pizza

Nandamuri Balakrishna appreciates Hanuman
‘హను- మాన్’ చిత్రం కన్నుల పండుగలా వుంది: నటసింహ నందమూరి బాలకృష్ణ

You are at idlebrain.com > news today >

17 January 2024
Hyderabad

‘‘హను- మాన్’ చిత్రం కన్నుల పండగలా వుంది. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునేలా చిత్రాన్ని అద్భుతంగా తీశారు’’ అన్నారు నటసింహ నందమూరి బాలకృష్ణ. యంగ్ హీరో తేజ సజ్జా కథానాయకుడిగా, క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ 'హను-మాన్'. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని ఎపిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. తాజాగా హనుమన్ చిత్రాన్ని వీక్షించారు నందమూరి బాలకృష్ణ. అనంతరం చిత్ర యూనిట్ ని అభినందించారు.

ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. హనుమాన్ లో అద్భుతమైన కంటెంట్ వుంది. ఇప్పుడున్న టెక్నిక్ ని బ్రహ్మాండంగా వాడుకొని దర్శకుడు చాలా అద్భుతంగా చిత్రాన్ని తీర్చిదిద్దారు. హను-మాన్ కన్నుల పండగలా వుంది. శ్రీరాముడు, ఆంజనేయస్వామి వారు ఆశీస్సులతో ప్రేక్షకులకు అద్భతమైన చిత్రాన్ని అందించారు. సినిమా మేకింగ్ లో చాలా ప్యాషన్ కనిపించింది. చిత్ర నిర్మాతని కూడా కెప్టెన్ అఫ్ ది షిఫ్ అనాలి. సినిమా తీయడానికి రెండున్నరేళ్ళు పట్టిందదంటే మామూలు విషయం కాదు. ఇలా చేయాలంటే చాలా ప్యాషన్ కావాలి. అన్ని క్రాఫ్ట్స్ అద్భుతమైన పనితీరు కనపరిచాయి. డైరెక్షన్, ఫోటోగ్రఫీ, వీఎఫ్ఎక్స్, మ్యూజిక్, నటీనటులు.. ఇలా అందరూ ఎక్స్ ట్రార్డినరీ గా పెర్ఫార్మ్ చేశారు. అన్నీ వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునేలా చేశారు. హనుమాన్ టీం అందరికీ అభినందనలు. హనుమాన్ సెకండ్ పార్ట్ కోసం ఎదురుచూస్తున్నాను’’ అన్నారు

ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై నిర్మాత కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులతో పాటు విమర్శలు ప్రసంశలు అందుకొని బాక్సాఫీసు వద్ద రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved