pizza

Nani launched Mem Famous trailer

You are at idlebrain.com > news today >
Follow Us

17 May 2023
Hyderabad

రైటర్ పద్మభూషణ్ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత లహరి ఫిల్మ్స్ మరియు చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ మేమ్ ఫేమస్! దీనికి దర్శకత్వం వహించడంతో పాటు సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్ర పోషించారు. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య మరియు సిరి రాసి ఇతర ప్రముఖ తారాగణం సుమంత్ ప్రభాస్ స్వయంగా రచన మరియు దర్శకత్వం వహించారు. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమా టీజర్ విడుదలైన తర్వాత యువత దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత పాటలకు కూడా మంచి స్పందన వచ్చింది. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌ లోని ఆర్టీసీ ఎక్స్‌ రోడ్స్‌ లోని సంధ్య థియేటర్‌ లో అశేష ప్రేక్షకుల ఆనందోత్సాహాల నడుమ నేచురల్‌ స్టార్‌ నాని మేమ్‌ ఫేమస్‌ సినిమా ట్రైలర్‌ ను విడుదల చేశారు.

ఈ వేడుకకు తొలి సినిమా ‘దసరా‘ తో బ్లాక్‌ బస్టర్‌ ఇచ్చిన దర్శకులు శ్రీకాంత్‌ ఓదెల, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సాన, చిత్ర నిర్మాతలు అనురాగ్‌ తదితరులు హాజరయ్యారు.

అనంతరం నేచురల్‌ స్టార్‌ నాని మాట్లాడుతూ, ఈ నిర్మాణ సంస్థ నా హోమ్‌ బేనర్‌. ఫంక్షన్‌కు పిలిస్తే ఎటువంటి అవకాశం వున్నా వస్తానని చెప్పి వచ్చాను. థ్యాంక్‌ యూ సోమచ్‌. మేం యూత్‌ అని గర్వంగా చెప్పుకునే టీమ్‌ అంతా నన్ను పిలిచారంటే నేనూ యూత్‌ అని ఎగ్జైట్‌ మెంట్‌ కలిగింది. మరోసారి అందరికీ కంగ్రాట్స్‌ చెబుతున్నా. నిర్మాతలు గుడ్‌ కంటెంట్‌ను ప్రెజెంట్‌ చేస్తున్నారు. ఇది బిగినింగ్‌ మాత్రమే ఇలాంటివి డెకేట్‌ వరకు సెలబ్రేషన్‌ చేసుకోవాలి. దర్శకుడు సుమంత్‌ ప్రభాస్‌ గతంలో .‘చూస్తూ.. చూస్తూ.’ అనే ఓ సాంగ్‌ చేశాడు. అది చూశాక. తనలో మంచి ఛామ్‌ వుందనిపించింది. ఆ తర్వాత డాక్టర్స్‌కు అంకితంగా ‘దారేలోదా..’ అనే చిన్న షాట్‌ ఫిలిం తీసింది సుమంత్‌ కావడం విశేషం. ఇప్పుడు తనే హీరోగా, దర్శకుడిగా మారి మేమ్‌ ఫేమస్‌ చేయడం చాలా సంతోషంగా వుంది. నేను నా షెడ్యూల్‌ గేప్‌లో వచ్చాను. ఒంట్లో బాగోకపోయినా ఫంక్షన్‌కు రావాలని వచ్చాను. మీ సందడి చూస్తుంటే.. ఓ మాట అనాలనుంది.. అంటూ.. మీ ప్రమోషన్స్‌ చూశాను. ఈరోజుతో చాలు ఆపేయండి ఆ ట్రెండ్‌. మే 26న మేమ్‌ ఫేమస్‌కు తీసేయండి బాక్సాఫీస్‌ బెండ్‌..అంటూ డైలాగ్‌ చెప్పి హుషారెత్తించారు. అదేవిధంగా మీరంతా ఎంకరేజ్‌ చేయండి అంటూ ప్రేక్షకులనుద్దేశించి మాట్లాడారు.

చిత్ర హీరో, దర్శకుడు సుమంత్‌ ప్రభాస్‌ మాట్లాడుతూ, మమ్మల్ని ఎంకరేజ్‌ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్‌ చెబుతున్నా. కొత్తవారిని ఎంకరేజ్‌ చేయడానికి నాని అన్న ముందుంటాడని వింటుంటాను. అది ఈరోజు చూశాను. చాలామంది ఫిలింమేకర్స్‌ ఇలా స్టేజ్‌ ముందు, అందరి ముందు ఇలా వుండాలనుకోవడం డ్రీమ్‌. అది నాకు 24 ఏళ్ళకే ఇచ్చినందుకు నిర్మాతలకు కృతజ్ఞతలు చెబుతున్నా. నా డైరెక్టర్‌ టీమ్‌ ఎంతో సాయం చేయబట్టే సినిమా బయటకు వచ్చింది. వారికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా టీమ్‌ అంతా పాజిటివితో కథ రాసుకుని ఇదే మన జీవితం అని పట్టుదలతో కథ రాసి తెరకెక్కించాం. మా సినిమా యూత్‌ కోసమే తీశాం. వల్గారిటీ లేని సినిమా. అందుకే మీరు చూసి ఆ తర్వాత థియేటర్‌కు పెద్దల్ని కూడా తీసుకువస్తారని ఆశిస్తున్నాం. 35 మంది ఆర్టిస్టులనేకాదు టెక్నీషియన్స్‌ కూడా కొత్తవారిని పరిచయంచేసే ఛాన్స్‌ నిర్మాతలు ఇచ్చారంటూ, పేరుపేరునా అందరికీ పరిచయం చేశారు. నాని దసరా థియేటర్‌లో చూసి డాన్స్‌ కూడా వేశామంటూ తెలిపారు.

దసరా దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల మాట్లాడుతూ, మేమ్‌ ఫేమస్‌ పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నా. దసరా సినిమాను సుదర్శన్‌లో తల్లిదండ్రులతో చూశాను. ఆ ఎంజాయ్‌ ఎలా వుంటుందో నాకు తెలుసు. అలాగే మేమ్‌ ఫేమస్‌ టీమ్‌ కుటుంబాలు ఈ సినిమా చూసి అంత ఎంజాయ్‌చేస్తారని అనుకుంటున్నా. ఒక టైంలో మనకు బలుపు వుంటుంది. చేసే పనిలో తప్పో ఒప్పో తెలీని స్థితిలో నాన్న వుండి గైడ్‌ చేస్తారు. అలా నన్ను నాని గైడ్‌ చేశారు. అందుకే దసరా సినిమా చేయగలిగాను అన్నారు.

ఛాయ్‌ బిస్కెట్‌ ఫిలింస్‌ శరత్‌ మాట్లాడుతూ, మా ఛాయ్‌ బిస్కెట్‌ జర్నీలో సపోర్టింగ్‌ చేస్తూ ట్రైలర్‌ లాంచ్‌కు వచ్చిన హీరో నానికి ధన్యవాదాలు. యంగ్‌ ఫెలోస్‌, యూత్‌ అనుకుంటే ఏదైనా సాధిస్తారనే కంటెంటే ఈ సినిమా. ఇప్పుడు ట్రైలర్‌లోనూ పాటల్లోనూ చూసింది 23 ఏళ్ళ యూత్‌. ఇక సినిమా చూస్తే ఎక్కువ ఎంజాయ్‌ చేస్తారు. మే 26న థియేటర్‌లో హల్‌ చల్‌ చేస్తారని ఆశిస్తున్నాను. ఇది ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ అనేకంటే మేం కరెక్ట్‌ సినిమా తీశాం కాబట్టి మాకు నమ్మకం ఏర్పడింది అన్నారు.

లహరి ఫిలింస్‌ అధినేత చంద్రు మాట్లాడుతూ, మే 26న మంచి మీల్‌ లాంటి సినిమా ఇస్తున్నాం అన్నారు.

దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ, శ్రీకాంత్‌, నేను సుకుమార్‌ దగ్గర పనిచేశాం. ఎవరైనా ఫేమస్‌ అవ్వాలంటే అంత ఈజీకాదు. శ్రీకాంత్‌ 18 కిలోమీటర్లు బైక్‌మీద వచ్చి సుకుమార్‌ను కలవాలని వచ్చేవాడు. అంత కష్టపడి ఇష్టంతో జాయిన్‌ అయ్యాడు. అలాగే ఈ సినిమా హీరో, దర్శకుడు అయిన సుమంత్‌కు పెద్ద హిట్‌ ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved