12 December
Hyderabad
`అందాల రాక్షసి`లో బాటిల్స్ తో చేసిన హీరోయిన్ ఫేస్ చూసి అందరూ అవాక్కయ్యారు. ఎవరా? ఇంత బాగా చేసింది అని అన్నారు. `సాహసం`లో వచ్చే పలు సన్నివేశాల్లో పనితీరును సీజీ వర్క్ అనుకున్నారు. అయితే అదంతా మేనువలే. `రంగస్థలం`లో ఇళ్లు చూసిన తర్వాత అవన్నీ నిజంగానే ఉన్నాయేమోనని చాలా మంది భ్రమపడ్డారు. సుకుమార్ మీడియా ముందుకొచ్చి అవన్నీ సెట్సే నని చెప్పేవరకు ఎవరికీ తెలియదు. తాజాగా `అతరిక్షం` చూసిన వారికి మాత్రం మొదటి నుంచీ మోనిక - రామకృష్ణ చేసిన పని తెలుస్తూనే ఉంది. వారి కృషిని ఇప్పుడు తెలుగుతో పాటు పలు ఇండస్ట్రీలు గుర్తిస్తున్నాయి. ఈ అంశాల గురించి మోనిక - రామకృష్ణ విలేకరులతో బుధవారం మాట్లాడారు. ఆ విశేషాలు...
* `అంతరిక్షం` గురించి చెప్పండి?
- చాలా ఎంజాయ్ చేసి చేసిన సినిమా ఇది. చాలెంజింగ్‌గా ఉంటుంది. తెలుగులో ఇప్పటిదాకా ఇలాంటి సబ్జెక్ట్ తో సినిమా రాలేదు. సంకల్ప్ స్ఓటరీ బోర్డు వేసి చెప్పారు. ప్రీ ప్లాన్డ్ స్టోరీ అది. ఈ సబ్జెక్ట్ ఇన్ఫినిటీ సబ్జెక్ట్. ఎవరు ఎంత చేస్తే అంత అవుతుంది. మొత్తం మేం వేసిన సెట్స్ లోనే చిత్రీకరించారు. స్పేస్ షిప్స్ కోసం ఎంతో చదివి రీసెర్చి చేసి, తెరకెక్కించాం.
* ఇలాంటి సబ్జెక్ట్ మీ దగ్గరికి రాగానే ఏమనిపించింది?
- కొత్తగా చేసే ప్రతి పనినీ మేం ఆస్వాదిస్తాం. ఎన్నో రోజులుఏ మేం నిద్రపోకుండా పనిచేశాం. అంతేగానీ ఎక్కడా సినిమాటిక్ రెఫరెన్స్ లు ఏమీ తీసుకోలేదు.
* మీరు `యన్.టి.ఆర్`లోనూ చేసినట్టున్నారు.?
- ఒక షెడ్యూల్ చేశాం. ఆ తర్వాత దర్శకుడు మారారు. కాస్త డిలే అయింది. మా కాల్షీట్లు మారాయి. అందువల్ల ఇప్పుడు చేయడం లేదు.
* ఒకేసారి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తారా?
- ఒకేసారి రెండు ప్రాజెక్టులను మించి చేయడం లేదు.
* మీరు ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో మీరు శాటిస్ పై అయిన వర్క్?...
- నిజమైన టెక్నీషియన్ కి శాటిస్‌ఫై ఎండ్ ఉండదు.
* అవార్డులను ఎలా తీసుకుంటారు?
- తప్పకుండా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ సినిమా చూసి ఎవరైనా ఒక్క మాట `బావుంది` అని అంటే అదే పదివేలు.
* చిన్న సినిమాలకు పనిచేస్తారా?
- నో బడ్జెట్ సినిమాలకు కూడా పనిచేశాం. కాబట్టి ఏదయినా మాకు ఫర్వాలేదు.
* మిగిలిన సినిమాల సంగతేంటి?
- మైత్రీ మూవీస్‌లో ఓ సినిమా, హిరణ్య, మాధవన్ చిత్రం, సుకుమార్ సినిమా చేస్తున్నాం.