pizza

Mr. Work From Home trailer released
మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్- థియేటర్ వైపు లాక్కెళ్లే ట్రైలర్

You are at idlebrain.com > news today >

7 February 2026
Hyderabad

కథలో కొత్తదనం, ట్రీట్‌మెంట్‌లో ఫ్రెష్‌నెస్ ఉంటే చిన్న సినిమాలు కూడా అద్భుతాలు చేస్తున్నాయి. అలా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ముందుకొస్తున్న సినిమా మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్.

టైటిల్ వినగానే కార్పొరేట్ సెటప్ అనిపిస్తుంది. కానీ ఇక్కడే ట్విస్ట్! ఈ ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ కథ నగరాల గోడల మధ్య కాదు… పచ్చని పొలాల మధ్య నడుస్తుంది. కార్పొరేట్ లైఫ్ నుంచి అగ్రికల్చర్ వైపు హీరో జర్నీనే ఈ సినిమాకు బ్యాక్‌బోన్.

త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ జంటగా కనిపిస్తున్న ఈ చిత్రాన్ని మధుదీప్ చెలికాని డైరెక్ట్ చేయగా, అరవింద్ మండెం నిర్మించారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌లో అగ్రికల్చర్ థీమ్‌ను క్లియర్‌గా ఎస్టాబ్లిష్ చేయడం, బాబా సెహగల్ పాటకు వచ్చిన రెస్పాన్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి.

ఇప్పుడు వచ్చిన ట్రైలర్ ఆ ఆసక్తిని ఇంకొంచెం పెంచింది. లైట్ హార్టెడ్ కామెడీ, యూత్‌ఫుల్ లవ్ స్టోరీ రెండూ కలిసిన ఈ ట్రైలర్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ స్పష్టంగా కనిపిస్తుంది. త్రిగుణ్ – పాయల్ మధ్య కెమిస్ట్రీ చాలా నేచురల్‌గా, స్క్రీన్‌పై హాయిగా ఫీలయ్యేలా ఉంది.

నెల్లూరు సుదర్శన్, హర్ష చెముడు, గుండు సుదర్శన్ కామెడీ టైమింగ్ ట్రైలర్‌కు మంచి ప్లస్. డైలాగ్స్, సిట్యుయేషన్స్ రెండూ కలిసొచ్చినట్టు అనిపిస్తున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ మెంటాలిటీ vs అగ్రికల్చర్ లైఫ్ అనే కాన్ఫ్లిక్ట్‌ని డైరెక్టర్ కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేయడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.

ఈ కథలో ప్రేమ కూడా ఉంది… కానీ అది సాధారణ ప్రేమ కాదు. అబ్బాయి–అమ్మాయి నిజాయితీగా ప్రేమించుకుంటే ఎంత వినోదాత్మకంగా ఉంటుందో ఈ సినిమాలో చూపించబోతున్నారు.

మొత్తానికి, ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ ట్రైలర్ సినిమా థియేటర్లో చూడాలని ఆసక్తిని కలిగించింది. త్వరలోనే ప్రేక్షకులకు ముందుకు రానున్న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ వర్క్ ఫ్రమ్ హోమ్… థియేటర్లలో ఎలా వర్క్ అవుట్ అవుతుందో చూడాలి!

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved