pizza

Super Hero Teja Sajja, Karthik Gattamneni, TG Vishwa Prasad, People Media Factory's Super Yodha Film Titled Mirai, Goosebumps-inducing glimpse released by Producer Daggubati Suresh Babu,Theatrical Release on 18th April, 2025 In 3D
సూపర్ హీరో తేజ సజ్జా, కార్తీక్ ఘట్టంనేని, టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సూపర్ యోధ చిత్రం అబ్బురపరిచే “మిరాయ్” టైటిల్ గ్లింప్స్ రామానాయుడు స్టూడియోలో డి. సురేష్ బాబు లాంఛ్ చేశారు. 2025 ఏప్రిల్ 18న థియేట్రికల్ రిలీజ్(3డి లో)

You are at idlebrain.com > news today >

18 April 2024
Hyderabad

Tollywood’s successful Production House People Media Factory recently announced their Production No. 36 with Super Hero Teja Sajja playing the Super Yodha character and the very talented director Karthik Gattamneni helming it. TG Vishwa Prasad who has good taste and is very passionate about filmmaking is bankrolling the movie on a large scale with top-notch production and technical standards. As promised, the makers unveiled the film’s title, first look poster, and Goosebumps-inducing glimpse released by producer Daggubati Suresh Babu.

The movie is titled Extraordinarily Mirai which means Future. The title logo is designed in a Japanese font. The first look poster sees Teja Sajja in a Super Yodha look with a Yo (Staff Stick) in his hand, standing on top of an erupting volcano. He looks extremely fierce. In the background, we can observe an eclipse.

The glimpse is intended to portray the backstory of the movie. It is based on King Ashoka and his secret 9. Kalinga War remains a bad mark in history for Ashoka. The divine mystery was revealed in that repentance. That is the vast knowledge of 9 scriptures that make man divine. 9 warriors are recruited to protect them for generations. An eclipse approaches such knowledge. Then takes a birth that stops the eclipse. It is an inevitable great battle for generations.

The narrative from a Buddha Monk binds us. The backstory alone gives us goosebumps and makes us prepare for something we haven’t witnessed before. Karthik Gattamneni’s intense work on pre-production, production, and post-production is clearly perceptible in the glimpse. While the story has a historic touch, it is told engagingly. Teja Sajja is introduced as a Super Yodha who is there to stop the eclipse from reaching the Secret 9 of Ashoka. He excels in Karra Samu (stick fight), and other forms of fights. He fits the bill perfectly as Super Yodha and has come up with an excellent performance. Ritika Nayak who played the female lead got a meaty role.

Karthik Gattamneni showed his expertise in cinematography, as each frame is like a diamond. Gowra Hari has enhanced the narrative with his thumping score. The VFX work is also of high quality. The production values of People Media Factory are world-class, as we get a feel of watching an international movie. The glimpse is impressive to the core and makes us wait eagerly for the next updates.

Karthik Gattamneni penned the screenplay, alongside Manibabu Karanam who also wrote dialogues. Sri Nagendra Tangala is the art director of the movie, whereas Vivek Kuchibhotla is the co-producer. Krithi Prasad is the Creative Producer, whereas Sujith Kumar Kolli is the Executive Producer.

The makers through the glimpse have announced to release of Mirai in multi-languages- Telugu, Hindi, Tamil, Kannada, Malayalam, Bengali, Marathi and Chinese languages on April 18th in summer in 2D and 3D versions, exactly after one year.

Cast: Super Hero Teja Sajja, Ritika Nayak

Technical Crew:

Director: Karthik Gattamneni

Producer: TG Vishwa Prasad

Banner: People Media Factory

Co-producer: Vivek Kuchibhotla

Creative Producer: Krithi Prasad

Executive Producer: Sujith Kumar Kolli

Music: Gowra Hari

Art Director: SriNagendra Tangala

Writer: Manibabu Karanam

సూపర్ హీరో తేజ సజ్జా, కార్తీక్ ఘట్టంనేని, టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సూపర్ యోధ చిత్రం అబ్బురపరిచే “మిరాయ్” టైటిల్ గ్లింప్స్ రామానాయుడు స్టూడియోలో డి. సురేష్ బాబు లాంఛ్ చేశారు. 2025 ఏప్రిల్ 18న థియేట్రికల్ రిలీజ్(3డి లో)

టాలీవుడ్ లో విజయవంతమైన ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తమ ప్రొడక్షన్ నెం. 36ని ప్రకటించింది, ఇందులో సూపర్ హీరో తేజ సజ్జ సూపర్ యోధ పాత్రను పోషిస్తున్నారు. ప్రతిభావంతులైన దర్శకుడు కార్తీక్ ఘట్టంనేని దర్శకత్వం లో అభిరుచి ఉన్న నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మేకర్స్ ఈ రోజు సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు ఒక గ్లింప్స్ గురువారంనాడు రామానాయుడు స్టూడియోలో డి. సురేష్ బాబు విడుదల చేశారు.

ఈ చిత్రానికి ఫ్యూచర్ అనే అర్థం వచ్చేలా “మిరాయ్” అనే టైటిల్ పెట్టారు. టైటిల్ లోగో జపనీస్ ఫాంట్ లో రూపొందించబడింది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో తేజ సజ్జ సూపర్ యోధా లుక్ లో చేతిలో యో (స్టాఫ్ స్టిక్)తో, బద్దలయ్యే అగ్నిపర్వతం పైన ఉగ్రంగా నిలబడి ఉన్నట్లు కనిపిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ లో, మనం గ్రహణాన్ని గమనించవచ్చు.

ఈ గ్లింప్స్ సినిమా నేపథ్యాన్ని తెలిపేలా ఉంది. ఇది అశోక రాజు మరియు అతని 9 రహస్యాల ఆధారంగా రూపొందించబడింది. కళింగ యుద్ధం అశోకుని చరిత్రలో చెడ్డ గుర్తుగా మిగిలిపోయింది. ఆ పశ్చాత్తాపంలోనే దైవ రహస్యం వెల్లడైంది. అంటే మనిషిని దైవంగా మార్చే 9 గ్రంథాల అపారమైన జ్ఞానం. తరతరాలుగా వారిని రక్షించేందుకు 9 మంది యోధులను నియమించారు. అటువంటి జ్ఞానానికి గ్రహణం చేరుకుంటుంది. అప్పుడు గ్రహణాన్ని ఆపడానికి ఒక జన్మ పుడుతుంది. తరతరాలుగా ఇది అనివార్యమైన మహా యుద్ధం అంటూ బుద్ధ సన్యాసి నుండి వచ్చిన కథనం మనల్ని కట్టిపడేస్తుంది. ఇంతకు ముందు చూడని విజువల్ వండర్ లా ఈ చిత్రం ఉండబోతుంది అన్నట్టు తెలుస్తుంది

ప్రీ-ప్రొడక్షన్, ప్రొడక్షన్ మరియు పోస్ట్-ప్రొడక్షన్ పై కార్తీక్ ఘట్టంనేనికి ఉన్న గ్రిప్ ఏంటో గ్లింప్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది. కథకు హిస్టారిక్ టచ్ ఉన్నప్పటికీ, అది ఎంగేజింగ్ గా చెప్పారు. అశోకుడి 9వ రహస్యానికి గ్రహణం రాకుండా ఆపడానికి వచ్చిన సూపర్ యోధగా తేజ సజ్జ ఎంట్రీ అద్భుతంగా ఉంది.తను కర్రసాము మరియు ఇతర పోరాటాలలో రాణించాడు. సూపర్ యోధాగా సరిగ్గా నప్పుతూ అద్భుతమైన ప్రదర్శనతో ముందుకు వచ్చాడు. కథానాయికగా నటించిన రితికా నాయక్ కు మంచి పాత్ర లభించినట్టు తెలుస్తుంది

కార్తీక్ ఘట్టంనేని సినిమాటోగ్రఫీలో తన నైపుణ్యాన్ని చూపించి ప్రతి ఫ్రేమ్ డైమండ్ లా చూపించాడు. గౌర హరి తన అద్భుతమైన స్కోర్ తో కథనాన్ని మరింత ఇంటరెస్టింగ్ గా తీసుకువెళ్లాడు. వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా చాలా క్వాలిటీగా ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు ప్రపంచ స్థాయికి తక్కువ కాకుండా ఉన్నాయి, ఒక అంతర్జాతీయ సినిమా చూస్తున్న అనుభూతిని పొందుతాము. మిరాయ్ గ్లింప్స్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది మరియు తదుపరి అప్డేట్ ల కోసం ఆసక్తిగా ఎదురుచూసేలా చేసింది.

కార్తీక్ ఘట్టంనేని స్క్రీన్ ప్లే రాయగా మణిబాబు కరణం డైలాగ్స్ రాశారు. ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ శ్రీ నాగేంద్ర తంగాల కాగా, సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల. కృతి ప్రసాద్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ కాగా, సుజిత్ కుమార్ కొల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.

గ్లింప్స్ ద్వారా నిర్మాతలు మిరాయ్ ను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ మరియు చైనీస్ భాషల్లో ఏప్రిల్ 18న వేసవిలో 2D మరియు 3D వెర్షన్ లలో సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

అనంతరం దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మాట్లాడుతూ, మిరాయ్ అనేది అశోకుని కాలంలో రహస్యమైన ఓ శాసనం. దాన్ని కొందరు కాపాడుతుంటారు. ఇది సినిమా విడుదలయ్యాక మరింత బాగా అర్థమవుతుంది. ఈ కథ కోసం చాలా నేర్చుకుని నేను సినిమా చేస్తున్నా. హనుమాన్ కు ముందే ఈ సినిమా కథను తేజ కు చెప్పాను. పదేళ్ళుగా తనతో జర్నీ చేస్తున్నా. ఇదొక అద్భుతమైన సినిమాగా మలచబోతున్నాను అని అన్నారు.

చిత్ర నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ మాట్లాడుతూ, కార్తీక్ తో జర్నీ చాలా బాగుంది. తనకు ఓ విజన్ వుంది. ఈ సినిమాలో ప్రతి పైసా వెండితెరపై కనులపండువలా వుంటుంది. పాన్ వరల్డ్ గా సినిమాను చేయనున్నాం. తేజ సజ్జకు ముందు రికార్డ్ లను బద్దలు కొట్టే సినిమా మిరాయ్ వుంటుంది అని చెప్పారు.

డి. సురేష్ బాబు మాట్లాడుతూ, విశ్వ్రసాద్, కార్తీక్, తేజ ముగ్గురి డ్రీమ్ ఈ సినిమాతో నెరవేరుతుంది. సంగీత దర్శకుడు గౌరి సంగీతం చాలా నైస్ గా వుంది. అందరూ కలిసి వండరల్ ఫుల్ సినిమాను అందిస్తున్నారని గ్లింప్స్ చూస్తే తెలుస్తుంది అని అన్నారు.

తేజ సజ్జ మాట్లాడుతూ, హనుమాన్ తర్వాత రిలాక్స్ అయిపోయావా..అని చాలా మంది అడుగుతున్నారు. కానీ ప్రదీదీ జాగ్రత్తగా స్టెప్ వేయాలని తీసుకున్న నిర్ణయం ఈ సినిమా. ముందు సినిమాలు ఒక ఐడియాతో చేశాం. ఈ సినిమా అయితే మాకున్న వనరులతో పెద్ద సినిమాగా చేయబోతున్నాం. ముందుగా గ్లింప్స్ విడుదలయింది. నన్ను యోధునిగా కార్తీక్ చూపించబోతున్నాడు. తనతో పదేళ్ళ జర్నీ వుంది. ఆయన విజన్ చాలా గొప్పగా వుంటుంది. విశ్వప్రసాద్ గారితో సినిమా చేయడం మరింత ఆనందంగా వుంది. ఇదే రామానాయుడు స్టూడియో నా కెరీర్ మొదలయింది. ఈరోజు ఇక్కడే గ్లిమ్ప్స్ విడుదల చేయడం మరింత ఆనందంగా వుంది. ఆరునెలల క్రితమే ఈ సినిమాను మొదలు పెట్టాం. వచ్చే ఏడాది విడుదలనాడు గుడ్ ఫ్రైడే. నాకూ అందరికీ గుడ్ ప్రైడ్ అవుతుందని ఆశిస్తున్నాను అని చెప్పారు.

నందిని రెడ్డి మాట్లాడుతూ, తేజ చాలా టాలెంటెడ్. సురేష్ బాబుగారి దగ్గర స్రిప్ట్, చిరంజీవిగారి దగ్గర కథను ఎలా సెలక్ట్ చేసుకోవాలో నేర్చుకున్నాడు. తనలోని గొప్ప క్వాలిటీతో మంచి సినిమాలు చేస్తున్నాడు. ఓ బేబీ నుంచి హనుమాన్ వరకు గమనిస్తున్నా తను సెల్ప్ మేడ్ స్టార్ అని అన్నారు.

అద్భుతం దర్శకుడు. మల్లిక్ రామ్ మాట్లాడుతూ, గ్లింప్స్ లో ప్రతీ షాట్ డిజైన్ బాగా చేశారు. తేజ మొదటి నుంచి కథల ఎంపికలో చాలా కేర్ తో చేస్తున్నాడు. విశ్వప్రసాద్ గారికి, గౌరవ్ హరి, నాగేంద్ర కలిసి అద్భుతమైన వండర్ ఇవ్వబోతున్నాను. హనుమాన్ త్వాత తేజ ఏ సినిమా చేయాలనుకుంటున్నప్పుడు కరెక్ట్ గా ఈ సినిమా కుదిరింది అని చెప్పారు.

క్రిష్ణ చైతన్య మాట్లాడుతూ, హరి గౌర ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చాడు. మిరాయ్ అద్భతమైన సినిమా అవుతుంది అన్నారు.

బేబీ నిర్మాత ఎస్.కె.ఎన్. మాట్లాడుతూ, మిరాయ్ సినిమా తేజకూ, విశ్వప్రసాద్ గారికి కలికితురాయిలా మిగులుతుంది. గ్లింప్స్ చూస్తే గర్వంగా అనిపించింది. తెలుగు సినిమా మరో మెట్టు ఎక్కింది. టాప్ స్టార్స్ ఇలాంటి సినిమాలు చేయడం మామూలే. అప్ కమింగ్ హీరో ఇలాంటి కథతో చేయడం విశేషం. విశ్వప్రసాద్ గారి తపన ప్రతి ప్రేమ్ లో కనిపిస్తుంది. క్వాలిటీకి ్రపాధాన్యత ఇస్తారు. ఈ సినిమాను ఇంటర్ నేషనల్ స్థాయికి విశ్వప్రసాద్ తీసుకెళతారని తేజ చెప్పారు. గ్లింప్స్ విజువల్ పోయెట్రీ లా వుంది. ఈ సినిమాతో తేజ మరింత పెద్ద హీరోగా ఎదగాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ, గ్లింప్స్ చూస్తే చాలా ఆనందంగా వుంది. తేజ హార్డ్ వర్క్ ను ఏడేళ్ళ నుంచి నేను చూస్తూనే వున్నాను. మిరాయ్ సినిమా మరింత స్థాయి పెరుగుతుందని భావిస్తున్నాను అన్నారు.

శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ, గ్లింప్స్ చూస్తే నెక్ట్స్ లెవెల్ లో వుంది. తేజ ఎంట్రీకి గౌరవ్ ఇచ్చిన ఆర్.ఆర్. బూజ్ బమ్స్ వచ్చేలా చేసింది. అన్నారు.

సాహు గారపాటి మాట్లాడుతూ, తేజ గ్రో అవడం చాలా ఆనందంగా వుంది. గ్లింప్స్ చూస్తే హాలీవుడ్ సినిమా చూసినట్లుంది. అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను అన్నారు.

మరో నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ, విశ్వప్రసాద్ ప్రసాద్ గారి విజన్ ఇందులో కనిపింంచింది. నందిని గారు అన్నట్లు తేజ టాలెంటెడ్ పర్సన్. వరల్డ్ స్టయిల్ లో ఈ మూవీ వుంది.

వివేక్ కూచి భొట్ల మాట్లాడుతూ, ఓ బేబీ అప్పుడు తేజ. నాతో పది కోట్ల సినిమా వుందని చెప్పాడు. అలా జాంబిరెడ్డి చేశాడు. హనుమాన్ తో వందకోట్ల క్లబ్ లో చేరుకున్నారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో కార్తీక్, విశ్వప్రసాద్ గారు తీసుకెలుతున్నారు. పాన్ ఇండియాలో పెద్దహిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

ఆర్ట్.డైరెక్టర్ నాగేంద్ర తెలుపుతూ, పీపుల్స్ మీడియాలో ఇంతకుముందు సినిమాలు చేశాను. ఈ సినిమా చాలా ఎంటర్ టైన్ చేస్తుంది.

సంగీత దర్శకుడు గౌరవ హరి మాట్లాడుతూ, హనుమాన్ కు పని చేశాను. మరలా ఈ సినిమాలో సంగీత పరంగా కొత్త డోర్ ఓపెన్ చేస్తుంది అన్నారు.

తారాగణం: సూపర్ హీరో తేజ సజ్జా, రితికా నాయక్

సాంకేతిక సిబ్బంది:
దర్శకుడు: కార్తీక్ ఘట్టంనేని
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
క్రియేటివ్ ప్రొడ్యూసర్: కృతి ప్రసాద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ కొల్లి
సంగీతం: గౌర హరి
ఆర్ట్ డైరెక్టర్: శ్రీనాగేంద్ర తంగాల
రచయిత: మణిబాబు కరణం

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved