pizza
MohanLal dubs for Manamantha
`మ‌నమంతా` చిత్రం కోసం తెలుగులో డ‌బ్బింగ్ చెబుతున్న మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్‌
You are at idlebrain.com > news today >
Follow Us

21 June 2016
Hyderaba
d

ఎన్నో విలక్షణమైన పాత్రలతో, కథాంశాలతో మెప్పించిన జాతీయస్థాయి ఉత్తమనటుడు మోహన్ లాల్ ప్ర‌ధాన‌పాత్ర‌లో రూపొందుతోన్న చిత్రం `మనమంతా`. విలక్షణ నటి గౌతమి కూడా ఈ చిత్రంలో మరో ప్రధాన పాత్రలో నటిస్తుంది. ‘ఐతే’, ‘అనుకోకుండా ఒకరోజు’, ‘ఒక్కడున్నాడు’, ‘ప్రయాణం’, ‘సాహసం’ వంటి డిఫరెంట్ చిత్రాలను డైరెక్ట్ చేయడమే కాకుండా తొలి చిత్రం ‘ఐతే’తో నేషనల్ అవార్డ్ దక్కించుకున్న దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ‘ఈగ’, ‘అందాల రాక్షసి’,’లెజండ్’, ‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్యా’ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించడంతో పాటు తొలి చిత్రం ‘ఈగ’తో నేషనల్ అవార్డు చేజిక్కించుకున్న స్టార్ ప్రొడ్యూసర్ వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి ప్రొడక్షన్ సాయిశివాని సమర్పణలో వారాహి చలన చిత్రం బ్యానర్ పై రజనీ కొర్రపాటి నిర్మాతగా ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా పోస్ట ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. ఇందులో భాగంగా డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంటుంది. త‌న క్యారెక్ట‌ర్‌కు సంబంధించి అన్నీ విష‌యాల్లో నిబ‌ద్ధ‌త‌తో వ్య‌వ‌హ‌రించే మోహ‌న్‌లాల్ ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుని ఆయ‌నే స్వ‌యంగా డ‌బ్బింగ్ చెప్ప‌డం విశేషం. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలియ‌జేశారు. కేవ‌లం న‌ట‌న వ‌ర‌కే ప‌రిమితం కాకుండా సినిమాకు సంబంధించిన విష‌యాల్లో త‌న‌కున్న డేడికేష‌న్‌ను మోహ‌న్‌లాల్ మరోసారి ఇలానిరూపించారు.


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved