pizza

Nandamuri Balakrishna, Gopichand Malineni, Venkata Satish Kilaru, Vriddhi Cinemas’ Epic Actioner #NBK111 Titled Powerfully Dada, Title Glimpse Sends Masses Into Frenzy, Christmas Release On December 24
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని, వెంకట సతీష్ కిలారు, వృద్ధి సినిమాస్ ఎపిక్ యాక్షన్ మూవీ #NBK111 పవర్‌ఫుల్ టైటిల్ 'దాదా', మాస్ ను మెస్మరైజ్ చేసిన టైటిల్ గ్లింప్స్, క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న గ్రాండ్ రిలీజ్

You are at idlebrain.com > news today >

6 September 2026
Hyderabad

God Of Masses Nandamuri Balakrishna’s much-awaited stylish action entertainer #NBK111 under the direction of blockbuster maker Gopichand Malineni is already carrying strong buzz, ever since the glimpse titled “Entry Of An Era” was released on the star’s birthday. Produced by Venkata Satish Kilaru under the Vriddhi Cinemas banner, the film’s title has been announced through a poster and a small glimpse.

#NBK111 gets a powerful title Dada, and it represents the nature of Balakrishna’s character as a tough guy. Balakrishna is presented in a mass avatar, sporting sunglasses, a leather jacket and thick gold chain. With a weapon resting on his shoulder, his appearance gives off a strong rowdy and gangster-like vibe, perfectly complementing the title. His stern expression and commanding body language further add to the character’s intimidating personality.

Coming to the title glimpse, it opens with a voiceover describing the power and aura of Balakrishna’s character, referring to him as Sher (lion). As police officers surround him and issue a stern warning to shoot in his chest, Balakrishna responds with a powerful dialogue about what it truly takes to pull the trigger- an exchange that is sure to send his fans and the masses into a frenzy.

The glimpse looks extremely stylish, with director Gopichand Malineni presenting Balakrishna in a larger-than-life mass avatar. NBK is given the title- The King Of Chaos.  S Thaman amplifies the impact with his electrifying score, while the Raja Hoon Main track playing in the background adds even more energy and intensity to the sequence. Overall, the glimpse delivers a next-level mass experience, promising a high-voltage action entertainer.

The makers through the poster and the title glimpse have also announced the film’s release date. Dada is scheduled for its theatrical release on December 24, for Christmas to also offer perfect early New Year treat.

Dada features Manoj Manchu and Kajal Aggarwal in important roles. The technical team includes cinematographer Arvind S Kashyap and composer S Thaman. AS Prakash is responsible for production design, while Navin Nooli handles the editing. Sai Madhav Burra penned the dialogues, with Ram Lakshman, Ravi Varma and Vvenkat overseeing the film’s action choreography.

The project marks the reunion of Balakrishna with director Gopichand Malineni following the blockbuster success of Veera Simha Reddy. Expectations are naturally high for their latest collaboration, which is being mounted as a grand-scale action spectacle.

Cast: Nandamuri Balakrishna, Manoj Manchu, Kajal Aggarwal

Technical Crew:
Writer, Director: Gopichand Malineni
Producer: Venkata Satish Kilaru
Banner: Vriddhi Cinemas
Music: S Thaman
DOP: Arvind S Kashyap ISC
Editor: Navin Nooli
Production Designer: AS Prakash
Dialogues: Sai Madhav Burra
Fights: Ram Lakshman, Ravi Varma and Vvenkat


నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని, వెంకట సతీష్ కిలారు, వృద్ధి సినిమాస్ ఎపిక్ యాక్షన్ మూవీ #NBK111 పవర్‌ఫుల్ టైటిల్ 'దాదా', మాస్ ను మెస్మరైజ్ చేసిన టైటిల్ గ్లింప్స్, క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న గ్రాండ్ రిలీజ్

గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ #NBK111, బాలయ్య పుట్టినరోజున "ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా" అనే టైటిల్‌తో గ్లింప్స్ విడుదలైనప్పటి నుండి భారీ బజ్‌ను క్రియేట్ చేస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ను పోస్టర్, పవర్ ఫుల్ గ్లింప్స్ ద్వారా ప్రకటించారు.

#NBK111కు ‘దాదా’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. బాలకృష్ణ పోషిస్తున్న పాత్ర స్వభావాన్ని ప్రజెంట్ చేసేలా ఈ టైటిల్‌ ఉంది. పోస్టర్‌లో బాలకృష్ణ మాస్ అవతార్‌లో కనిపించారు. సన్‌గ్లాసెస్‌, లెదర్ జాకెట్‌, మెడలో భారీ గోల్డ్ చైన్‌తో స్టైలిష్‌గా కనిపించిన ఆయన.. భుజంపై వెపన్‌తో రౌడీ, గ్యాంగ్‌స్టర్ తరహా వైబ్‌ను తీసుకొచ్చారు. ఆయన సీరియస్ ఎక్స్‌ప్రెషన్‌, కమాండింగ్ బాడీ లాంగ్వేజ్ క్యారెక్టర్‌లోని పవర్‌ను మరింత ఎలివేట్ చేశాయి.

టైటిల్ గ్లింప్స్‌ బాలకృష్ణ క్యారెక్టర్ పవర్‌, ఆరాను ప్రజెంట్ చేస్తూ, ఆయనను ‘షేర్’ (సింహం)గా సంబోధించే వాయిస్‌ఓవర్‌తో వీడియో ఓపెన్ అవుతుంది. పోలీస్ అధికారులు ఆయనను చుట్టుముట్టి ఛాతిలో కాల్చేస్తామని హెచ్చరిస్తారు. ‘నాకు గురి పెట్టడానికి ఒంట్లో పొగరు వేలికి ట్రిగ్గర్ ఉంటే సరిపోదు.. బుల్లెట్స్‌కి బలుపు, గన్స్‌కి గట్స్ ఉండాలి' అని బాలయ్య చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్‌ అదిపోయింది, ఈ సీక్వెన్స్‌ అభిమానులను, మాస్ ఆడియన్స్‌ను ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేసేలా ఉంది.

దర్శకుడు గోపీచంద్‌ మలినేని బాలకృష్ణను లార్జర్‌ దేన్ లైఫ్ మాస్ అవతార్‌లో ప్రజెంట్ చేశారు. ఎస్. థమన్ ఎలక్ట్రిఫైయింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో గ్లింప్స్‌ ఇంపాక్ట్‌ను మరింత పెంచారు. బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే ‘రాజా హూన్ మైన్’ ట్రాక్ సీక్వెన్స్‌కు మరింత ఎనర్జీ, ఇంటెన్సిటీని తీసుకొచ్చింది. మొత్తంగా గ్లింప్స్‌ నెక్స్ట్ లెవల్ మాస్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తూ, హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై అంచనాలు పెంచింది.

పోస్టర్‌, టైటిల్ గ్లింప్స్‌ ద్వారా మేకర్స్ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు. ‘దాదా’ డిసెంబరు 24న థియేటర్లలోకి రానుంది. క్రిస్మస్‌తో పాటు ముందస్తు న్యూ ఇయర్ ట్రీట్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘దాదా’లో మంచు మనోజ్‌, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా అరవింద్‌ ఎస్. కశ్యప్‌, మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎస్. థమన్ పనిచేస్తున్నారు. ఏఎస్. ప్రకాశ్‌ ప్రొడక్షన్ డిజైన్‌ బాధ్యతలు నిర్వహిస్తుండగా, నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్‌ రాశారు. రామ్-లక్ష్మణ్‌, రవి వర్మ, వెంకట్‌ యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.

బ్లాక్‌బస్టర్ ‘వీరసింహారెడ్డి’ తర్వాత బాలకృష్ణ, గోపీచంద్‌ మలినేని మరోసారి కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. గ్రాండ్ స్కేల్‌లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ స్పెక్టకిల్ మాస్ ట్రీట్ ఇవ్వబోతుంది.

నటీనటులు: నందమూరి బాలకృష్ణ, మనోజ్ మంచు, కాజల్ అగర్వాల్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: గోపీచంద్ మలినేని
నిర్మాత: వెంకట సతీష్ కిలారు
బ్యానర్: వృద్ధి సినిమాస్
సంగీతం: ఎస్ థమన్
డీఓపీ: అరవింద్ ఎస్ కశ్యప్ ఐఎస్‌సి
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
ఫైట్స్: రామ్ లక్ష్మణ్, రవి వర్మ, వెంకట్



 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved