విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ విజువల్ వండర్ 'నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్'. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జూలై 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. నిర్మాత సురేష్ బాబు ఈ వేడుకకు ముఖ్య అతిథి గా హాజరయ్యారు.
ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ హీరో విరాట్ కర్ణ మాట్లాడుతూ...అందరికీ నమస్కారం. నటుడిగా మీ అందరి గుండెల్లో స్థానం సంపాదించుకోవడానికి ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశాను. సినిమా చూస్తే నేను ఎంత హార్డ్‌వర్క్ చేశానో మీకు అర్థమవుతుంది. మీ గుండెల్లో చోటు సంపాదించుకోవడానికి ఏం చేయాలో 100 శాతం ఈ సినిమాకు చేశాను. నాకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చిన అభిషేక్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఆయన అద్భుతంగా ఈ సినిమాను తీశారు. ఆయన ఈ కథ చెప్పినప్పుడు, కంటెంట్ చూపించినప్పుడు నేను షాక్ అయ్యాను. ఈ సినిమాలో ప్రతిదీ ఒక అద్భుతంలా కనిపిస్తుంది. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఇందులో మీరు చూస్తారు. మా నిర్మాతలు కిషోర్ గారు, నిశిత గారు సినిమాను అద్భుతంగా నిర్మించారు. అనంత పద్మనాభస్వామి రథయాత్ర ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందో మీరందరూ చూస్తున్నారు. అందరూ కూడా మా ప్రాంతానికి తీసుకురావాలని అడుగుతున్నారు. ఇంత పెద్ద స్థాయిలో పబ్లిసిటీ జరగడానికి ప్రధాన కారణం మా నిర్మాతలు, ముఖ్యంగా నిశిత గారు. ఆమె లేకపోతే ఈ సినిమాకు ఇంత పబ్లిసిటీ వచ్చేదని నేను అనుకోను. ఇలాంటి నిర్మాతలకు ప్రేక్షకులు సపోర్ట్ చేస్తే మరిన్ని అద్భుతమైన సినిమాలు వస్తాయి. మా డీవోపీ ప్రతి డీటెయిల్‌ను అద్భుతంగా చిత్రీకరించారు. ఆయనకు హ్యాట్సాఫ్. ప్రణవ్ సినిమాను అద్భుతంగా కట్ చేశాడు. తనకు ఎప్పుడూ సినిమా గురించే ఆలోచన. ఎంతో ఎనర్జీతో పనిచేశాడు.మరోసారి మా నిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా దర్శకుడు అభిషేక్ గారు నన్ను ఒక ఆణిముత్యంలా తీర్చిదిద్దారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇది కేవలం ఒక సినిమా కాదు... ఒక ఎక్స్ పీరియన్స్. మన భారతీయ సంస్కృతిని, వారసత్వాన్ని సెలబ్రేట్ చేసుకునే సినిమా. జూలై 3న అందరం థియేటర్లలో కలుద్దాం. అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా టీజర్, ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. మా నిర్మాతలు పెట్టిన ప్రతి రూపాయి వారికి తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు పెద్ద సెట్ వేసినప్పుడు అభిషేక్ నాకు ఫోన్ చేసి వచ్చి చూడమని చెప్పేవారు. తను అద్భుతంగా ఈ సినిమాను తీశాడు. అలాగే ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కూడా చాలా చక్కని వర్క్ ఇచ్చారు. అశోక్ నాకు 'ఇంద్రుడు చంద్రుడు', 'కలిసుందాం రా' సినిమాలప్పటి నుంచి పరిచయం. తను ఈ సినిమాకి అద్భుతమైన వర్క్ ఇచ్చాడు. ఇది చాలా కాస్ట్లీగా తీసిన సినిమా. నేను రషెస్ చూశాను. అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు చేశారు. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.
దర్శకుడు అభిషేక్ నామా మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. ఈ సినిమాను మా నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా చాలా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. వారు పెట్టిన డబ్బు పదిరెట్లు తిరిగి రావాలని కోరుకుంటున్నాను. ఇలాంటి కొత్త టాలెంట్‌ను ప్రేక్షకులు ప్రోత్సహించాలి. ఈ సినిమా సక్సెస్ అయితే ఇలాంటి మరెన్నో గొప్ప సినిమాలు వస్తాయి. అందరూ ఈ సినిమాను థియేటర్‌కు వచ్చి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నేను, మా డీవోపీ గారు, అలాగే ఆర్ట్ డైరెక్టర్ గారు అనంత పద్మనాభస్వామి వారి ఆలయానికి వెళ్లాము. అక్కడ ఫొటోలు తీసేందుకు అనుమతి లేదు. అందుకే మేము ఆ ఆలయాన్ని ప్రత్యక్షంగా చూసి, పేపర్‌పై స్కెచ్‌లు గీసుకుని, అదే ఆధారంగా ఆ సెట్‌ను నిర్మించాము. మన సంస్కృతి, మన మూలాలు, సనాతన ధర్మానికి సంబంధించిన ఒక గొప్ప సందేశం కూడా ఈ సినిమాలో ఉంటుంది. అది చాలా గొప్పగా వచ్చింది. ప్రేక్షకులు కచ్చితంగా ఒక అద్భుతమైన సినిమాను, గొప్ప అనుభూతిని ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నారు.
హీరోయిన్ నభా నటేష్ మాట్లాడుతూ... ఇంత అద్భుతమైన సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. అభిషేక్ గారు ఈ సినిమాను ఒక మ్యాజికల్ అనుభూతిలా తీర్చిదిద్దారు. మా నిర్మాతలు కిషోర్ గారు, నిశిత గారు అద్భుతమైన వ్యక్తులు. ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇలాంటి సినిమాలు ప్రేక్షకులు థియేటర్లలోనే చూడాలి. మా టీమ్‌లో పనిచేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ సో మచ్. జూలై 3న తప్పకుండా అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను.
నిర్మాత కిషోర్ మాట్లాడుతూ... రూ.110 కోట్లకు పైగా పెట్టి తీసిన సినిమా ఇది. ఈ రోజుల్లో సినిమాకి మూడు రోజులే లైఫ్. ఆ మూడు రోజుల్లో ఏదైనా జరగొచ్చు. అందుకే కొద్ది రోజులుగా కొంచెం టెన్షన్ పడ్డాను. అయితే ఫైనల్ మిక్స్ అయిన తర్వాత అభిషేక్ సినిమా చూపించారు. ఇప్పుడు నాకున్న టెన్షన్ అంతా పోయింది. మీరు ఒక విజువల్ వండర్‌ను చూడబోతున్నారు. సినిమా ట్రెమండస్‌గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. ప్రతి 10 నిమిషాలకు ఒక డిఫరెంట్ వరల్డ్‌ను చూస్తారు. ఒక సినిమాలోనే నాలుగైదు విజువల్ వండర్స్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ చాలా సాటిస్ఫై అవుతారు. కచ్చితంగా ఇది ష్యూర్‌షాట్ బ్లాక్‌బస్టర్.
నిర్మాత నిశిత మాట్లాడుతూ... నిర్మాతలుగా ఈ సినిమా మీద మేము పూర్తి కాన్ఫిడెన్స్‌తో ఉన్నాము. ఆ కాన్ఫిడెన్స్‌కు కారణం మేము ఇచ్చిన అవుట్‌పుట్ ఏంటో మాకు తెలుసు. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమాకి దేవుడే మా ఫస్ట్ హీరో. మా డైరెక్టర్ అభిషేక్ గారు సెకండ్ హీరో. స్క్రీన్ మీద మీరు చూసే విరాట్ కర్ణ మరో హీరో. కిషోర్ గారు నాలుగో హీరో. ఆయన ఈ సినిమా కోసం రాత్రింబవళ్లు పనిచేశారు. ఆయన పడిన కష్టాన్ని నేను కళ్లారా చూశాను. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది.
ఆర్ట్ డైరెక్టర్ అశోక్ మాట్లాడుతూ... ఇలాంటి సినిమా చేయడం ఒక ఆర్ట్ డైరెక్టర్‌కు పెద్ద ఛాలెంజ్. ఇలాంటి సినిమాకి ఖర్చు పెట్టే నిర్మాతలు ఉండాలి. అంతటి విజువల్స్‌ను ఊహించే డైరెక్టర్ ఉండాలి. అలాంటి అద్భుతమైన సినిమాలో పని చేసినందుకు చాలా ఆనందంగా ఉంది.
మ్యూజిక్ డైరెక్టర్స్ మాట్లాడుతూ... మమ్మల్ని నమ్మిన అభిషేక్ గారికి థ్యాంక్యూ. అభిషేక్ గారి విషయంలో మేము ఎంతో గర్వపడుతున్నాము. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా ఈ సినిమాను థియేటర్‌లో వచ్చి చూడాలని కోరుకుంటున్నాం. ఈ పాటలు ఇంత అద్భుతంగా రావడానికి కారణం అభిషేక్ గారు. అలాగే కిషోర్ గారికి కూడా ధన్యవాదాలు.
అంకిత్ మాట్లాడుతూ... అభిషేక్ గారు, నిశిత గారు, కిషోర్ గారు చాలా అద్భుతమైన వ్యక్తులు. సినిమాను చాలా గొప్పగా తీశారు. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్స్‌కు వెళ్లినప్పుడు అలా చూస్తూ ఉండిపోయేవాడిని. ఈ సినిమా కోసం ఎక్కడా రాజీ పడకుండా చాలా ఖర్చు పెట్టారు. నాకు ఈ పాత్రలో అవకాశం ఇచ్చిన అభిషేక్ గారికి థ్యాంక్యూ. విరాట్ చాలా ఫేమస్ అవుతున్నారు. చాలా మంచి వ్యక్తి, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఈ సినిమా ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ సినిమా కావాలని కోరుకుంటున్నాను.
శ్రష్టి వర్మ మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. 'నాగబంధం' మన సనాతన ధర్మాన్ని, మన సంస్కృతిని అద్భుతంగా చాటి చెప్పే సినిమా. ఇలాంటి గొప్ప సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన మా దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. ఇందులో నేను చేసిన పాట చాలా అద్భుతంగా వచ్చింది. విరాట్, నభా నటేష్ గారికి, దక్ష గారికి, అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా కోసం అందరూ చాలా కష్టపడ్డారు. 'నాగబంధం'ను తప్పకుండా జూలై 3న థియేటర్లలో చూడాలని కోరుకుంటున్నాను. ఈ వేడుకలో సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు.
Energetic Star Ram Pothineni’s Most Ambitious Project #RAPO23, Produced By Krishna Pothineni On Rapo Cinematics, Grand Launch TomorrowEnergetic Star Ram Pothineni’s Most Ambitious Project #RAPO23, Produced By Krishna Pothineni On Rapo Cinematics, Grand Launch Tomorrow