pizza

Reba Monica John as IPS Seetha Parasuram in Sree Vishnu and Hussain Sha Kiran's Investigative Thriller "Mrithyunjay"; Releasing worldwide on FEBRUARY 27th
శ్రీవిష్ణు, హుస్సేన్ షా కిర‌ణ్ కాంబోలో రూపొందుతోన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘మృత్యుంజ‌య్‌’లో ఐపీఎస్ సీతా ప‌రుశురామ్‌గా రేబా మోనికా జాన్‌.. ఫిబ్ర‌వ‌రి 27న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అవుతోన్న చిత్రం

You are at idlebrain.com > news today >

7 February 2026
Hyderabad

The King of Entertainment Sree Vishnu, is currently bringing an investigative thriller titled "Mrithyunjay" directed by Hussain Sha Kiran. The film is produced by Sandeep Gunnam and Vinay Chilakapati under the banners of Lightbox Media and Picture Perfect Entertainment. Ramya Gunnam presenting the film.

The blockbuster Samajavaragamana duo is all set to share the screen once again. Reba Monica John is playing the female lead in Mrithyunjay. Today, the makers dropped her first-look poster, which has raised curiosity about her role. In the striking poster, Reba is seen as a police officer, IPS Seetha Parasuram.

Reba John’s intriguing look is getting a solid response. The youth heartthrob, who bowled over Telugu audiences with her beauty and acting, takes on this interesting role. Everyone is eager to witness her performance and the kind of thrills she brings to this investigative thriller.

Mrithyunjay is hitting the big screens on February 27, 2026. With proper promotions and exciting content, Mrithyunjay is all set to impress the audience. This Sree Vishnu-styled thriller promises another intriguing entertainer. The cinematography is managed by Vidhya Sagar, Kaala Bhairava is composing the music, Sreekar Prasad is in charge of editing, and Manisha A. Dutt overseas production design.

శ్రీవిష్ణు, హుస్సేన్ షా కిర‌ణ్ కాంబోలో రూపొందుతోన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘మృత్యుంజ‌య్‌’లో ఐపీఎస్ సీతా ప‌రుశురామ్‌గా రేబా మోనికా జాన్‌.. ఫిబ్ర‌వ‌రి 27న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అవుతోన్న చిత్రం

కింగ్ ఆఫ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ శ్రీవిష్ణు లేటెస్ట్ మూవీ ‘మృత్యుంజయ్’. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ హుస్సేన్ షా కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోంది. ర‌మ్య గున్నం స‌మ‌ర్ప‌ణ‌లో లైట్‌బాక్స్ మీడియా, పిక్చర్ పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘సామజవరగమన’ మూవీ తర్వాత శ్రీవిష్ణు, రేబా మోనికా జాన్ జంటగా నటిస్తున్నారు. శ‌నివారం రోజు మేక‌ర్స్ ఈ సినిమాలో రేబా మోనికా జాన్ పోషిస్తోన్న ఐపీఎస్ సీతా ప‌రుశురామ్ పాత్ర‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇది సినిమాపై మ‌రింత క్యూరియాసిటీని పెంచేలా క‌నిపిస్తోంది.

అందం, అభిన‌యంతో కుర్ర‌కారు హృద‌యాల‌ను దోచుకున్న ముద్దుగుమ్మ రేబా జాన్ మృత్యుంజ‌య్ చిత్రంలో మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ఆమె పాత్ర‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌లో ఆమె త‌న‌దైన న‌ట‌న‌తో ఎలాంటి థ్రిల్స్ ఇవ్వ‌నుందోన‌ని అంద‌రూ ఎదురు చూస్తున్నారు.

మృత్యుంజయ్ చిత్రం ఫిబ్రవరి 27న‌ థియేటర్లలో సందడి చేయబోతోంది. డిఫ‌రెంట్ ప్ర‌మోష‌న్స్‌, ఇంట్రెస్టింగ్ కంటెంట్‌తో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. శ్రీవిష్ణు స్టైల్‌కు తగ్గట్టుగా రూపొందిన ఈ థ్రిల్లర్, మరో ఉత్కంఠతను రేపే ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా వర్క్ చేస్తున్న ఈ చిత్రానికి విద్యాసాగ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌గా కాల భైర‌వ సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు. మ‌నీషా ఎ.ద‌త్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved