pizza

Shreyas group enters into beauty pageant contest with Miss Highness

You are at idlebrain.com > news today >
Follow Us

15 February 2023
Hyderabad

To commemorate its 12th anniversary, Shreyas Media is excited to introduce a a new annual fashion intellectual property called Miss Highness. As an event management company renowned for organizing the most prominent movie promotion events in India, Shreyas Media also offers comprehensive 360-degree promotion and digital marketing services. With Miss Highness, Shreyas Media is set to venture into the fashion industry, providing a platform for brilliant girls to confidently showcase their talents and bring out their true selves. The event promises to be a grand celebration of beauty, elegance, and Indian heritage, complete with top-notch grooming, attire by India’s renowned designers. Join us for the launch of Miss Highness and be a part of this exciting new chapter in India's fashion industry.

ప్రముఖ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ శ్రేయాస్‌ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించనున్న మిస్‌ హైనెస్‌ అందాల పోటీల కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమం మంగళవారం జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 36లోని ఎఫ్‌ హౌజ్‌లో సందడిగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్యాషన్‌ షో ఉర్రూతలూగించింది. విభిన్నమైన వస్త్రధారణతో ముద్దుగుమ్మలు ర్యాంప్‌పై హొయలొలికించారు. అందచందాలతో చూపరులను ఆకట్టుకున్నారు. ఇప్పటిదాకా సినిమా, లైఫ్‌స్టైల్‌ ఈవెంట్స్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థగా పేరు సంపాదించుకున్న తాము ఫ్యాషన్‌ రంగంలోకి అడుగిడుతున్నామని శ్రేయాస్‌ మీడియా అధినేత శ్రీనివాస్‌ తెలిపారు. ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్ వేదికగా మిస్ హైనెస్ నిర్వహిస్తారు. దేశంలోని వివిధ నగరాల్లో ప్రతి నెల మిస్‌ హైనెస్‌ అందాల పోటీల నిర్వహించి… వచ్చే ఏడాది గ్రాంట్ ఫినాలే దుబాయ్ లో నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. వివిధ నగరాలకు చెందిన మోడల్స్‌ ఈ పోటీల్లో పాల్గొంటారని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఫ్యాషన్‌షోకు సంబంధించిన క్రౌన్‌ను లాంచ్‌ చేసి పోస్టర్ ను అన్విల్ చేశారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved