pizza

Mowgli 2025 shoot begins
రోషన్ కనకాల, సందీప్ రాజ్, టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మోగ్లీ 2025 షూటింగ్ ప్రారంభం, ఇంట్రస్టింగ్ వీడియో రిలీజ్ చేసిన టెక్నికల్ టీం

You are at idlebrain.com > news today >

14 February 2025
Hyderabad

తన తొలి చిత్రం 'కలర్ ఫోటో'తో జాతీయ అవార్డు గెలుచుకున్న యంగెస్ట్ డైరెక్టర్ సందీప్ రాజ్, తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ మోగ్లీ 2025 తో మరో ఎమోషనల్ పవర్ ఫుల్ నెరేటివ్ ని తెరపైకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. తన తొలి చిత్రం బబుల్‌గమ్‌లో ఇంటెన్స్ యాక్షన్ కు ప్రశంసలు అందుకున్న రోషన్ కనకాల తన వెర్సటాలిటీ ప్రజెంట్ చేసే పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విజనరీ ప్రొడ్యూసర్ టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న మోగ్లీ 2025 అద్భుతమైన ఫారెస్ట్ నేపథ్యంలో జరిగే సమకాలీన ప్రేమకథ. సాక్షి సాగర్ మడోల్కర్‌ను కథానాయికగా పరిచయం అవుతోంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. అదే విషయాన్ని ఆసక్తికరమైన గన్ మేకింగ్ వీడియో ద్వారా అనౌన్స్ చేశారు.

అడవిలోని ప్రశాంతమైన డెప్త్స్ లో దర్శకుడు సందీప్ రాజ్ ఒక టెంట్ లోపల కూర్చుని, జాగ్రత్తగా తుపాకీని సిద్ధం చేస్తున్నాడు. అన్నీ సరిగ్గా అమర్చిన తర్వాత, అతను దానిని సాక్షికి అప్పగిస్తాడు, ఆమె సంకల్పం స్పష్టంగా కనిపిస్తుంది. రోషన్ అడుగుపెట్టి ఆమెతో కలిసి తమ లక్ష్యాన్ని గురి చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా సీన్ మారుతుంది. వారు కలిసి చేతులను స్థిరంగా ఉంచుకుంటూ, కాల్పులు జరుపుతారు. షాట్ మోగుతుండగా, స్క్రీన్ లో అందరికీ హ్యాపీ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు అని రావడం చాలా ఇంట్రస్టింగ్ గా వుంది.

వీడియో ఎనర్జీతో ప్రారంభమవుతుంది, థ్రిల్లింగ్ ఎడ్వంచర్ ఫీలింగ్, లోతైన ప్రేమ అంతర్లీన భావనతో టోన్ ని సెట్ చేస్తుంది. తుపాకీ తయారీ క్రమం సినిమా విస్తృత కథాంశంతో ముడిపడి ఉన్న లేయర్ ని యాడ్ చేసింది.

నిర్మాత విశ్వ ప్రసాద్, దర్శకుడు సందీప్ రాజ్ ఈ వీడియోకు ఫ్రెష్, డైనమిక్ ఎనర్జీ జోడించారు, ఉత్తేజకరమైన, మోడరన్ సినిమా అనుభవాన్ని హామీ ఇస్తున్నారు. రోషన్ ఆకట్టుకునే ప్రజెన్స్ కట్టిపదేసింది. కాల భైరవ ఉత్తేజకరమైన నేపథ్య సంగీతం విజువల్స్ ఇంటన్సిటీని పెంచుతుంది.

స్క్రిప్ట్ రాయడానికి ఎనిమిది నెలలు, ప్రీ-ప్రొడక్షన్ దశకు ఏడు నెలలు పట్టిందని మేకర్స్ షేర్ చేశారు. వారు ఆరుగురు వినూత్న సాంకేతిక నిపుణులను కూడా పరిచయం చేశారు. ఈ చిత్రానికి రామ మారుతి. ఎం. సినిమాటోగ్రఫీ, కాల భైరవ సంగీతం, కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్, కిరణ్ మామిడి ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ను పర్యవేక్షిస్తున్నారు, నటరాజ్ మాదిగొండ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. రామ మారుతి ఎం. రాధాకృష్ణ రెడ్డి సహ రచయితలుగా ఉన్నారు.

ప్రతిభావంతులైన తారాగణం, సాంకేతిక బృందంతో చిత్రీకరణ ప్రారంభించిన మోగ్లీ 2025 సినీ ప్రేక్షకులకు ఒక గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది.

మోగ్లీ 2025 ఈ సంవత్సరం చివర్లో విడుదల కానుంది.

తారాగణం: రోషన్ కనకాల, సాక్షి సాగర్ మడోల్కర్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: సందీప్ రాజ్
నిర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిబొట్ల
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సంగీతం: కాల భైరవ
డిఓపి: రామ మారుతి ఎం
ఎడిటర్: కోదాటి పవన్ కళ్యాణ్
ఆర్ట్: కిరణ్ మామిడి
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సుజిత్ కుమార్ కొల్లి
చీఫ్ కోఆర్డినేటర్: మేఘస్యం
యాక్షన్: నటరాజ్ మాడిగొండ
సహ రచయితలు: రామ మారుతి. ఎం & రాధాకృష్ణ రెడ్డి

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved