|

29 August 2018
Hyderabad
టీడీపీ నేత, నటుడు నందమూరి హరికృష్ణ (61) నల్గొండ జిల్లా అన్నేపర్తిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. నెల్లూరు కావలిలో నందమూరి అభిమాని మోహన్ కుమారుడి పెళ్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముందున్న కారును ఓవర్‌టేక్ చేయబోయి.. డివైర్‌ను ఢీకొట్టారు. కారు ఎగిరి రోడు పడి.. ఎదురుగా వస్తున్న మరో వాహనం ఈ కారును ఢీ కొట్టింది. హరికృష్ణ గుండె, ఛాతికి బలమైన గాయాలైయాయి. స్థానికులు హరికృష్ణను నార్కట్‌పల్లి కామినేని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. వైద్యులు చికిత్స అందించిన లాభం లేకపోయింది. హరికృష్ణ మరణంతో టీడీపీ వర్గాలు.. నందమూరి అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. శ్రీకృష్ణావతారం చిత్రంతో బాలనటుడిగా నటించిన ఈయన.. తళ్ళా పెళ్ళామా? , తాతమ్మ కలలు, రామ్ రహీమ్, దాన వీర శూర కర్ణ, శ్రీరాములయ్య, సీతరామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, శివరామరాజు, సీతయ్య, టైగర్ హరిశ్చంద్రప్రసాద్, స్వామి, శ్రావణ మాసం చిత్రాల్లో నటించారు.
|
|
|
|
|