pizza

Baba Sehgal's powerful anthem from Mr. Work From Home released
'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' నుంచి బాబా సెహగల్ పాడిన పవర్ ఫుల్ యాంథమ్ సాంగ్ రిలీజ్

You are at idlebrain.com > news today >

24 January 2026
Hyderabad

త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, అనీష్ కురువిల్లా ప్రధాన పాత్రల్లో చేస్తున్న హోల్సమ్ ఎంటర్టైనర్ 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్'. మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించారు.

CH.V.S.N బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అరవింద్ మండెం నిర్మించారు. అరుణ్ చిలువేరు, ప్రకాష్ చెరుకూరి సంగీతం సమకూర్చారు. ఈ సినిమా టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా మేకర్స్ ఈ సినిమా యాంధమ్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో కృష్ణుడు వ్యవసాయం చేస్తున్నట్లుగా చూపించిన విధానం మరింత ఆసక్తిని రేకిస్తుంది .ప్రకాశ్ చెరుకూరి అందించిన మ్యూజిక్ సాంగ్‌కు ప్రాణం పోసింది.

బాబా సెహగల్ వాయిస్ యూత్‌ను వెంటనే అట్రాక్ట్ చేసే ఎనర్జీతో పాటకు మాస్ అప్పీల్ తీసుకొచ్చింది.

అర్వింద్ మండెం రాసిన లిరిక్స్ పవర్ ఫుల్ గా వున్నాయి. వ్యవసాయం ప్రాముఖ్యతను మట్టి వాసనతో పాటు ఆధునిక టెక్నాలజీ టచ్ కలిపి పవర్‌ఫుల్‌గా ప్రజెంట్ చేయడంలో ఆయన లిరిక్స్ కీలక పాత్ర పోషించాయి.

ఈ పాట యూత్‌తో పాటు ప్రతి వర్గం ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా నిలిచింది.

ఈ చిత్రానికి రవికుమార్ డీవోపీ, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు.

త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.

నటీనటులు: త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ & అనీష్ కురువిల్లా, శివాజీరాజా, హర్ష వర్ధన్, సత్య కృష్ణన్, హర్ష చెముడు, నెల్లూరు సుదర్శన్, సివిఎల్ నర్సింహారావు, గుండు సుదర్శన్, వేణు యెల్దండి, సప్తగిరి, గిరిధర్, సరయు, సత్తిపండు

దర్శకత్వం: మధుదీప్ చెలికాని
నిర్మాత: అరవింద్ మండెం
సమర్పణ: CH.V.S.N బాబ్జీ
బ్యానర్ : లోటస్ క్రియేటివ్ వర్క్స్
స్క్రిప్ట్ కోఆర్డినేటర్: పవన్ కొడాలి
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: రవికుమార్ వి.
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం: ప్రకాష్ చెరుకూరి
సౌండ్ డిజైనర్: సంతోష్ వొదనల
యాక్షన్ కొరియోగ్రఫీ: రామ్ సుంకర

PRO: తేజస్వి సజ్జా

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved