6 September 2024
Hyderabad
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరద సహాయక కార్యక్రమాల కోసం రూ. 50లక్షల డొనేషన్ అందిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్
గడిచిన వారం రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఆపద సమయంలో ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలకు మా వంతు సాయంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధులకు రూ.50లక్షలు(చెరొక 25 లక్షలు) విరాళంగా ఇస్తున్నాం.
ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి తెలుగు రాష్ట్రాలు త్వరగా కోలుకోవాలని, బాధిత ప్రజలు తమ జీవితాల్లో సాధారణ స్థితికి రావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం.
నవీన్ యెర్నేని
రవిశంకర్ యలమంచిలి
|