Megastar Chiranjeevi, Most Successful Director Bobby Kolli, Leading Production House KVN Productions’ #ChiruBobby2 / #Chiru158 Pollachi Schedule Completed, Hyderabad Schedule Commences, BTS Video Unveiled
మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లి, కేవీఎన్ ప్రొడక్షన్స్ #చిరుబాబీ2 / #చిరు158 పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తి- హైదరాబాద్ షెడ్యూల్ ప్రారంభం- అదిరిపోయే BTS వీడియో రిలీజ్
Megastar Chiranjeevi and director Bobby Kolli have reunited for the second time after the blockbuster success of Waltair Veerayya, with the film- #ChiruBobby2 / #Chiru158 being mounted on a massive scale by Venkat K Narayana under the KVN Productions banner. The production works are happening at brisk pace, with the team already wrapping up its first schedule in Pollachi, and commencing a new and lengthy schedule in Hyderabad today.
The Pollachi schedule was packed with important sequences, including a high-voltage action episode and several key sequences featuring the principal cast. To celebrate the completion of the schedule, the makers released an engaging BTS video that offers a sneak peek into the film's making.
The video showcases the energetic atmosphere on the sets, the extensive planning behind every sequence, and the grand scale at which the film is being crafted. Chiranjeevi is seen in an elegant, yet intense avatar, while Anaswara Rajan and Nivetha Pethuraj are also spotted participating in the shoot.
However, the biggest highlight from the BTS footage is a candid moment involving director Bobby Kolli. Watching Chiranjeevi immerse himself completely in a scene, the filmmaker was visibly overwhelmed and exclaimed, "Jeevinchesaaru Annayya," expressing his admiration for the Megastar's powerful performance.
The heartfelt reaction has further heightened expectations around the film, especially with Bobby promising a character and narrative that will present Chiranjeevi in a never-seen-before manner.
With the Pollachi schedule completed, the unit has now moved back to Hyderabad for an extensive new schedule. The team will be filming pivotal talkie portions and major action blocks that form the backbone of the story.
Backed by a stellar technical crew, the film features music by S Thaman, cinematography by Vijay Karthik Kannan, production design by Avinash Kolla, and editing by Antony L Ruben. The screenplay is penned by Kona Venkat and K Chakravarthy Reddy, with additional writing support from Hari Mohana Krishna and Vineeth Potluri, while Bhanu-Nandu are handling the dialogues.
The makers are expected to reveal more details later.
Cast: Megastar Chiranjeevi, Nivetha Pethuraj, Anaswara Rajan
Technical Crew:
Writer, Director: Bobby Kolli
Producer: Venkat K Narayana
Banner: KVN Productions
Music: Thaman S
Screenplay Writers: Kona Venkat, K Chakravarthy Reddy
Additional Screenplay Writers: Hari Mohana Krishna, Vineeth Potluri
DOP: Vijay Kartik Kannan
Editor: Antony Ruben
Production Design: Avinash Kolla
VFX Supervisor: Yugandhar T
Dialogues: Bhanu-Nandu
Chief Co-Directors: Bellamkonda Sathyam, Poosala Radhakrishna
Co-Director: V Kranthi Chakravarthi
Executive Producer: Saranya Potla
మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లి, కేవీఎన్ ప్రొడక్షన్స్ #చిరుబాబీ2 / #చిరు158 పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తి- హైదరాబాద్ షెడ్యూల్ ప్రారంభం- అదిరిపోయే BTS వీడియో రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ లో #ChiruBobby2 / #Chiru158 చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ విజయవంతమైన కాంబో మరోసారి చేతులు కలపడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే పొల్లాచ్చిలో మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న చిత్ర బృందం, ఈ రోజు హైదరాబాద్‌లో ఒక కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించింది.
పొల్లాచ్చి షెడ్యూల్‌లో హై-వోల్టేజ్ యాక్షన్, ప్రధాన తారాగణం పాల్గొన్న కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ పూర్తి కావడాన్ని పురస్కరించుకుని 'బిహైండ్-ది-సీన్స్' (BTS) వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.
ఈ వీడియోలో సెట్స్‌లో ఉన్న ఉత్సాహభరితమైన వాతావరణం, ప్రతి సన్నివేశం వెనుక ఉన్న ప్లానింగ్, సినిమాను ఎంత భారీ స్థాయిలో రూపొందిస్తున్నారో చూడవచ్చు. ఇందులో చిరంజీవి హుందాగా, హై ఇంటెన్స్ కూడిన లుక్‌లో కనిపిస్తుండగా, అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ కూడా షూటింగ్‌లో పాల్గొనడం కనిపించింది.
ఈ BTS వీడియోలో హైలెట్ గా నిలిచిన అంశం దర్శకుడు బాబీ కొల్లికి సంబంధించిన ఒక మూమెంట్. ఒక సన్నివేశంలో చిరంజీవి పూర్తిగా లీనమై నటించడాన్ని చూసి దర్శకుడు భావోద్వేగానికి లోనయ్యారు. మెగాస్టార్ అద్భుతమైన నటనను చూసి ముగ్ధుడైన ఆయన "జీవించేశారు అన్నయ్యా" అని ఉద్వేగంగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
దర్శకుడు బాబీ కొల్లి చిరంజీవిని ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఈ చిత్రంలో చూపించబోతున్నన్నారు. తాజాగా విడుదలైన చేసిన వీడియోలో ఆయన రెస్పాన్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.
పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తయిన తర్వాత, చిత్ర బృందం కొత్త షెడ్యూల్ ను హైదరాబాద్ లో మొదలుపెట్టింది. కథకు వెన్నెముకగా నిలిచే కీలకమైన టాకీ పార్ట్స్, ప్రధాన యాక్షన్ ఘట్టాలను చిత్రీకరించనున్నారు.
ఈ భారీ ప్రాజెక్ట్‌కు టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. సంగీతాన్ని ఎస్. థమన్ అందిస్తుండగా, సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తిక్ కన్నన్ చిత్రానికి అద్భుతమైన విజువల్స్ అందించనున్నారు. ప్రొడక్షన్ డిజైన్ అవినాశ్ కొల్లా నిర్వహిస్తుండగా, ఎడిటింగ్‌ను ఆంటోని ఎల్. రూబెన్ చేస్తున్నారు. కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తుండగా, హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి ఆడిషినల్ స్క్రీన్‌ప్లే రచయితలుగా పనిచేస్తున్నారు. భాను–నందు ద్వయం సంభాషణలను అందిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు.