pizza

We are Elated by MegaStar Chiranjeevi Garu’s Rs. 3 Lakh Support for Paralympic Medalist Deepthi Jeevanji
మెగాస్టార్ చిరంజీవిగారు ఒలింపిక్ విజేత దీప్తి జీవాంజికి మూడు ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్‌ను అందించ‌టం మాకెంతో సంతోషాన్నిచ్చింది

You are at idlebrain.com > news today >

03 January 2025
Hyderabad

Recently, Deepthi Jeevanji made our Telugu states proud by winning a Paralympic medal. She, who hails from a remote village in the Warangal district, made the entire country proud with her achievement.

After winning the Paralympic medal, when I asked her what she wanted, she said she wished to meet Chiranjeevi Garu. When I conveyed this to him, he immediately said how he could not meet someone who had achieved such a monumental milestone. He said not she, but he himself would come to our academy to meet her.

As promised, he visited our academy and spent nearly two hours interacting with the kids. His presence and words were truly inspiring for everyone.

We were also overjoyed to witness Chiranjeevi Garu presenting a cheque of Rs. 3 lakhs to Deepthi. This heartfelt gesture deeply honoured us. With his inspirational interaction, we hope to see many more aspiring kids achieve great heights in the sport.

-- Pullela Gopichand
Chief Coach, Indian National Badminton Team.

మెగాస్టార్ చిరంజీవిగారు ఒలింపిక్ విజేత దీప్తి జీవాంజికి మూడు ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్‌ను అందించ‌టం మాకెంతో సంతోషాన్నిచ్చింది

ఇటీవ‌ల మ‌న తెలుగు రాష్ట్రాల నుంచి పారా అథ్లెట్ ఒలింపిక్స్‌లో మెడ‌ల్ సాధించిన వ్య‌క్తి దీప్తి జీవాంజి. వ‌రంగ‌ల్‌లోని ఓ చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన ఆమె దేశానికెంతో పేరుని తెచ్చారు. ఒలింపిక్స్‌లో మెడ‌ల్ సాధించిన సంద‌ర్భంగా మీకేం కావాల‌ని నేను ఆమెను అడిగిన‌ప్పుడు, చిరంజీవిగారిని క‌ల‌వాల‌నుంద‌ని చెప్పారు.ఇటీవ‌ల నేను చిరంజీవిగారిని ఓ సంద‌ర్భంలో క‌లిసిన‌ప్పుడు దీప్తి జ‌వాంజి గురించి చెప్పాను. ఆయ‌న చాలా గొప్ప మ‌న‌సుతో స్పందించారు. చాలా పెద్ద అచీవ్‌మెంట్ చేసిన‌ప్పుడు, ఆమె రావ‌టం కాదు, నేను అకాడ‌మీకి వ‌స్తాన‌ని అన్నారు. అన్న‌ట్లుగానే చిరంజీవిగారు మా అకాడ‌మీకి వ‌చ్చి, అక్క‌డున్న పిల్ల‌లంద‌రినీ క‌లిశారు. రెండు గంట‌ల పాటు అక్క‌డే గ‌డిపారు. అలాగే ప్ర‌తీ ఒక్క ప్లేయ‌ర్‌ని ఇన్‌స్పైర్ చేసే విధంగా మాట్లాడారు. ఇదే సంద‌ర్భంలో ఆయ‌న మూడు ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్‌ను దీప్తికి అందించటం అనేది మాకెంతో సంతోషాన్నిచ్చింది. ఇది మా స్పోర్ట్స్ ప‌ర్స‌న్స్‌కి చిరంజీవిగారు ఇచ్చిన గొప్ప గౌర‌వంగా నేను భావిస్తాను. ఈ ఇన్‌స్పిరేష‌న్‌తో చాలా మంది మ‌రిన్ని ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహిస్తార‌ని నేను భావిస్తున్నాను.
- పుల్లెల గోపీచంద్‌ చీఫ్ కోచ్‌, ఇండియ‌న్ నేష‌న‌ల్ బాడ్మింట‌న్ టీమ్‌

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved