pizza

Nenekkadunna, Featuring Sasha chettri, Mimoh Chakravarthy, directed by Madhav Kodad and produced by Maruthi Shyam Prasad Reddy under Ajagava Arts and presented by KBR prepares for release on Feb 28
ఫిబ్రవరి 28న థియేటర్లలోకి మిమో చక్రవర్తి 'నేనెక్కడున్నా'... ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

You are at idlebrain.com > news today >

15 February 2025
Hyderabad

“Nenekkadunna” is an upcoming thriller film directed by Madhav Kodad and produced by Maruthi Shyam Prasad Reddy under the Ajagava Arts banner, with K.B.R presenting the film. This movie marks the Telugu debut of Mimoh Chakraborty, son of veteran Bollywood actor Mithun Chakraborty, alongside Airtel ad fame Sasha Chettri in the lead roles.

The theatrical trailer of the film was unveiled by renowned politician and Member of Parliament, Eatala Rajender. Speaking at the trailer launch event, Eatala Rajender emphasized the importance of films that uphold journalistic values and women’s empowerment. He encouraged audiences to support such films and extended his best wishes to producer Maruthi Shyam Prasad Reddy and director Madhav Kodad.

The story follows two investigative journalists who risk everything in pursuit of the truth. Their journey leads them to uncover a dangerous terrorist organization, Corrupted politicians throwing them into a web of high-stakes confrontations.

The film features a stellar supporting cast, including Murali Sharma, Mahesh Manjrekar, Pradeep Rawat, Sayaji Shinde, Abhimanyu Singh, Rahul Dev, Brahmanandam, Tanikella Bharani, Posani Krishna Murali, C.V.L. Narasimha Rao, Ravi Kale, Bhanu Chander, Ramana Chalkapalli, Milind Gunaji, Mihirah , Uttara, and Archana Gautam.

The film’s music is composed by Sekhar Chandra, with lyrics by Suddala Ashok Teja, and the background score is provided by Rajesh S.S. The cinematography is handled by Jayapal Nimmala, while the Filmi Gangsters team is responsible for editing. Renowned choreographer Prem Rakshit has designed the dance sequences, ensuring visually striking performances.

“Nenekkadunna” is set to hit theaters on February 28, 2025. As the release date approaches, more promotional material is expected to be unveiled to build anticipation among moviegoers.

ఫిబ్రవరి 28న థియేటర్లలోకి మిమో చక్రవర్తి 'నేనెక్కడున్నా'... ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

ప్రముఖ బాలీవుడ్ నటుడు, సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి, ఎయిర్ టెల్ ఫేం సశా చెత్రి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'నేనెక్కడున్నా'. కేబీఆర్ సమర్పణలో మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో మాధవ్ కోదాడ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫిబ్రవరి 28న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ ప్రజా నాయకుడు, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ చేతుల మీదుగా 'నేనెక్కడున్నా' ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ విడుదల అనంతరం ఈటల రాజేందర్ గారు మాట్లాడుతూ... "జర్నలిజం విలువలు, మహిళా సాధికారతపై తీసిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి. దర్శకుడు మాధవ్ కోదాడ, నిర్మాతలు కె.బి.ఆర్, మారుతి శ్యామ్ ప్రసాద్ రెడ్డికి నా శుభాకాంక్షలు" అని అన్నారు

'నేనెక్కడున్నా' సినిమాలో ఆనంద్ పాత్రలో మిమో చక్రవర్తి, ఝాన్సీగా సశా చెత్రి నటించారు. వాళ్లిద్దరూ జర్నలిస్ట్ రోల్స్ చేశారు. జీతం కోసం కాకుండా జనాల జీవితాల కోసం పాత్రికేయ రంగాన్ని ఎంచుకున్న ఆనంద్, ఝాన్సీ చేసిన కొన్ని స్టింగ్ ఆపరేషన్స్ వల్ల అవినీతిపరుల భాగోతాలు బయట పడతాయి. ఆ తర్వాత ఏమైంది? ఎన్ని ప్రమాదాలు ఎదుర్కొన్నారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 

మురళీ శర్మ, మహేష్ మంజ్రేకర్, ప్రదీప్ రావత్, షాయాజీ షిండే, అభిమన్యు సింగ్, రాహుల్ దేవ్, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, సీవీఎల్ నరసింహారావు, రవి కాలే, భాను చందర్, రమణ చల్కపల్లి, మిలింద్ గునాజి, మిహిర, ఉత్తర, అర్చన గౌతం తదితరులు నటించిన ఈ సినిమాకు డాన్స్: ప్రేమ్ రక్షిత్ , లిరిక్స్ : సుద్దాల అశోక్ తేజ, సంగీతం : శేఖర్ చంద్ర , ఫోటోగ్రఫీ : జయపాల్ నిమ్మల, ఎడిటింగ్: ఫిల్మీ గ్యాంగ్ స్టర్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: రాజేష్ S.S , సమర్పణ: కె.బి.ఆర్, నిర్మాత: మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి, స్టోరీ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ - డైరెక్షన్: మాధవ్ కోదాడ.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved