pizza

Maurya Siddavaram and Tanvi Aakanksha's film under Meera Productions officially launched
మౌర్య‌, త‌న్వి హీరో హీరోయిన్లుగా మీరా ప్రొడ‌క్ష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ నెం.1 లాంఛ‌నంగా ప్రారంభం

You are at idlebrain.com > news today >

27 June 2026
Hyderabad


Meera Productions' maiden venture, starring Maurya Siddavaram and Tanvi Aakanksha in the lead roles, was formally launched on Saturday with traditional pooja ceremonies. The event took place at Ramanaidu Studios in Hyderabad and was attended by several prominent personalities from the Telugu film industry.

The event was graced by big celebrities. Ace producer Allu Aravind sounded the clap for the inaugural shot, while Allu Sneha switched on the camera. Young producer Bunny Vas handed over the script, marking the official launch of the project.

Speaking on the occasion, producer Sandeep Ramineni (Sandy) said, "This is the first production from our banner and it is being made as a complete entertainer. Director Geetha C. Shekhar has crafted a script that blends fun-filled entertainment with an emotional touch. Maurya and Tanvi make a charming on-screen pair, and we are confident they will impress audiences. We plan to begin the regular shoot in August, and details about the remaining cast and technical crew will be announced soon."

Cast: Maurya Siddavaram, Tanvi Aakanksha & Others

Technical Crew:

Banner: Meera Productions

Producer: Sandeep Ramineni (Sandy)

Director: Geetha C. Shekhar

Cinematography: Suresh Raguthu

మౌర్య‌, త‌న్వి హీరో హీరోయిన్లుగా మీరా ప్రొడ‌క్ష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ నెం.1 లాంఛ‌నంగా ప్రారంభం

మీరా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మౌర్య సిద్ధ‌వ‌రం, త‌న్వి ఆకాంక్ష హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం శ‌నివారం లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ క్లాప్ కొట్ట‌గా..అల్లు స్నేహ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. యంగ్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాస్ స్క్రిప్ట్‌ను అందించారు. ఈ సంద‌ర్భంగా...

నిర్మాత సందీప్ రామినేని(శాండి) మాట్లాడుతూ ‘‘మా బ్యానర్‌లో ప్రొడ‌క్ష‌న్ నెం.1 మూవీగా రాబోతోన్న ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌. డైరెక్ట‌ర్ గీత సి.శేఖ‌ర్‌ ఫ‌న్‌ ఎంట‌ర్‌టైనింగ్ కంటెంట్‌తో సినిమాను రూపొందిస్తూనే ఓ ఎమోష‌న‌ల్ ట‌చ్‌తో ఉండేలా స్క్రిప్ట్‌ను రెడీ చేశారు. మౌర్య‌, త‌న్వి జోడీ క్యూట్‌గా మెప్పించ‌నున్నారు. ఆగ‌స్ట్ నుంచి షూటింగ్‌ను ప్రారంభించ‌బోతున్నాం. త్వ‌ర‌లోనే సినిమాలోని ఇత‌ర న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్‌కు సంబంధించిన వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం’’ అన్నారు.

 

న‌టీన‌టులు:

మౌర్య సిద్ధ‌వ‌రం, త‌న్వి ఆకాంక్ష త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్: మీరా ప్రొడ‌క్ష‌న్స్‌
నిర్మాత‌: సందీప్ రామినేని (శాండి)
ద‌ర్శ‌క‌త్వం: గీత సి.శేఖ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: సురేష్ ర‌గుతు


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved