pizza

Arjun Rampal On Board For Nandamuri Balakrishna, Anil Ravipudi, Shine Screens’ #NBK108
నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి, షైన్ స్క్రీన్స్ #NBK108 లో అర్జున్ రాంపాల్

You are at idlebrain.com > news today >
Follow Us

10 May 2023
Hyderabad

God Of Masses Natasimha Nandamuri Balakrishna and blockbuster director Anil Ravipudi’s much-awaited mass and action entertainer #NBK108 will feature several prominent actors in vital roles. This prestigious project in the deadly combination is being produced on a grand scale by Sahu Garapati and Harish Peddi under the banner of Shine Screens banner.

Kajal Aggarwal is the female lead in the movie and Sreeleela will be seen in a crucial role. Now, Bollywood actor Arjun Rampal comes on board for a powerful role. The announcement video sees Arjun Rampal saying a popular dialogue of Balakrishna. It also sees the conversation between Arjun Rampal and Anil Ravipudi. Arjun Rampal is making Tollywood debut with the movie and he joined the film’s shoot in the ongoing schedule in Hyderabad. It will be interesting to see Balakrishna and Arjun Rampal together on screen.

The makers on Ugadi eve released the film’s first-look poster to unveil two different looks of Balakrishna.

S Thaman composes tunes for #NBK108, while C Ram Prasad takes care of cinematography. Tammi Raju is the editor

NBK108 is scheduled for its theatrical release for Vijayadasami (Dussehra).

Cast: Nandamuri Balakrishna, Kajal Aggarwal, Sreeleela, Arjun Rampal

Technical Crew:
Writer, Director: Anil Ravipudi
Producers: Sahu Garapati and Harish Peddi
Banner: Shine Screens
Music Director: S Thaman
DOP: C Ram Prasad
Editor: Tammi Raju
Production Designer: Rajeevan
Fights: V Venkat

నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి, షైన్ స్క్రీన్స్ #NBK108 లో అర్జున్ రాంపాల్

గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ల మోస్ట్ అవైటెడ్ మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ #NBK108లో పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్ర ల్లో నటించనున్నారు. డెడ్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.

కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పుడు ఓ పవర్ ఫుల్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ తెరపైకి వచ్చారు. అనౌన్స్‌మెంట్ వీడియోలో అర్జున్ రాంపాల్, బాలకృష్ణ లెజెండ్ చిత్రంలోని ''ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు అనే పాపులర్ డైలాగ్ చెప్పారు. ఇందులో అర్జున్ రాంపాల్, అనిల్ రావిపూడి మధ్య సంభాషణ కూడా వుంది. అర్జున్ రాంపాల్ ఈ సినిమాతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తున్నాడు. హైదరాబాద్‌లో జరుగుతున్న షెడ్యూల్‌లో సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. బాలకృష్ణ, అర్జున్ రాంపాల్ లని కలిసి తెరపై చూడటం ఆసక్తికరంగా ఉండబోతుంది.

ఉగాది సందర్భంగా బాలకృష్ణ ను రెండు డిఫరెంట్ లుక్ లో ప్రజంట్ చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

#NBK108కి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. తమ్మి రాజు ఎడిటర్, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్. వెంకట్‌ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

NBK108 విజయదశమి (దసరా)కి థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది.

నటీనటులు: నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
బ్యానర్: షైన్ స్క్రీన్స్
సంగీతం: ఎస్ థమన్
డీవోపీ: సి రామ్ ప్రసాద్
ఎడిటర్: తమ్మి రాజు
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్
ఫైట్స్: వి వెంకట్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved