1 September 2024
Hyderabad
Nandamuri Balakrishna's journey as an actor has been 50 years. On this occasion, the Telugu film industry organized a grand Golden Jubliee celebration in Hyderabad on Sunday. Along with Tollywood, other film industry celebrities and politicians have gathered. Along with the directors who have made movies with Balakrishna, movie celebrities Chiranjeevi, Venkatesh, Srikanth, Rana, Nani, Gopichand, Shiva Rajkumar, Upendra, Raghavendra Rao, B.Gopal, Paruchuri Brothers, Siddu Jonnalagadda, Vijay Devarakonda, Allari Naresh, Producers D Suresh Babu, Gemini Kiran, Suhasini, Indraja, Malashree, Sumalatha and others participated in the event.
Shyamala Devi Balakrishna, wife of Krishnamraju, honored Bala Krishna with a shawl. Balakrishna's family members along with political leaders attended the ceremony. All the guests congratulated Balakrishna.
Director Raghavendra Rao took a step to the song 'Jai Balayya' from the movie 'Veerasimha Reddy' and entertained the guests. Balakrishna along with Chiranjeevi greeted the guests who came to the ceremony and it was a special attraction of the event. Megastar Chiranjeevi greeted MLA Raghurama Krishnaraju by saying 'RRR' in his own style.
Boyapati Srinu said "I congratulate the Telugu film industry for coming together like this. It is very difficult to do 110 films, congratulations for doing films for 50 years. You have to do films as long as you have patience, as long as you have breath. We will be with you. Jai Balayya is a mantra, as long as there is in it. Energy will not be here yet, says Jai Balayya at Universal Studios. Historians are rarely born, NTR, who was born like that, was born to a great man and has been serving, acting and politics like him. He will definitely stand up for anyone who asks for help. He said that when everyone gets older, they get nervous, and Balayya gets more powerful.
Anil Ravipudi said: Talking about Balayya is a blessing. If you want to write dialogues about him, they will be born from Balayya. They come from body language. He said that it is possible for him to be like him as an actor, a politician and a humane man.
Dil Raju, Sana Buchi Babu, Gopichand Jai Balayya came on the stage and shouted slogans.
AP Cinematography Minister Kandula Durgesh said, "On behalf of the Andhra Pradesh state government, we are thankful to Balayya who acted for a long time and made films for Telugu people all over India for 50 years. It is a pleasure to participate in this program with him today. We will be sitting with him in the assembly. I pray that his fame will remain like this for 100 years.
The Chief Minister could not come due to floods. I have come on his behalf. Balayya should continue like this in the field of cinema, in the field of medical education and in the field of politics, I want God to bless you with coolness for a hundred years.
Taman said: I am very happy that they have given me films like Akhanda and Veera Simha Reddy. Jai Balayya said.
Sumalatha: I did two films with Balayya. As far as I know they are very simple and speak from their heart. His journey is exemplary. I want him to continue like this in the fields of cinema and politics," she said.
Kamal Haasan (Video): Balayya is a person remembered by everyone due to culture. He has only one god and teacher, his father is NTR. Balayya means pure mind and free spirit. I want him to be healthy and rich for a hundred years," he said.
Manchu Vishnu : I am in this state today because of my father and Balayya. Balakrishna makes a lot of mischief. His heart is pure. "No one else can do as much service as Balayya did in the medical field," he said.
Rana Daggubati: I was born on the day of the release of Balakrishna's film, that's why I am doing a bit of mischief, Jai Balayya said.
Nani says: Balayya's film journey is 10 years older than my age. Once you meet him, you will like him as soon as you see him up close. You should make another 100 films like this and live for 100 years,'' he said.
Faction wants to do a movie with Balayya:
Chiranjeevi said, "We are very happy to be part of this celebration of 50 years of Balayya Babu. I see it as a celebration not only for Balayya but for Telugu cinema. Balayya has achieved a rare record. NTR has a special place in people's minds. It is not a common thing for Bala Krishna to please the audience by playing the roles played by his father as his son. He has distinguished himself as a son worthy of his father. Samara Simha Reddy is also the ideal for me to do Indra movie. I have a desire to do a faction film with Balayya. Sometimes fans get into fights. We used to do some ceremonies for the fans to know there is a good relationship between the heroes. That's why our fans are so close together. No matter what auspicious thing happens in our house, Balayya must come and everyone dances together. In this journey of 50 years, Balayya still has the honour of acting as a hero. I wish God to give Balayya the same energy for 100 years. This service in the field of political & medical is the future of the earth. We are like a family. Fans understand that and want to stay together. Long live Balayya," he said.
Nandamuri Balakrishna said, "Today I would like to thank all my fans, my fellow actors and everyone who worked with me from the bottom of my heart. To the parents who gave birth to me, I will keep all of you in my heart. Also, I would like to thank my family, the producers, directors, actors, artists, technical team, my hospital team, the people of Hindupur and my fans for making this celebration a grand success. Special thanks to our Association, Producers Council, Chamber, Shreyas Media, Sai Priya Construction etc., who are behind this. Acting was not the only thing I learned from my father. Discipline, punctuality, culture. I also learned the same from Akkineni Nageswara Rao. Although we all compete in the film industry, there is only one healthy competition. Also, as others have said, I am in the fields of cinema, politics and medical services, so I am indebted to everyone who is the reason for it. Also thanks to my wife Vasundhara who supports me in everything I do."
Pemmasani said, "Thanks to Balayya who completed 50 years breaking records. We grew up watching you, you are our inspiration. You are an example to us in loving family and changing with the generation even as we grow older."
Manchu Mohan Babu said "Greetings to all who have come from all over India. Balayya is a different and unique actor as an actor since childhood. Balayya has the honour of acting in one film for more than 500 days. It is a joy to be elected as the MLA of Hindupur for 3 times. I pray to God that you will be safe and healthy."
Shiva Raj Kumar said, "We are like a family. I am like a younger brother to him. I am very happy to have acted in the same film with him. We used to be together when we were in Chennai. We want you to celebrate 100 years like this."
Venkatesh: Coming from NTR's family, Balayya Babu has earned a special place for himself. He has a specialty. Your journey of 50 years is a role model for many newcomers. Venkatesh entertained with the dialogue 'Flute Jinka mundu oodu, simham mundu kaadu’.
The event will feature Manshi Vishnu, Manchu Lakshmi, Gopichand, Padmasri Brahmanandam, Shiva Balaji, Raja Ravindra, Raghu Babu as well as producers Abhishek Aggarwal, Asian Sunil, Cherukuri Sudhakar, Mythri Movies Ravi, Dil Raju, KL Narayana, Suresh Babu, Gemini Kiran, as well as Telugu. From Film Producers Council, Secretaries Tummala Prasanna Kumar, YVS Chaudhary, Damodar Prasad, President and Secretary from Chamber of Commerce, Bharat Bhushan, Anil from Film Federation, Anupam Reddy from Telangana State Chamber of Commerce and others were present. Balakrishna wanted to celebrate many more such celebrations and chanted slogans of Jai Balayya. Also, the ceremony was held in a grand manner with actors Nirosha, Jeetha Rajasekhar, P Vasu from Manashree Tamil and other big names of the film industry and made this event grand success.
ఘనంగా బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ వేడుకలు - జై బాలయ్య అంటూ నినాదాలు!
నటుడిగా నందమూరి బాలకృష్ణ ప్రయాణానికి 50 ఏళ్లు. ఈ సందర్భంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌లో ఆదివారం భారీ స్థాయి స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించింది. టాలీవుడ్‌తోపాటు ఇతర సినీ పరిశ్రమల ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. బాలకృష్ణతో సినిమాలు చేసిన దర్శకులతో పాటు సినీ ప్రముఖులు చిరంజీవి, వెంకటేశ్, శ్రీకాంత్, రానా, నాని, గోపీచంద్, శివ రాజ్‌కుమార్, ఉపేంద్ర, రాఘవేంద్రరావు, బీ.గోపాల్, పరుచూరి బ్రదర్స్, సిద్దు జొన్నలగడ్డ, విజయ్ దేవరకొండ, అల్లరి నరేష్, నిర్మాతలు డి సురేష్ బాబు, జెమినీ కిరణ్, సుహాసిని, ఇంద్రజ, మాలశ్రీ, సుమలత తదితరులు ఈవెంట్‌లో పాల్గొన్నారు.
కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి బాలకృష్ణను శాలువాతో సత్కరించారు. బాలకృష్ణ కుటుంబ సభ్యులతోపాటు రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. అతిథులు అంతా బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు.
వేదికపై ‘వీరసింహారెడ్డి’ సినిమాలోని ‘జై బాలయ్య’ పాటకు డైరెక్టర్ రాఘవేంద్రరావు ఓ స్టెప్పు వేసి అతిథులను అలరించారు. ఈ వేడుకకు వచ్చిన అతిథులను చిరంజీవితో కలిసి బాలకృష్ణ పలకరించడం ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తనదైన శైలిలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ అంటూ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజును పలకరించి.. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు మెగాస్టార్
చిరంజీవి.
బోయపాటి శ్రీను మాట్లాడుతూ "తెలుగు చిత్ర పరిశ్రమ అంత కలిసి ఇలా వచ్చినందుకు అభినందిస్తున్నాను. 110 సినిమాలు చేయడం చాలా కష్టం, 50 సంవత్సరాలు సినిమాలు చేసినందుకు అభినందనలు. మీకు ఓపిక ఉన్నంత వరుకు, ఊపిరి ఉన్నంత వరకు మీరు సినిమాలు చేయాలి. మేము అంత మీతో ఉంటాం. జై బాలయ్య అనేది ఒక మంత్రం, అందులో ఉన్నంత ఎనర్జీ ఇంకా ఇక్కడ ఉండదు. యూనివర్సల్ స్టూడియోలో కూడా జై బాలయ్య అంటున్నారు. చరిత్రకారులు అరుదుగా పుడతారు, అలా పుట్టిన ఎన్టీఆర్, ఎటువంటి గొప్ప మనిషికి పుట్టి ఆయనలా సేవ, నటన, రాజకీయం నిలబెట్టుకుంటూ వచ్చారు. ఆయన ఎవరు సాయం కోరినా వారి కోసం కచ్చితంగా నిలబడతారు. అందరికీ వయసు పెరిగితే వణుకు వస్తుంది, బాలయ్యకు పవర్ పెరుగుతుంది’’ అని అన్నారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ: బాలయ్య గారి గురించి మాట్లాడటం ఓ వరం. ఆయన గురించి డైలాగ్స్ రాయాలంటే బాలయ్య గారి నుంచి పుట్టేస్తాయి. బాడీ లాంగ్వేజ్ నుంచి వచ్చేస్తాయి. నటుడిగా, రాజకీయ నాయకుడు, మానవత్వం ఉన్న మనిషిలా ఆయనలా ఉండటం ఆయనకే సాధ్యం’’ అని అన్నారు.
వేదికపైకి వచ్చిన దిల్ రాజు, సాన బుచ్చి బాబు, గోపీచంద్ జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు.
ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేశ్ "సుదీర్ఘకాలం పాటు నటిస్తూ 50 సంవత్సరాలపాటు యావత్ భారతదేశంలో ఉన్న తెలుగు వారి కోసం సినిమాలు తీసిన బాలయ్య గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరుపున కృతజ్ఞతలు. ఈరోజు ఇలా ఆయనతో ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం సంతోషం. ఆయనతో అసెంబ్లీలో కూర్చుంటూ ఉంటాం. ఆయన కీర్తి 100 ఏళ్ల పాటు ఇలాగే ఉండాలని ప్రార్థిస్తున్నాను. ముఖ్యమంత్రి వరదల కారణంగా రాలేకపోయారు. ఆయన తరపున నేను వచ్చాను. బాలయ్య గారు సినిమా రంగంలో, వైద్య ేసవ రంగంలో, రాజకీయ రంగంలో ఇలాగే కొనసాగాలి అని, దేవుడు మిమ్మల్ని నిండు నూరేళ్ళు చల్లగా ఉండేలా దీవించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.
తమన్ మాట్లాడుతూ : అఖండ, వీర సింహారెడ్డి వంటి సినిమాలను నాకు ఇచ్చినందుకు చాలా సంతోషం. జై బాలయ్య’’ అని అన్నారు.
సుమలత: నేను బాలయ్యతో రెండు చిత్రాలు చేశా. నాకు తెలిసినంత వరకు చాల సింపుల్‌గా ఉంటారు, మనస్పూర్తిగా మాట్లాడతారు. ఆయన ప్రయాణం ఆదర్శనీయం. ఆయన సినీ, రాజకీయ రంగాలలో ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.
కమల్ హాసన్ (వీడియో) : సంస్కారం వల్ల అందరూ గుర్తుపెట్టుకుని వ్యక్తి బాలయ్య. ఆయనకు తండ్రి, దైవం, గురువు ఒక్కరే, ఆయన తండ్రి ఎన్టీఆర్ గారు. బాలయ్య అంటే స్వచ్ఛమైన మనసు, స్వేచ్ఛగా ఉండే తత్వం. ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో బావుండాలి అని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.
మంచు విష్ణు : నేను ఈరోజు ఈస్థ్థాయిలో ఉన్నాను అంటే అది నాన్న గారు, బాలయ్య గారు వల్లే. బాలకృష్ణ గారు చాలా అల్లరి చేస్తారు. ఆయన హృదయం స్వచమైనది. బాలయ్యా గారు వైద్య రంగంలో చేసినంత సేవ ఇంకెవరు చేయలేనిది’’ అని అన్నారు.
రానా దగ్గుబాటి : నేను బాలకృUఫ్ ష్ణ గారి సినిమా విడుదల రోజునకె పుట్ట అందుకే ఇలా కొంచం అల్లరి చేస్తూ ఉంటా, జై బాలయ్య’ అన్నారు.
నాని మాట్లాడుతూ : బాలయ్యగారి సినీ జర్నీ నా వయసుకి 10 సంవత్సరాలు ఎక్కువ. ఆయన్ను ఒక్కసారి కలిసినా, దగ్గరగా చూసిన వెంటనే ఆయనను ఇష్టపడిపోతారు. మీరు ఇలాగే మరో 100 సినిమాలు చేయాలి, 100 ఏళ్ల బ్రతకాలి’’ అని అన్నారు.
బాలయ్యతో ఫ్యాక్షన్ సినిమా చేయలనుంది:
చిరంజీవి మాట్లాడుతూ " బాలయ్య బాబు 50 సంవత్సరాల ఈ వేడుకలో మేము పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది బాలయ్యకు మాత్రమే కాదు, తెలుగు చలన చిత్రానికి ఒక వేడుకలా చూస్తున్నాను. అరుదైన రికార్డు బాలయ్య సొంతం చేసుకున్నాడు. ఎన్టీఆర్ గారికి ప్రజల మదిలో ప్రత్యేక స్థానం ఉంది. ఆయన కొడుకుగా బాల కృష్ణ తండ్రి చేసిన పాత్రలు వేస్తూ ప్రేక్షకులను మెప్పించడం మామూలు విషయం కాదు. తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన తన ప్రత్యేకత చాటుకున్నారు. నేను ఇంద్ర సినిమా చేయడానికి ఆదర్శం కూడా సమర సింహా రెడ్డి. నాకు బాలయ్యతో కలిసి ఒక ఫాక్షన్ సినిమా చేయాలని ఒక కోరిక. అప్పుడప్పుడు ఫ్యాన్స్ గొడవలు పడుతుంటారు. ఫ్యాన్స్ కోసం హీరోల మధ్య ఎటువంటి మంచి బంధం ఉంటుందో తెలియడం కోసం కొన్ని వేడుకలు చేసుకునేవాళ్లం. అందుకే మా అభిమానులు కూడా కలిసి కట్టుగా ఉంటారు. మా ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగినా బాలయ్య తప్పక వస్తారుఎం అందరూ కలిసి డ్యాన్స్ కూడా వేస్తారు. 50 సంవత్సరాల ఈ ప్రయాణంలో ఇంకా హీరోగా నటించే ఘనత బాలయ్యకే సొంతం. భగవంతుడు బాలయ్యకు ఇదే ఎనర్జీ ఇస్తూ 100 ఏళ్లు బావుండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. రాజకీయ వైద్య రంగాలలో ఇలా సేవ చేయడం న భూతో న భవిష్యతి. మేము అంత ఒక కుటుంబం లాంటి వాళ్ళం. అది ఫాన్స్ అర్థం చేసుకుని కలివిడిగా ఉండాలని కోరుకుంటున్న. లాంగ్ లైవ్ బాలయ్య" అని అన్నారు.
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ " రోజు ఇంతమంది అభిమానులు, నా తోటి నటీనటులు, నాతో పని చేసిన ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు జన్మను ఇచ్చిన తల్లి తండ్రులకు, నాకు ఇంతటి అభిమానాన్ని ఇచ్చిన మీ అందరినీ నా గుండెల్లో పెట్టుకుంటాను. అలాగే నా కుటుంబం అయిన నిర్మాతలు, దర్శకులు, నటులు, కళాకారులు, సాంకేతిక బృందం, నా హాస్పిటల్ బృందం, హిందూపూర్ ప్రజలు, నా అభిమానులు అంత కలిసి ఈ వేడుకను ఇంత గొప్ప విజయం పొందేలా చేసినందుకు పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దీనికి వెనుక ఉంది నడిపించిన మా అసోసియేషన్, నిర్మాతల మండలి, ఛాంబర్, శ్రేయాస్ మీడియా, సాయి ప్రియ కన్స్ట్రక్షన్ తదితరులకు ప్రత్యేక ధన్యవాదాలు. నేను నా తండ్రి నుండి నేర్చుకున్నది నటన మాత్రమే కాదు. క్రమశిక్షణ, సమయానుకూలంగా, సంస్కారం. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు దగ్గర నుండి అదే నేర్చుకున్నాను. మేము అందరం చలన చిత్ర పరిశ్రమలో పోటీగా నటిస్తూ ఉన్నప్పటికీ ఒక ఆరోగ్య పరమైన పోటీ మాత్రమే ఉంటుంది. అలాగే మిగతా వారు అంత చెప్పినట్లు నేను సినీ, రాజకీయ, వైద్య సేవ రంగాలలో ఉంటూ ఇలా ఉన్నాను అంటే దానికి కారణం అయిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాను. అలాగే నేను చేసే ప్రతి పనిలో అండగా ఉంటున్న నా భార్య వసుంధరకు ధన్యవాదాలు" అని అన్నారు.
పెమ్మసాని మాట్లాడుతూ " రికార్డులు బద్దల కొడుతూ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బాలయ్య గారికి కృత్ఞతలు. మిమ్మల్ని చూస్తూ పెరిగాం, మీరే మా ఇన్స్పిరేషన్. కుటుంబంతో ప్రేమగా మెలగడంలో, వయసు పెరుగుతున్న కూడా తరానికి తగ్గట్లు మారడంలో మీరు మాకు ఒక ఆదర్శం"అని అన్నారు.
మంచు మోహన్ బాబు" భారత దేశంలో నలుమూలల నుండి వచ్చిన అందరికీ నమస్కారం. చిన్నతనం నుండి నటుడిగా విభిన్నమైన, విశిష్టమైన నటుడు బాలయ్య. 500 రోజులకు పైగా ఒక సినిమా ఆడటం అనే ఘనత బాలయ్యదే. 3 సార్లు హిందూపూర్ ఎంఎల్ఏగా ఎన్నికవడం చాల ఆనందకరం. మీరు క్షేమంగా ఆరోగ్యంగా ఉండలని దేవుడిని ప్రార్థిస్తున్నాను" అన్నారు.
శివ రాజ్ కుమార్ "మేము ఒక కుటుంబం లాంటి వాళ్ళం. ఆయనకు తమ్ముడు లాంటి వాడిని. ఆయనతో కలిసి ఒక్క సినిమాలో నటించినందుకు నాకు ఎంతో సంతోషం. మేము చెన్నైలో ఉన్నప్పటి కలిసి ఉండేవాళ్ళం. మీరు ఇలాగే 100 సంవత్సరాలు వేడుకలు చేసుకోవాలి అని కోరుకుంటున్నాం"ని అన్నారు.
వెంకటేష్ : ఎన్టీఆర్ గారి కుటుంబం నుండి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు బాలయ్య బాబు. ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది. 50 సంవత్సరాల నీ ప్రయాణం ఎంతో మంది కొత్త వారికి ఆదర్శం. 'ఫ్లూట్ జింక ముందు కాదు, సింహం ముందు కాదు అని డైలాగుతో వెంకటేష్ అలరించారు.
ఈ వేడుకలో భాగంగా మంచి విష్ణు, మంచు లక్ష్మి, గోపీచంద్, హాస్యనటుడు బ్రహ్మానందం, శివ బాలాజీ, రాజా రవీంద్ర, రఘు బాబు అలాగే నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, ఏషియన్ సునీల్, చెరుకూరి సుధాకర్, మైత్రి మూవీస్ రవి, దిల్రాజు, కేఎల్ నారాయణ, సురేష్ బాబు, జెమిని కిరణ్, అదేవిధంగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుండి సెక్రటరీలు తుమ్మల ప్రసన్న కుమార్ గారు, వైవిఎస్ చౌదరి గారు, చాంబర్ ఆఫ్ కామర్స్ నుండి ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ అయిన దామోదర్ ప్రసాద్ గారు, భరత్ భూషణ్ గారు, ఫిలిం ఫెడరేషన్ నుండి అనిల్ గారు, తెలంగాణ స్టేట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుండి అనుపమ్ రెడ్డి గారు తదితరులు హాజరయ్యారు. బాలకృష్ణ గారు ఇటువంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ జై బాలయ్య అనే నినాదాలు పలికారు. అలాగే నటులు నిరోషా, జీవిత రాజశేఖర్, మానశ్రీ తమిళ్ నుండి పి వాసు తదితర సినిమా ఇండస్ట్రీ పెద్దలు హారరావడంతో ఈ వేడుక ఎంతో ఘనంగా జరిగింది.
|