31 October 2015
Hyderabad
ఆడియో విడుదల సన్నాహాల్లో ‘మేము’
సూపర్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ పాండిరాజ్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ సూర్య నటిస్తూ నిర్మిస్తున్న ‘పసంగ-2’ చిత్రాన్ని తెలుగులో ‘మేము’ పేరుతో విడుదల చేస్తుండడం తెలిసిందే. సాయిమణికంఠ క్రియేషన్స్ పతాకంపై జూలకంటి మధుసూదన్‌రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుకు అందిస్తున్నారు. సూర్య`కె.ఇ.జ్ఞాన్‌వేల్ రాజా ఈ చిత్రాన్ని తెలుగులో సంయుక్తంగా సమర్పిస్తున్నారు. అమలాపాల్, బిందుమాధవి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి అర్రోల్ కొర్రెల్ సంగీతం అందిస్తున్నారు.
తమిళంలో ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియో అద్బుతమైన ఆదరణ పొందుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ అర్రోల్ కోర్రెల్ పేరు తమిళ నాట మారుమోగుతోంది. తెలుగులో వెన్నెలకంటి-చంద్రబోస్-సాహితి సాహిత్యం సమకూర్చుతున్న ఈ చిత్రంలోని పాటలు ఈవారంలో విడుదల కానున్నాయి.
ఈ సందర్భంగా నిర్మాత జూలకంటి మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘హ్యాట్రిక్ హిట్స్ డైరెక్టర్ పాండిరాజ్ దర్శత్వంలో.. సూపర్‌స్టార్ సూర్య నటిస్తూ నిర్మిస్తున్న ‘పసంగ`2’ చిత్రాన్ని ‘మేము’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా ఆనందంగానూ.. గర్వంగానూ ఉంది.
సన్నితి ప్రొడక్షన్స్ మరియు శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్ అధినేతలు ప్రసాద్ సన్నితి-తమటం కుమార్‌రెడ్డి మాతో కలిసి తెలుగులో ఈ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకొంటున్నారు.
హిందీలో అమీర్‌ఖాన్ నటించి, నిర్మించి.. దర్శకత్వం వహించిన ‘తారే జమీన్ పర్’ తరహా గొప్ప చిత్రం ‘మేము’. "మనం, దృశ్యం" చిత్రాల్ కోవలో అందర్నీ అమితంగా అలరించే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. దర్శకుడిగా పాండిరాజ్ ఎంతటి ప్రతిభావంతుడో మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వారంలో ఆడియో విడుదల చేసి, ఈనెలలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.
శశాంక్ వెన్నెలకంటి సంభాషణలు సమకూర్చుతున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: బాసుబ్రమణియం, కూర్పు: ప్రవీణ్ కె.యల్, సాహిత్యం: వెన్నెలకంటి-చంద్రబోస్-సాహితి-సంగీతం: అర్రోల్ కొర్రెల్, సమర్పణ: సూపర్‌స్టార్ సూర్య-కె.ఇ.జ్ఞానవేల్ రాజా, నిర్మాత: జూలకంటి మధుసూదన్‌రెడ్డి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: పాండిరాజ్!!