`
pizza

Miss Shetty Mr Polishetty’s Peppy First Song ‘No No No’ is out now
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల

You are at idlebrain.com > news today >
Follow Us

22 March 2022
Hyderabad

Miss Shetty Mr Polishetty is a comedy entertainer featuring Naveen Polishetty and Anushka Shetty in the lead roles. The promotions have started off now with the first song’s arrival - No No No.

The song has a funky vibe and it exudes energy.

The song is crooned by MM Manasi and has a catchy composition of Radhan. The lyrical video is also easy to the eye.

The good tune and the catchy rap portion in the middle is also good to the ear. The song has a good vibe.

The film is directed by Mahesh Babu P and produced by Vamsi, Pramod, and Vikram under UV Creations banner. More promotional material will be out soon.

Composed , Arranged & Rhythm programmed by Radhan
Lyricist : Ananth Sriram
Singer : M.M.Manasi
Rap Performed by : Lady Kash

Banner : UV Creations
Producers Vamsi- Pramod - Vikram
Written & Directed by Mahesh Babu P
Dop - Nirav Shah
Choreographer - Raju Sundaram
Production Designer - Rajeevan
Vfx supervisor - Raghav Tammareddy

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల

అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’.పి మహేష్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ రూపొందించింది. ఉగాది పండగ సందర్భంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ నువిడుదల చేశారు. రధన్ సంగీత అందించిన ఈ గీతాన్ని అనంత్ శ్రీరామ్ రాయగా.. ఎమ్ఎమ్ మానసి ఆలపించారు. ‘పుత్తడి బొమ్మ కోవెల కొమ్మ.. పెద్ద అడుగే వేసిందే.. పద్ధతులన్నీ సంకెళలంటూ తెంచుకుంటూ నడిచిందే.. సన్నాయే వద్దంటా.. మంత్రాలొద్దంటా..పేరంటాలే పడదంటా..’ అంటూ సాగే ఈ గీతం హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ను తెలియజేసేలా ఉంది. స్నేహం, మోహం, బంధం, అనుబంధం ఏవీ వద్దనుకునేలాంటి పాత్రలో అనుష్కశెట్టి నటిస్తోందని ఈ పాట చూస్తే అర్థం అవుతోంది. అటు రధన్ అందించిన ట్యూన్ కూడా చాలా క్యాచీగా వినగానే ఆకట్టుకునేలా ఉంది. ఆ ట్యూన్ అంతే అందంగా పాడింది ఎమ్ఎమ్ మానసి. పాటను బట్టి చూస్తే హీరోయిన్ పై సాగే మాంటేజ్ సాంగ్ అని తెలుస్తోంది.

ఇక ఈ వేసవి బరిలో తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ భాషల్లో విడుదల కాబోతోన్న ఈ మూవీ ప్రమోషన్స్ ను ఈ పాట ఓ కొత్త ఊపుతో మొదలుపెట్టింది. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ప్రమోషన్స్ లో దూకుడు పెంచబోతున్నారు. భాగమతి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత యూవీ క్రియేషన్స్ లో అనుష్క శెట్టి నటించిన సినిమాగానూ.. స్వీటీ గ్యాప్ తర్వాత నటించిన చిత్రం కావడంతో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిపై మంచి అంచనాలే ఉన్నాయి.

ఇక ఓ మంచి పాటతో మెప్పించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిలోని ఈ గీతాన్ని కంపోజ్ చేసింది : రధన్, లిరిక్స్ : అనంత శ్రీరామ్, సింగర్ : ఎమ్ఎమ్ మానసి, ర్యాప్ పర్ఫార్మెన్స్ : లేడీ కాష్.
బ్యానర్ : యూవీ క్రియేషన్స్
ప్రొడక్షన్ డిజైనర్ : రాజవీన్,
విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ : రాఘవ్ తమ్మారెడ్డి
సంగీతం : రధన్
సినిమాటోగ్రఫీ : నీరవ్ షా
నిర్మాతలు : వంశీ - ప్రమోద్ - విక్రమ్
రచన, దర్శకత్వం : పి. మహేష్ కుమార్.

 

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved