్ బ్రెయిన్' గురించి ప్రస్తావిస్తూ తనకు అమెరికా లో ఉన్నప్పటి రోజుల నుండి 'ఐడిల్ బ్రెయిన్ వెబ్సైట్' అన్నది బాగా సుపరిచితం అని, అప్పట్లో క్రికెట్ కోసం 'క్రిక్ ఇన్ఫో' మరియు సినిమాల కోసం 'ఐడిల్ బ్రెయిన్' లే తమ కళ్లముందుండేవి అన్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved