pizza

Jr NTR' Launched Mowgli Teaser
యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంచ్ చేసిన రోషన్ కనకాల, సాక్షి మదోల్కర్, సందీప్ రాజ్, టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 'మోగ్లీ 2025' ఎపిక్ లవ్ & వార్ టీజర్‌

You are at idlebrain.com > news today >

12 November 2025
Hyderabad

బబుల్గమ్ తో సక్సెస్ ఫుల్ డెబ్యు చేసిన యంగ్ హీరో రోషన్ కనకాల తన సెకండ్ మూవీ 'మోగ్లీ 2025' తో వస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత, కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన మోగ్లీ 2025 అడవి నేపథ్యంలో యూనిక్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా. ఈ సినిమా గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఫస్ట్ సింగిల్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ రోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ టీజర్‌ను లాంచ్ చేశారు. టీజర్ ప్రాజెక్ట్ పై బజ్‌ను మరింత పెంచింది.

హాయిగా సంతోషంగా జీవితాన్ని గడపాలనుకునే యువకుడు మోగ్లీ. ఓ అందమైన అమ్మాయిని ప్రేమించిన తర్వాత అతని ప్రపంచం ఒక మలుపు తిరుగుతుంది. రామ–సీతల ప్రేమకథలా వీరిద్దరి ప్రేమ కూడా అందంగా ఉంటుంది. వీరి సంతోషంలో రాక్షసుడు లాంటి పోలీస్ ఆఫీసర్ ఎంటరౌతాడు. దీంతో అంతా యుద్ధ భూమిగా మారుతుంది

దర్శకుడు సందీప్ రాజ్ టీజర్‌ను అద్భుతంగా కట్ చేశారు. రామ–సీత లాగా హీరో–హీరోయిన్లను, రావణుడిలా విలన్‌ను చూపుతూ ఆధునిక రామాయణలా ప్రజెంట్ చేశారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ మైథాలజీ ఫీల్ మోడరన్ ఎమోషన్ తో మిళితం చేస్తుంది.

రోషన్ కనకాలఅద్భుతంగా కనిపించాడు. తన పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుని, కొత్త లుక్‌తో, ఎమోషనల్ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చాడు. ఉత్తరాంధ్ర యాసలో చెప్పిన డైలాగులు సహజంగా ఆకట్టుకున్నాయి. అతనికి జోడీగా నటించిన సాక్షి మదోల్కర్ చెవిటి–మూగ అమ్మాయి సహజంగా నటించింది. ఇద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకుల మనసు తాకింది. విలన్‌గా బండి సరోజ్ కుమార్ ఇంటెన్స్ గా కనిపించగా, హీరో స్నేహితుడిగా వైవా హర్ష తన కూల్ హ్యుమర్ తో అలరించాడు.

స్ట్రాంగ్ కాన్సెప్ట్, అద్భుతమైన విజువల్స్‌తో వచ్చిన ‘మోగ్లీ 2025’ టీజర్‌ సినిమా పై అంచనాలను మరింత పెంచింది. ఈ చిత్రం డిసెంబర్ 12న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది.

తారాగణం: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్, బండి సరోజ్ కుమార్, హర్ష చెముడు

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: సందీప్ రాజ్
నిర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సంగీతం: కాల భైరవ
డిఓపి: రామ మారుతి ఎం
ఎడిటర్: కోదాటి పవన్ కళ్యాణ్
ఆర్ట్: కిరణ్ మామిడి
యాక్షన్: నటరాజ్ మాడిగొండ
సహ రచయితలు: రామ మారుతి. ఎం & రాధాకృష్ణ రెడ్డి



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved