pizza

Actress Nidhhi Agerwal Files Cybercrime Complaint Against Social Media Harassment
సోషల్ మీడియా ద్వారా వేధిస్తున్న వ్యక్తిపై సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేసిన హీరోయిన్ నిధి అగర్వాల్

You are at idlebrain.com > news today >

09 January 2025
Hyderabad

Actress Nidhhi Agerwal has filed a cybercrime complaint against an individual who has been harassing her on social media. In her complaint, Nidhhi stated that the person was posting threatening comments, including statements about killing her. She revealed to the cybercrime police that the individual had been targeting both her and her loved ones, causing significant distress.

Nidhhi mentioned that the threats were putting her under immense mental pressure and requested legal action to be taken against the accused. The cybercrime police have accepted her complaint and are currently investigating the matter.

This year has been particularly significant for Nidhhi Agerwal in terms of her career. She is starring opposite Rebel Star Prabhas in The Raja Saab and Power Star and Deputy Chief Minister of Andhra Pradesh Pawan Kalyan in Hari Hara Veera Mallu. Both films are set for a pan-India release soon.

సోషల్ మీడియా ద్వారా వేధిస్తున్న వ్యక్తిపై సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేసిన హీరోయిన్ నిధి అగర్వాల్

సోషల్ మీడియా ద్వారా తనను వేధిస్తున్న వ్యక్తిపై సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేసింది హీరోయిన్ నిధి అగర్వాల్. సదరు వ్యక్తి తనను చంపేస్తానంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పంపిస్తున్నాడని కంప్లైంట్ లో నిధి పేర్కొంది. ఈ వ్యక్తి తనతో పాటు తనకు ఇష్టమైన వారిని టార్గెట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు నిధి అగర్వాల్ సైబర్ క్రైమ్ పోలీసులకు తెలిపింది. ఈ వ్యక్తి బెదిరింపుల వల్ల తాను మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నానని, సదరు నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిధి అగర్వాల్ తన ఫిర్యాదులో కోరింది. ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు నిధి అగర్వాల్ కంప్లైంట్ తీసుకుని, విచారణ చేపట్టారు

కెరీర్ పరంగా నిధి అగర్వాల్ కు ఈ ఏడాది ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. ఆమె రెబెల్ స్టార్ ప్రభాస్ సరసన రాజా సాబ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి హరి హర వీరమల్లు సినిమాల్లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు త్వరలో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved