pizza

Naga Chaitanya Acquires Motorsport Racing Team- Hyderabad Blackbirds (HBB)
హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ (HBB) మోటార్‌స్పోర్ట్ రేసింగ్ టీమ్ ని పొందిన హీరో నాగ చైతన్య

You are at idlebrain.com > news today >
Follow Us

15 September 2023
Hyderabad

Renowned Tollywood actor Akkineni Naga Chaitanya has recently acquired ownership of the esteemed motorsport racing team, Hyderabad Blackbirds (HBB). The team, which has made its mark in the Indian Racing League, is set to participate in the inaugural season of the Formula 4 Indian Championship. This exciting new venture is organized and promoted by Racing Promotions Private Limited (RPPL).

Naga Chaitanya's passion for motorsport can be traced back to his early years, having always been a fervent admirer of Formula 1, supercars, and motorcycles. His deep-rooted interest and enthusiasm for the sport, coupled with the opportunity to contribute to the comprehensive growth of the Indian motorsport domain, were decisive factors in his decision to invest in the racing team.

Naga Chaitanya stated: “Being a part of Motorsport has always been something I’ve looked out to do. It gives me immense happiness in being able to be a part of the Hyderabad Blackbirds team. Personally, I see the Indian Racing League going off to be a prominent name in Indian Motorsport providing great entertainment to all the enthusiasts out there, as well as being a platform for young talents to rise. I’m keenly looking forward to the street races this season which I believe will be a great experience for the viewers. With the awareness of Motorsport growing amongst all age groups, it’s a great time to be a part of it. I'd like to thank Mr. Akhil for making this happen.

In its debut year in the Indian Racing League, Hyderabad Blackbirds clinched notableaccolades. Two prominent drivers from the team, Akhil Rabindra and Neel Jani, achieved acommendable 1-2 finish in the Drivers’ Championship. Meanwhile, as a unit, HBB securedthe second position in the Teams’ Championship. Elevating their ambitions, HyderabadBlackbirds is gearing up to compete in the FIA-certified Formula 4 Indian Championship thisyear, an event that is anticipated to draw budding and aspiring racers globally.

Akhil Reddy, Chairman and Managing Director of RPPL, remarked: “We are excited to have Naga Chaitanya join our vision for motorsport in India. What we are getting is not only a very influential actor but an individual whose passion for motorsport is well known, and more fundamentally an individual who wants to contribute to developing motorsport in India. Hyderabad is a city with a very aspirational and hard core auto-enthusiast audience, and there's no one better than Nag to be the flag bearer. His investment is also a very important step towards showcasing how lucrative the Indian Racing Festival platform is and the potential it holds.”

హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ (HBB) మోటార్‌స్పోర్ట్ రేసింగ్ టీమ్ ని పొందిన హీరో నాగ చైతన్య

ప్రముఖ టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య ఇటీవల ప్రముఖ మోటార్‌స్పోర్ట్ రేసింగ్ టీమ్, హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ (HBB) ఓనర్ షిప్ ని పొందారు. ఇండియన్ రేసింగ్ లీగ్‌లో తనదైన ముద్ర వేసిన ఈ జట్టు ఫార్ములా 4 ఇండియన్ ఛాంపియన్‌షిప్ ప్రారంభ సీజన్‌లో పాల్గొనేందుకు సిద్ధమైంది. ఈ ఎక్సయిటింగ్ కొత్త వెంచర్‌ ని రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (RPPL) నిర్వహించి, ప్రమోషన్స్ చేస్తోంది.

నాగ చైతన్య, ఫార్ములా 1, సూపర్‌కార్‌లు, మోటార్‌సైకిళ్ల ను అమితంగా ఇష్టపడతారు. ఆయనకు మోటార్‌స్పోర్ట్‌పై చాలా ప్యాషన్ వుంది. స్పోర్ట్స్ పట్ల అతని ఆసక్తి, ఉత్సాహం, ఇండియన్ మోటార్‌స్పోర్ట్ డొమైన్ యొక్క సమగ్ర వృద్ధికి దోహదపడే గొప్ప ఉద్దేశంతో రేసింగ్ టీం లో ఇన్వెస్ట్ చేశారు.

దీని గురించి నాగచైతన్య మాట్లాడుతూ.. “మోటార్‌స్పోర్ట్‌లో భాగం కావాలని ఎప్పుడునుంచో చూస్తున్నాను. హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ టీమ్‌లో భాగమైనందుకు చాలా అనందంగా వుంది. ఇండియన్ రేసింగ్ లీగ్ ఇండియన్ మోటార్‌స్పోర్ట్‌లో ఔత్సాహికులందరికీ గొప్ప వినోదాన్ని అందిస్తుంది. అలాగే యువ ప్రతిభావంతులకు వేదికగా నిలిచింది. ఈ సీజన్‌లో స్ట్రీట్ రేసుల కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇది వీక్షకులకు గొప్ప అనుభవంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. అన్ని వయసుల వారికి మోటార్‌స్పోర్ట్ పట్ల అవగాహన పెరుగుతుండటంతో, దానిలో భాగం కావడానికి ఇది గొప్ప సమయం. ఇది జరిగేలా చేసిన చేసిన మిస్టర్ అఖిల్‌కి ఈ సందర్భంగా థాంక్స్ చెప్పాలనుకుంటున్నాను.

ఇండియన్ రేసింగ్ లీగ్‌లో తొలి సంవత్సరంలో, హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ అందరి ప్రశంసలు అందుకుంది. జట్టులోని ఇద్దరు ప్రముఖ డ్రైవర్లు, అఖిల్ రవీంద్ర , నీల్ జానీ, డ్రైవర్స్ ఛాంపియన్‌షిప్‌లో ప్రశంసనీయమైన 1-2 ఫినిష్ ని సాధించారు. యూనిట్‌గా, HBB టీమ్స్ ఛాంపియన్‌షిప్‌లో రెండవ స్థానాన్ని పొందింది. వారి ఆశయాలను పెంచుకుంటూ, హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ ఈ సంవత్సరం FIA-సర్టిఫైడ్ ఫార్ములా 4 ఇండియన్ ఛాంపియన్‌షిప్‌లో పోటీ పడేందుకు సిద్ధమవుతోంది, ఈ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా వర్ధమాన, ఔత్సాహిక రేసర్‌లను ఆకర్షించడానికి ఎదురుచూస్తోంది.

RPPL చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ అఖిల్ రెడ్డి మాట్లాడుతూ.. “భారతదేశంలో మోటార్‌స్పోర్ట్ కోసం మా విజన్‌లో నాగ చైతన్య చేరడం పట్ల మేము సంతోషిస్తున్నాము. నాగచైతన్య ప్రభావవంతమైన నటుడు మాత్రమే కాదు, మోటర్‌స్పోర్ట్ పట్ల అవగాహన ఇష్టం వుండి, భారతదేశంలో మోటార్‌స్పోర్ట్‌ను అభివృద్ధి చేయడానికి సహకరించాలనుకునే వ్యక్తి. ఈ స్పోర్ట్స్ పట్ల హైదరాబాద్ హార్డ్ కోర్ ఔత్సాహిక ప్రేక్షకులను కలిగి ఉన్న నగరం, ఫ్లాగ్ బేరర్‌గా నాగ్‌ను మించిన వారు ఎవరూ లేరు. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ ప్లాట్‌ఫారమ్ ఎంత లాభదాయకంగా ఉందో, అది కలిగి ఉన్న సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి అతని పెట్టుబడి చాలా ఇంపార్టెంట్ స్టెప్’’ అన్నారు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved