Roshan Kanakala, Sandeep Raj, TG Vishwa Prasad, People Media Factory’s Mowgli 2025 Launched Grandly
రోషన్ కనకాల, సందీప్ రాజ్, TG విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మోగ్లీ 2025 గ్రాండ్ గా లాంచ్
Sandeep Raj, recognized as the youngest director to win a national award for his debut film Colour Photo, promises another emotionally rich story, similar in depth to Colour Photo. The film titled Mowgli 2025 features Roshan Kanakala who made his mark with his charming performances and graceful dance moves, playing a distinct role. Visionary producer TG Vishwa Prasad of People Media Factory will produce this contemporary love story set in a forest backdrop. Debutante Sakshi Sagar Mhadolkar is the female lead finalized for the movie.
The movie Mowgli 2025 had a grand launch today with a traditional pooja ceremony. Sandeep Reddy Vanga marked the occasion by sounding the clapboard for the muhurtham shot on Roshan Kanakala and Sakshi Sagar Mhadolkar, while Dasara director Srikanth Odela switched on the camera. Producer TG Vishwa Prasad handed the script to the director. The makers are set to begin the regular shoot next month.
The first look poster that presented Roshan Kanakala in a charming appearance received positive feedback. The title Mowgli 2025 also garnered superb response.
Mowgli 2025 is backed by a skilled technical team. The music will be composed by Kaala Bhairava, renowned for his successful soundtrack in Colour Photo. Cinematography will be led by Rama Maruti M, who has worked as the chief associate cinematographer on major blockbusters like Baahubali 1 & 2 and RRR. The editing will be handled by Pavankalyan, known for his exceptional work in films such as Colour Photo, Major, and the upcoming Goodachari 2.
Mowgli 2025 is planned for release in the summer, 2025.
Cast: Roshan Kanakala, Sakshi Sagar Mhadolkar
Technical Crew:
Writer & Director: Sandeep Raj
Producer: TG Vishwa Prasad
Banner: People Media Factory
Music: Kaala Bhairava
DoP: Rama Maruti M
Editor: Pavankalyan
రోషన్ కనకాల, సందీప్ రాజ్, TG విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మోగ్లీ 2025 గ్రాండ్ గా లాంచ్
తన తొలి చిత్రం కలర్ ఫోటోతో జాతీయ అవార్డును గెలుచుకుని యంగెస్ట్ దర్శకుడిగా గుర్తింపు పొందిన సందీప్ రాజ్ మరో ఎమోషనల్ రిచ్ స్టోరీతో రాబోతున్నారు. మోగ్లీ 2025 టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో తన చార్మ్ అండ్ డ్యాన్స్ మూవ్స్ తో అలరించిన రోషన్ కనకాల హీరోగా నటిస్తున్నారు. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కాంటెంపరరీ లవ్ స్టోరీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విజనరీ ప్రొడ్యూసర్ TG విశ్వ ప్రసాద్ నిర్మించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా డెబ్యుటెంట్ సాక్షి సాగర్ మదోల్కర్ నటిస్తున్నారు.
మోగ్లీ 2025 మూవీ పూజా కార్యక్రమాలతో ఈరోజు గ్రాండ్ లాంచ్ అయింది. రోషన్ కనకాల, సాక్షి సాగర్ మదోల్కర్‌లపై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి సందీప్ రెడ్డి వంగా క్లాప్ ఇచ్చారు, దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కెమెరా స్విచాన్ చేశారు. నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందజేశారు. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
రోషన్ కనకాల ఛార్మింగ్ గా కనిపించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. మోగ్లీ 2025 టైటిల్‌కు కూడా అద్భుతమైన స్పందన వచ్చింది.
మోగ్లీ 2025కి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. కలర్ ఫోటో కు సక్సెస్ ఫుల్ సౌండ్‌ట్రాక్స్ అందించిన కాల భైరవ సంగీతం సమకూర్చనున్నారు. బాహుబలి 1 & 2, RRR వంటి భారీ బ్లాక్బస్టర్లలో చీఫ్ అసోసియేట్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన రామ మారుతి ఎమ్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. కలర్ ఫోటో, మేజర్, అప్ కమింగ్ గూడాచారి 2 చిత్రాలకు పని చేసిన పవన్ కళ్యాణ్ ఎడిటర్.
మోగ్లీ 2025 చిత్రాన్ని 2025 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తారాగణం: రోషన్ కనకాల, సాక్షి సాగర్ మడోల్కర్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: సందీప్ రాజ్
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సంగీతం: కాల భైరవ
డిఓపి: రామ మారుతి ఎం
ఎడిటర్: పవన్ కళ్యాణ్