God Of Masses Nandamuri Balakrishna and sensational maker Koratala Siva are coming together for the first time for #NBK112, and the project has already become a hot topic among fans and industry circles alike. The announcement poster, carrying the powerful tagline "Power Meets Purpose, Mass Becomes A Movement," hinted at a film that blends larger-than-life heroism with a strong underlying message. Two successful producers Sudhakar Cherukuri of SLV Cinemas and Sudhakar Mikkilineni of Yuvasudha Arts come together to bankroll this exciting project.
Taking the buzz several notches higher, the makers have officially announced a spectacular launch ceremony for the project on June 25 at the TTD Temple in Venkatayapalem near Amaravati. The event is set to become a high-profile affair with Andhra Pradesh Ministers Nara Lokesh and Kandula Durgesh attending as chief guests.
Koratala Siva prepared the script, tailoring a powerful narrative that complements Balakrishna's towering screen image. With two proven forces of mass cinema joining hands for the first time, expectations are already soaring.
The film’s other cast and technical crew details will be announced soon.
గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ, సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని, SLV సినిమాస్, యువసుధ ఆర్ట్స్ #NBK112 అమరావతిలో జూన్ 25న గ్రాండ్ లాంచ్- ముఖ్య అతిథులుగా మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్
గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సంచలన దర్శకుడు కొరటాల శివ తొలిసారిగా #NBK112 చిత్రం కోసం జతకడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే అభిమానులు, సినీ వర్గాల్లో భారీ అంచనాలు పెంచింది. "Power Meets Purpose, Mass Becomes A Movement" అనే పవర్ ఫుల్ ట్యాగ్‌లైన్‌తో వచ్చిన అనౌన్స్‌మెంట్ పోస్టర్, ఈ చిత్రం ఎంత భారీ స్థాయిలో ఉండబోతుందో సూచించింది. ఇద్దరు విజయవంతమైన నిర్మాతలు SLV సినిమాస్ సుధాకర్ చెరుకూరి, యువసుధ ఆర్ట్స్ సుధాకర్ మిక్కిలినేని ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న అంచనాలను మరింత పెంచుతూ, అమరావతి సమీపంలోని వెంకటాయపాలెంలో ఉన్న TTD ఆలయంలో జూన్ 25న గ్రాండ్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరుకానుండటంతో ఈ కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనుంది.
బాలకృష్ణ భారీ స్థాయి స్క్రీన్ ఇమేజ్‌కు సరిపోయేలా కొరటాల శివ ఒక పవర్ ఫుల్ కథని సిద్ధం చేశారు. మాస్ సినిమాలు చేయడంలో ప్రసిద్ధి చెందిన ఇద్దరు దిగ్గజాలు తొలిసారిగా కలిసి పనిచేస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి.
ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.
నటీనటులు: నందమూరి బాలకృష్ణ
సాంకేతిక నిపుణులు:
రచన, దర్శకత్వం: కొరటాల శివ
నిర్మాతలు: సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని
బ్యానర్లు: SLV సినిమాస్, యువసుధ ఆర్ట్స్