pizza

Super Hero Teja Sajja, Manoj Manchu, Karthik Ghattamaneni, TG Vishwa Prasad, Krithi Prasad, People Media Factory’s Pan India Film Mirai Trailer On August 28, Theatrical Release On September 12th
సూపర్ హీరో తేజ సజ్జా, మనోజ్ మంచు, కార్తీక్ ఘట్టమనేని, టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పాన్ ఇండియా ఫిల్మ్ 'మిరాయ్' ట్రైలర్ ఆగస్టు 28న రిలీజ్- సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్

You are at idlebrain.com > news today >

26 August 2025
Hyderabad

Super Hero Teja Sajja is all set to astonish as fearless Super Yodha character in the highly anticipated pan-India superhero spectacle Mirai, being directed by Karthik Ghattamaneni and produced by TG Vishwa Prasad and Krithi Prasad under the People Media Factory banner. Already, the glimpses, teaser, BTS video, and Vibe Undi song generated strong buzz for the movie. Now, it’s time for the launch of the trailer. It will be dropped in two more days on August 28th.

The trailer poster features a thrilling standoff between the protagonist and the antagonist. Teja appears as the mystical warrior Super Yodha, wielding a magical staff that glows with energy, while Manoj stands tall as the menacing Black Sword, gripping his colossal blade with lethal confidence. The poster has further heightened expectations from the film.

Ritika Nayak plays the female lead opposite Teja Sajja in the movie, while Shriya Saran, Jayaram, and Jagapathi Babu will be seen in crucial roles.

The film’s cinematography is handled by director Karthik Ghattamaneni himself, while music is scored by Gowra Hari. The screenplay was penned by Manibabu Karanam, whereas Sri Nagendra Tangala takes care as Art Director, and Sujith Kumar Kolli is an Executive Produce.

The makers through trailer poster also announced to release the movie on September 12th, in eight languages, in both 2D and 3D formats.

Cast: Super Hero Teja Sajja, Manoj Manchu, Ritika Nayak, Shriya Saran, Jayaram, Jagapathi Babu

Technical Crew:
Director: Karthik Gattamneni
Producers: TG Vishwa Prasad, Krithi Prasad
Banner: People Media Factory
Executive Producer: Sujith Kumar Kolli
Music: Gowra Hari
Art Director: Sri Nagendra Tangala
Writer: Manibabu Karanam

సూపర్ హీరో తేజ సజ్జా, మనోజ్ మంచు, కార్తీక్ ఘట్టమనేని, టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పాన్ ఇండియా ఫిల్మ్ 'మిరాయ్' ట్రైలర్ ఆగస్టు 28న రిలీజ్- సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్

సూపర్ హీరో తేజ సజ్జా మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా సూపర్ హీరో విజువల్ వండర్ 'మిరాయ్‌'లో సూపర్ యోధ పాత్రలో అలరించబోతున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, బిటిఎస్ వీడియో వైబ్ ఉంది సాంగ్ మ్యాసీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ట్రైలర్ ఆగస్టు 28న లాంచ్ చేయనున్నారు.

హీరో, విలన్ పవర్ ఫుల్ గా కనిపించిన ట్రైలర్ పోస్టర్‌ అదిరిపోయింది. తేజ సూపర్ యోధాగా ఎనర్జీతో మెరుస్తున్న మ్యాజికల్ స్టిక్ తో కనిపించగా, మనోజ్ ఫెరోషియస్ బ్లాక్ స్వోర్డ్ గా, భారీ ఖడ్గాన్ని పట్టుకుని ఎదురు నిలబడ్డాడు. ఈ పోస్టర్‌తో సినిమా మీద అంచనాలు నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళాయి.

ఈ చిత్రంలో తేజ సజ్జ సరసన రితికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా, శ్రీయా శరణ్, జయరామ్, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మిరాయ్ దర్శకత్వం వహించడమే కాకుండా, సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అలాగే స్క్రీన్‌ప్లేను కార్తీక్ స్వయంగా రూపొందించారు. మణిబాబు కరణం రచన, సంభాషణలకు కీలకంగా పని చేశారు. గౌర హరి సంగీతం, ఆర్ట్ డైరెక్టర్‌గా శ్రీ నాగేంద్ర తంగాల, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సుజిత్ కుమార్ కొల్లి పని చేస్తున్నారు.

ట్రైలర్ పోస్టర్ ద్వారా మేకర్స్ సినిమాను సెప్టెంబర్ 12న ఎనిమిది భాషల్లో 2డి, 3డి ఫార్మాట్లలో విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.

తారాగణం: సూపర్ హీరో తేజ సజ్జ, మనోజ్ మంచు, రితికా నాయక్, శ్రియ శరణ్, జయరామ్, జగపతి బాబు
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని
నిర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ కొల్లి
సంగీతం: గౌర హరి
ఆర్ట్ డైరెక్టర్: శ్రీ నాగేంద్ర తంగాల
రైటర్: మణిబాబు కరణం
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved